logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాయలేడి మోసం...నలుగురిని మోసం చేసి ఉడాయించిన దివ్యాంగురాలు... మోసపోయిన మహిళలు ఆవేధనతో ఆందోళన అసలే పేదరికం...ఆపై అమాయకత్వం...నలుగురు మహిళలను మోసం చేసింది దివ్యాంగురాలైన మాయలేడి... ఐదు కోట్ల ఆస్థి ఉందని నలుగురు మహిళలను నమ్మించి తన వెంట తిప్పుకుంది. వారి అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుని ఉడాయించింది. అడ్రస్ లేకుండా పోయిన మాయలేడి చేతిలో మోసపోయిన మహిళలు ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. తమకు జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పేరు శైలజారెడ్డి. అసలు పేరు, అడ్రస్ ఎక్కడో స్పష్టంగా తెలియదు. దివ్యాంగురాలైన ఆమే, నలుగురు అమాయకులైన మహిళలను మోసం చేసి ధర్మపురిలో వదిలేసి పారిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ లో మంచిర్యాలకు వెళ్ళాల్సిన మహరాష్ట్రకు చెందిన లక్ష్మి, మంచిర్యాలకు చెందిన రమాదేవిని శైలజారెడ్డి అలియాస్ మాయలేడి పరిచయం చేసుకుంది. చదువురాని ఆ ఇద్దరు మహిళలను మాయమాటలతో నమ్మించి అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆ ముగ్గురు మరో ఇద్దరు మహిళలను కమాన్ పూర్ కు చెందిన మణెమ్మ, సిద్దిపేటకు చెందిన స్వరూపను చేరదీశారు. ఐదుగురు కలిసి గత కొద్దిరోజులుగా ప్రీ బస్ ప్రయాణంతో గుళ్ళు గోపురాలు తిరిగారు. దివ్యాంగురాలైన శైలజరెడ్డి తన తండ్రీ సుదర్శన్ రెడ్డి పేరిట బ్యాంక్ లాకర్ లో ఐదు కోట్లు ఉన్నాయని బ్యాంక్ పని అయిపోగానే నలుగురికి పది లక్షల చొప్పున క్యాష్ తోపాటు ఇళ్ళు కొనిస్తానని నమ్మించింది. అందుకు సంబందించి చెక్కుల రూపంలో 25 లక్షలు, 75 లక్షల నకిలీ చెక్కులు, బాండ్ పేపర్, బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేఖ చూపించింది. చదువురాని అమాయకులైన మహిళలు నిజమే కావచ్చని నమ్మి ఆమె వెంట తిరిగారు. అటో లేదంటే కారు ఎంగేజ్ చేసుకుని తిరిగారు అందుకు కావాల్సిన ఖర్చుల కోసం నలుగురు మహిళల నుంచే వసూలు చేసింది. గత దీపావళి ముందు రెండు పెట్టెలు తీసుకొచ్చి అందులో డబ్బులు ఉన్నాయని నమ్మించి పూజలు సైతం చేయించిందట. వాటిని తెరవకుండా నలుగురు మహిళలను కావలిపెట్టేదట. ఇప్పటికే 15 మందికి ఇళ్ళు కొనిచ్చానని మీకు కూడా ఇళ్ళు కొనస్తానని నమ్మేలా తాళం చెవిల గుత్తి చూపించింది. ఇళ్ళు కావాలంటే ఖర్చుల క్రింద మనిషికి కొంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో జల్సాలు చేసింది. అలా తిరుక్కుంటు తిరుక్కుంటు ధర్మపురికి చేరుకున్న ఐదుగురు గోదావరి తీరంలో గుడివద్ద రెండు పెట్టెలను పెట్టి ఇద్దరి అక్కడ ఉంచింది. ఒకరిని తన వెంట తీసుకుని వెళ్ళి సిరిసిల్లలో వదిలేసి పత్తాలేకుండా పారిపోయింది. ఓ రోజు గడిచినా శైలజారెడ్డి అలియాస్ మాయలేడి రాకపోయే సరికి అనుమానం వచ్చి నలుగురు మహిళలు కలిసి పెట్టెలను తెరిచిచూడగా అందులో చిత్తుకాగితాలు, తాళం చెవిల గుత్తి మాత్రమే లభించాయి. డబ్బులని, ఇళ్ళు కొనిస్తానని నమ్మించి గత 9 నెలలుగా తన వెంట తిప్పుకుని అందినకాడికి దండుకుని పారిపోయిందని ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబసమస్యలతో బయటకు వచ్చిన తమకు సాయం చేస్తానంటే నమ్మి ఆమెకు సేవ చేశామని అంటున్నారు మోసపోయిన మహిళలు. దివ్యాంగురాలు, పైగా మహిళ కావడంతో నమ్మి ఆమె వెంట తిరిగామని అంటున్నారు. ఇలా