భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి
వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
- కామారెడ్డి జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని DSP విఠల్ రెడ్డి అన్నారు. పిట్లంలో నిర్వహించిన “అలైవ్ అరైవ్" కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి, రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని అన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి.మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వస్తి పుణ్యాహవాచనం నిర్వహించబడింది. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో ఐదు రోజులపాటు అభిషేకాలు జరుగనున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. అలాగే రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి దేవాలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు, ఇతర విశిష్ట పారాయణాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం శంకర విజయము పై ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించబడుతుంది. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- Post by Vishwamber Rao1
- క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- సాధన సురుల ఇంద్రజాల విన్యాసాలు... గన్నేరువరం మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సాధనసురుల ఇంద్రజాల విన్యాసాలు. సాధన సూర్యుల విన్యాసాలలో శత్రువుల నుండి మనం ఎలా రక్షించుకోవాలో కర్రతో కళాకారులు చేసిన విన్యాసాలు. అలాగే మట్టి తో మాణిక్యాలు తయారు చేసి రాళ్లతో దేవుళ్లను తయారు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్న ఇంద్రజాల విన్యాసాలకు మండల కేంద్రంలో చప్పట్ల కేరింతల మధ్యన విన్యాసాలు చేశారు చివరిలో దయ్యం గెటప్తో అందర్నీ ఆశ్చర్యపరిచారు..1
- ప్రజల సమస్యలను పరిష్కరించడానికి గ్రామాలకే స్వయంగా వస్తానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు 2 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి శంకుస్థాపన చేసి, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ధర్మారం మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు ఎర్రగుంటపల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను పదవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసి, 75 శాతం ట్రైబల్ విద్యార్థులకు, 25 శాతం ఇతర వర్గాలకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు. మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని, ఇది యువతకు క్రీడల్లో ప్రోత్సాహం కలిగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కజొన్న రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైతే ధర్మారం మండల కేంద్రంలో కూడా మక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో భద్రతా అంశాలపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా CPR అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుండె ఆగిన సందర్భాల్లో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా కాపాడాలి అనే విషయాలను సిబ్బందికి వివరించారు.1
- హైదరాబాదు బయలుదేరిన ఉద్యమకారులు ఉద్యమ కళాకారులు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదులో జరుగు ఉద్యమకారుల ఉద్యమ కళా కారుల సదస్సుకు తరలి వెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి హైదరాబాదుకు వెళ్ళిన వారిలో రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొజ్జ కనకయ్య ఉత్తర తెలంగాణ కన్వీనర్ బొడ్డు రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమ కళా కారుల జిల్లా అధ్యక్షులు వారాల దేవయ్య జిల్లా ఉపాధ్యక్షులు కనపర్తి హనుమాన్లుజిల్లా కార్యదర్శి మానువాడ లక్ష్మీనారాయణ మొగులోజి లక్ష్మీరాజం.దొంగరి లక్ష్మీరాజం. జిల్లా నాయకులు బొడ్డు నారాయణ.సిరిసిల్ల. శంకర్ పుల్కం లచ్చన్న దుమ్మా లక్ష్మీరాజం ఎర్ర రవి రాజా మామిండ్ల సత్తయ్య మెరుపుల గంగాధర్ బిల్లా వెంకట్ నర్సయ్య ఛావనపల్లి లక్ష్మీనారాయణ నల్లగొండ శ్రీనివాస్ మునిగంటి లక్ష్మీపతి తదితర కళాకారులు 60 మంది వరకు పాల్గొన్నారు.2
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలి *బడిడు పిల్లలు బడిలోనే ఉండాలి.... *మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ* ... *రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులకార్యక్రమంలో భాగంగా తేదీ 18 ఏప్రిల్ 2026 శనివారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచన్ పల్లి* *యందు బడిబాట* *కార్యక్రమాన్ని నిర్వహించారు*. *ఈ కార్యక్రమానికి* *ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాధికారిణి శ్రీమతి విజయ గారు హాజరయ్యారు*ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మెదక్ జిల్లా విద్యాధికారిని విజయ మాట్లాడుతూ* ..బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని*, *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు సకల వసతులు ఉన్నాయని , పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ బడిలో లభిస్తుందని, ఇది గ్రామీణ విద్యార్థులకు మంచి అవకాశం అని విద్య యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు తెలియజేశారుప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల తల్లిదండ్రులు, యువత గ్రామ పెద్దలు అందరూ సహకరించాలని* మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే మన విద్యార్థులను చదివించాలని ఆమె గ్రామస్తుల ఉద్దేశించి అన్నారుమరియు ఈ కార్యక్రమంలో హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి నాచారం మధుమోహన్ మాట్లాడుతూ* *ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయని వచ్చే విద్యా సంవత్సరం నాటికి మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని*, *ప్రభుత్వము కల్పించిన ప్రతి సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదిగి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు*. *చాలామంది గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తున్నారని వారికి సులభముగా చదువుకోడానికి ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో గ్రంథాలయాలు, సైన్స్ ల్యాబులు , కరాటే , యోగా మరియు సందర్శన ప్రదేశాలకు తీసుకపోవడంముఖ్యమైనటువంటి విషయాల పైన ప్రత్యేకమైన కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇవన్నీ అవకాశాలు సద్వినియోగం చేసుకొని గ్రామీణ విద్యార్థులు మంచి ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు*.*అనంతరం విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, బడిబాటకు సంబంధించిన కరపత్రంను విడుదల చేశారు*. ఈ కార్యక్రమంలో జిల్లా CMO అధికారి. రాజు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివరాజ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ ,. శశి కుమార్, ఎల్లం, రాజు, సంతోషి కుమారి, కృష్ణవేణి, విమల, గంగమణి, స్వప్న రాజేందర్ రెడ్డి, చక్రపాణి శశి కుమార్ రెడ్డి, సందీప్ కృష్ణ , త్యార్ల శ్రీనివాస్, మరియు ప్రజా ప్రతినిధులు గ్రామ యువత విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1