Shuru
Apke Nagar Ki App…
✒️- *అద్భుత దృశ్యం.. 6.5 లక్షల మంది గీతా పారాయణం* *కోల్కతాలో ఇవాళ నిర్వహించిన సామూహిక గీతా పారాయణంలో దాదాపు 6.5 లక్షల మంది పాల్గొన్నారు. హిందువుల్లో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు సనాతన్ సంస్కృతి సన్సద్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్, యోగా గురువు బాబా రాందేవ్, సాధువులు హాజరయ్యారు.* *లక్షలాది మంది ఒకేసారి పారాయణం చేస్తున్న వీడియో వైరలవుతోంది. ఇది గూస్ బంప్స్ తెప్పిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..!!*✍️
Vishwamber Rao
✒️- *అద్భుత దృశ్యం.. 6.5 లక్షల మంది గీతా పారాయణం* *కోల్కతాలో ఇవాళ నిర్వహించిన సామూహిక గీతా పారాయణంలో దాదాపు 6.5 లక్షల మంది పాల్గొన్నారు. హిందువుల్లో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు సనాతన్ సంస్కృతి సన్సద్ సంస్థ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్, యోగా గురువు బాబా రాందేవ్, సాధువులు హాజరయ్యారు.* *లక్షలాది మంది ఒకేసారి పారాయణం చేస్తున్న వీడియో వైరలవుతోంది. ఇది గూస్ బంప్స్ తెప్పిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..!!*✍️
More news from తెలంగాణ and nearby areas
- Post by Vishwamber Rao1
- కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి రోడ్‌లో సెంట్రల్ లైటింగ్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో చీకటి కారణంగా ప్రమాదాల భయం పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్పందించి సెంట్రల్ లైటింగ్ బల్బులు అమర్చాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.1
- కామారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ నేడు 19వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలపై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కాలువల పరిస్థితి, చెత్త సేకరణ, నీటి నిల్వలు వంటి అంశాలను పరిశీలించారు. డ్రైనేజీ నిల్వలు, చెత్త తొలగింపులో ఉన్న లోపాలపై అధికారులను అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై మరియు ప్రజా ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలని కాలనీవాసులను మున్సిపల్ అధికారులు సూచించారు.1
- క్రమశిక్షణ, సమయపాలన ప్రతి పోలీసుకు తప్పనిసరి శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరంచట్టం అందరికీ సమానం — ఏఆర్ డీఎస్పీ రంగా నాథ్ మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన పరేడ్ కార్యక్రమానికి ఏఆర్ డీఎస్పీ శ్రీ రంగా నాథ్ గారు హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, సమయపాలన, శారీరక దృఢత్వం మరియు ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ప్రతి పోలీసు ప్రతిరోజూ వ్యాయామం చేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ధైర్యం, చట్టాలపై అవగాహన కూడా అవసరమని పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలులో ఉండేలా కృషి చేయాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. విధులను నిర్వర్తించే సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ జర్జ్, ఆర్ఐ లు శైలందర్, రామకృష్ణ, ఎసై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో అక్రమాల ఆరోపణలు… పీపుల్ మీడియా ప్రజా సమాచార పత్రిక తెలంగాణ స్టేట్ నిజాంబాద్ డిస్టిక్ బాల్కొండ కాంసెన్సు మున్సిపల్ భీంగల్ పరిధిలో సిబ్బంది తీరుపై విమర్శలు భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీతం కంటే ‘గీత’కే ప్రాధాన్యత ఇస్తూ, మధ్యవర్తులతో కుమ్మక్కై సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం బహిరంగంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు సిబ్బంది బ్రోకర్ల నుంచి లాభాలు పొందుతూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ కేసులో మధ్యవర్తిత్వం చేసి పరిష్కారం చేస్తామని చెప్పిన ఘటన బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న మహిళతో పాటు జమాదార్ హోదాలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్టేషన్‌కు వచ్చే వ్యక్తులు, నమోదయ్యే కేసులు, ఫిర్యాదుదారుల వివరాలు, అధికారులతో జరిగిన చర్చలు వంటి సమాచారాన్ని మధ్యవర్తులకు చేరవేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఆధారంగా మధ్యవర్తులు లావాదేవీలు జరుపుతూ, సంబంధిత సిబ్బందికి లాభాలు చేకూరుస్తున్నారనేది బహిరంగ రహస్యమని స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా పోలీస్ స్టేషన్ ప్రతిష్ఠ దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే రైటర్‌కు డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని కూడా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిజానిజాలు వెలికితీసి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.2
- పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడానికి నిరసిస్తూ సంగారెడ్డిలోని పాత బస్టాండ్ ముందు బిజెపి ఆధ్వర్యంలో శనివారం ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, వాసు మాట్లాడుతూ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని విమర్శించారు. కాంగ్రెస్ కు మహిళలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు.1
- హుగ్గేల్లి చౌరస్తాలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జహీరాబాద్ పోలీసులు1
- Post by Vishwamber Rao1