మోసం చేస్తుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. నమ్మితే నట్టేట ముంచేలా చేసిందని అంటున్నారు. హైదారాబాద్ అని మాత్రమే అని చెప్పిందని చదువురానితాము పూర్తిగా అడ్రస్ కూడా కనుక్కోలేదని చెబుతున్నారు. మోసం చేసిన మాయలేడి ఫేక్ బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేటర్ లు, ఫేక్ ఫోన్ నెంబర్ అందులో పొందుపర్చింది. అక్షరజ్ఞానం లేని అమాయకులైన మహిళలను మోసం చేసిన మాయలేడి ఆచూకిలేక ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు పిర్యాదు చేసేందుకు నిరాకరించిన మహిళలు, దివ్యాంగురాలు ఇలా మోసం చేస్తుందని ఉహించలేదని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతు స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. --------

7 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
7 hrs ago
f1511d14-56dd-4962-9c85-5f4eb07e957d

మాయలేడి మోసం...నలుగురిని మోసం చేసి ఉడాయించిన దివ్యాంగురాలు... మోసపోయిన మహిళలు ఆవేధనతో ఆందోళన అసలే పేదరికం...ఆపై అమాయకత్వం...నలుగురు మహిళలను మోసం చేసింది దివ్యాంగురాలైన మాయలేడి... ఐదు కోట్ల ఆస్థి ఉందని నలుగురు మహిళలను నమ్మించి తన వెంట తిప్పుకుంది. వారి అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుని ఉడాయించింది. అడ్రస్ లేకుండా పోయిన మాయలేడి చేతిలో మోసపోయిన మహిళలు ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. తమకు జరిగిన మోసాన్ని బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు. పేరు శైలజారెడ్డి. అసలు పేరు, అడ్రస్ ఎక్కడో స్పష్టంగా తెలియదు. దివ్యాంగురాలైన ఆమే, నలుగురు అమాయకులైన మహిళలను మోసం చేసి ధర్మపురిలో వదిలేసి పారిపోయింది. తిరుపతి రైల్వే స్టేషన్ లో మంచిర్యాలకు వెళ్ళాల్సిన మహరాష్ట్రకు చెందిన లక్ష్మి, మంచిర్యాలకు చెందిన రమాదేవిని శైలజారెడ్డి అలియాస్ మాయలేడి పరిచయం చేసుకుంది. చదువురాని ఆ ఇద్దరు మహిళలను మాయమాటలతో నమ్మించి అక్కున చేర్చుకుంది. అక్కడి నుంచి మంచిర్యాలకు వచ్చిన ఆ ముగ్గురు మరో ఇద్దరు మహిళలను కమాన్ పూర్ కు చెందిన మణెమ్మ, సిద్దిపేటకు చెందిన స్వరూపను చేరదీశారు. ఐదుగురు కలిసి గత కొద్దిరోజులుగా ప్రీ బస్ ప్రయాణంతో గుళ్ళు గోపురాలు తిరిగారు. దివ్యాంగురాలైన శైలజరెడ్డి తన తండ్రీ సుదర్శన్ రెడ్డి పేరిట బ్యాంక్ లాకర్ లో ఐదు కోట్లు ఉన్నాయని బ్యాంక్ పని అయిపోగానే నలుగురికి పది లక్షల చొప్పున క్యాష్ తోపాటు ఇళ్ళు కొనిస్తానని నమ్మించింది. అందుకు సంబందించి చెక్కుల రూపంలో 25 లక్షలు, 75 లక్షల నకిలీ చెక్కులు, బాండ్ పేపర్, బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేఖ చూపించింది. చదువురాని అమాయకులైన మహిళలు నిజమే కావచ్చని నమ్మి ఆమె వెంట తిరిగారు. అటో లేదంటే కారు ఎంగేజ్ చేసుకుని తిరిగారు అందుకు కావాల్సిన ఖర్చుల కోసం నలుగురు మహిళల నుంచే వసూలు చేసింది. గత దీపావళి ముందు రెండు పెట్టెలు

