మహిళ బిల్లు కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వైఖరిని వ్యతిరేకిస్తూ బిజెపి ఆధ్వర్యంలో ఆందోళనలు బాన్సువాడ ఏప్రిల్ 18 బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమం సందర్భంగా నాయకులు నినాదాలు చేస్తూ కాంగ్రెస్ కూటమి నిర్ణయాన్ని ఖండించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారీశక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగతి సాధించి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టానికి విస్తృత మద్దతు లభించిందన్నారు. అయితే, పార్లమెంటులో ఈ బిల్లుకు కాంగ్రెస్ కూటమి ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేయడం మహిళల సాధికారతకు విరుద్ధమని ఆయన విమర్శించారు. మహిళల హక్కులను కాపాడాల్సిన పార్టీలు ఇలాంటి కీలక అంశాల్లో వ్యతిరేకంగా నిలవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా మహిళలు కాంగ్రెస్ పార్టీ కుట్ర మహిళల అభ్యున్నతికి అడ్డుపడుతున్న వారికి రానున్న ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం సమంజసం కాదనన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడమే నిజమైన అభివృద్ధి మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చిదుర సాయిలు జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ గజ్జల మహేష్ పాశం ఆమని భాస్కర్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు అనిల్ సిద్ది బాలరాజ్ రామకృష్ణ రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ మహిళా నాయకులు రేణుక విజయలక్ష్మి లక్ష్మి ఐశ్వర్య యమునా సవిత లావణ్య సారిక అంకిత బిజెపి నాయకులు గుడుగుట్ల శ్రీనివాస్ లక్ష్మీనారాయణ చీకట్ల రాజు చంద్రశేఖర్ గౌడ్ శ్రీకాంత్ నాగరాజు ప్రదీప్ సింగ్ వెంకట్ భూమేష్ పురుషోత్తం రాజు దత్తు సాయి రమేష్. తదితరులు పాల్గొన్నారు

- Post by Vishwamber Rao1
- కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్‌లో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ బల్బులు అమర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1
- కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.1
- క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.2
- విద్యార్థులు విద్యతోపాటు నైపుణ్యాలు నేర్చుకోవాలి: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య1
- పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడానికి నిరసిస్తూ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ కు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.1
- Post by Vishwamber Rao1