తీసుకొచ్చి అందులో డబ్బులు ఉన్నాయని నమ్మించి పూజలు సైతం చేయించిందట. వాటిని తెరవకుండా నలుగురు మహిళలను కావలిపెట్టేదట. ఇప్పటికే 15 మందికి ఇళ్ళు కొనిచ్చానని మీకు కూడా ఇళ్ళు కొనస్తానని నమ్మేలా తాళం చెవిల గుత్తి చూపించింది. ఇళ్ళు కావాలంటే ఖర్చుల క్రింద మనిషికి కొంత డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో జల్సాలు చేసింది. అలా తిరుక్కుంటు తిరుక్కుంటు ధర్మపురికి చేరుకున్న ఐదుగురు గోదావరి తీరంలో గుడివద్ద రెండు పెట్టెలను పెట్టి ఇద్దరి అక్కడ ఉంచింది. ఒకరిని తన వెంట తీసుకుని వెళ్ళి సిరిసిల్లలో వదిలేసి పత్తాలేకుండా పారిపోయింది. ఓ రోజు గడిచినా శైలజారెడ్డి అలియాస్ మాయలేడి రాకపోయే సరికి అనుమానం వచ్చి నలుగురు మహిళలు కలిసి పెట్టెలను తెరిచిచూడగా అందులో చిత్తుకాగితాలు, తాళం చెవిల గుత్తి మాత్రమే లభించాయి. డబ్బులని, ఇళ్ళు కొనిస్తానని నమ్మించి గత 9 నెలలుగా తన వెంట తిప్పుకుని అందినకాడికి దండుకుని పారిపోయిందని ఆవేధనతో ఆందోళన చెందుతున్నారు. కుటుంబసమస్యలతో బయటకు వచ్చిన తమకు సాయం చేస్తానంటే నమ్మి ఆమెకు సేవ చేశామని అంటున్నారు మోసపోయిన మహిళలు. దివ్యాంగురాలు, పైగా మహిళ కావడంతో నమ్మి ఆమె వెంట తిరిగామని అంటున్నారు. ఇలా మోసం చేస్తుందని అనుకోలేదని ఆవేదన చెందుతున్నారు. నమ్మితే నట్టేట ముంచేలా చేసిందని అంటున్నారు. హైదారాబాద్ అని మాత్రమే అని చెప్పిందని చదువురానితాము పూర్తిగా అడ్రస్ కూడా కనుక్కోలేదని చెబుతున్నారు. మోసం చేసిన మాయలేడి ఫేక్ బ్యాంక్ మేనేజర్ కు రాసిన లేటర్ లు, ఫేక్ ఫోన్ నెంబర్ అందులో పొందుపర్చింది. అక్షరజ్ఞానం లేని అమాయకులైన మహిళలను మోసం చేసిన మాయలేడి ఆచూకిలేక ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు పిర్యాదు చేసేందుకు నిరాకరించిన మహిళలు, దివ్యాంగురాలు ఇలా మోసం చేస్తుందని ఉహించలేదని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతు స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. --------

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు
    1
    జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ పాల్పడుతున్న చిల్లర కుట్రలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన మాజీ R&B మంత్రి ప్రశాంత్ రెడ్డి 20 తారీకు జరగబోయే కేసీఆర్ మహాసభ ను ఆటంకాలు కలిగించుటకు మరియు రాబోయే ఎన్నికల్లో నేను ఎక్కడ ఉడి పోతాను తెలియక సంబంధించిన అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా నియంతగా పరిపాలనను కొనసాగిస్తున్నట్లు ప్రజలే గమనించి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని మేము ఆశిస్తున్నాము అంటున్న టిఆర్ఎస్ నాయకులు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    2
    భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు…
పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో
సిబ్బంది తీరుపై విమర్శలు
భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Aru chandrakanti
    Aru chandrakanti
    Artist భీమ్‌గల్, నిజామాబాద్, తెలంగాణ•
    34 min ago
  • కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్‌లో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ బల్బులు అమర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
    1
    కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్‌లో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ బల్బులు అమర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
    user_PRAJA VYAVASTHA
    PRAJA VYAVASTHA
    Photographer నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.
    1
    కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • మెట్‌పల్లి, ఏప్రిల్‌ 17: మహిళా రాజకీయ ప్రాతినిధ్యం కోసం స్వర్గీయ కొమిరెడ్డి జ్యోతక్క చేసిన సుదీర్ఘ పోరాటాన్ని స్మరించుకుంటూ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె నివాసంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులు, నాయకులు పాల్గొన్నారు. 1998లోనే మహిళల రిజర్వేషన్ కోసం జ్యోతక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 27 ఏళ్ల తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు దిశగా ముందడుగు పడడం ఆమె దూరదృష్టికి నిదర్శనమన్నారు.అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు.
    2
    మెట్‌పల్లి, ఏప్రిల్‌ 17: మహిళా రాజకీయ ప్రాతినిధ్యం కోసం స్వర్గీయ కొమిరెడ్డి జ్యోతక్క చేసిన సుదీర్ఘ పోరాటాన్ని స్మరించుకుంటూ పట్టణంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె నివాసంలో నిర్వహించిన సమావేశంలో విద్యార్థినులు, నాయకులు పాల్గొన్నారు. 1998లోనే మహిళల రిజర్వేషన్ కోసం జ్యోతక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 27 ఏళ్ల తర్వాత మహిళా రిజర్వేషన్ అమలు దిశగా ముందడుగు పడడం ఆమె దూరదృష్టికి నిదర్శనమన్నారు.అనంతరం చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు.
    user_Mahammad Vaseem
    Mahammad Vaseem
    Milk delivery service మెట్‌పల్లి, జగిత్యాల, తెలంగాణ•
    21 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇందిరానగర్ లో రుణం చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ప్రవర్తించిన తీరు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యంతో రుణం చెల్లించలేని స్థితిలో ఉన్న వ్యక్తి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. గోపాల్ అనే ఐకేఎఫ్ బ్యాంకులో రుణం తీసుకున్నారు. అనారోగ్యంతో కాలు కోల్పోయిన గోపాల్ సకాలంలో రుణం చెల్లించలేదు. దీంతో బ్యాంక్ అధికారులు ఇంటికి వెళ్లి అనారోగ్యంతో ఉన్న గోపాల్ బయటికి గెంటేసి ఇంటికి తాళం వేసి సీజ్ చేశారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డ కుటుంబాన్ని చూసి స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వికలాంగుడని కనీస మానవత్వం లేకుండా ఎర్రటి ఎండలో బయటకు గెంటేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు జోక్యం చేసుకొని విచక్షణారహితంగా ప్రవర్తించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం పోలీసులు ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గులాబీ పూలు అందించి, భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై శనివారం పోలీసులు ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు గులాబీ పూలు అందించి, భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై సాయిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
    1
    జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ జెడ్పీటీసీ పిడుగు ప్రభాకర్ రెడ్డి సహా కీలక కాంగ్రెస్ నాయకులు
పలువురు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు రాజీనామా
చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం వైఖరికి నిరసనగా రాజీనామా
ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం గెలుపుకై శాయశక్తులా కృషి చేశాం
కొడిమ్యాల మండలానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ ఎమ్మెల్యే నెరవేర్చలేదు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే అనుచరులు స్కాంకు పాల్పడుతున్నారు
అన్ని తెలిసినా ఎమ్మెల్యే సత్యం ఆయన అనుచరులకే వంత పాడుతున్నారు
పూడూర్ ఖాదీ బోర్డు ల్యాండ్ ఏమైందో ఎమ్మెల్యే సత్యం చెప్పాలి అంటూ నిలదీసిన కాంగ్రెస్ నాయకులు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.