Shuru
Apke Nagar Ki App…
నల్గొండలో సుభాష్ చౌరస్తాలో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లపల్లి ఇంద్ర
నల్గొండలో సుభాష్ చౌరస్తాలో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ నల్ల రిబ్బన్లతో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు... తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గ రాజకీయమని మండిపడ్డ పున్న కైలాష్ నేత.! సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసింది... బిజెపి తెలంగాణపై విషం చిమ్ముతుంది.. అనేకమంది బలిదానాలు పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తుంది... ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా! తెలంగాణలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తాం అంటూ హెచ్చరిక.. మహిళా బిల్లు ముసుకులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చలు పక్క ద్రోవ పట్టిస్తుంది... త్వరలో తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరిక... డిలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శ... తేజస్వి సూర్య చేసిన వాక్యాలపై మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.. కార్యక్రమంలో ఎండి ముంతాజ్ అలీ, పేరిక వెంకటేశ్వర్లు, నోముల జనార్ధన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, వేముల గోపీనాథ్, అంబల హరీష్, పల్లా రవితేజతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సుభాష్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ గత కొన్ని నెలలుగా పని చేయడం లేదు. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. అధికారుల వెంటనే స్పందించి సిగ్నల్స్ మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- వరంగల్ జిల్లా:రాయపర్తి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ మాట్లాడుతూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం దేశ చరిత్రలో నల్ల దినంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ దానిని అడ్డుకుని మహిళా ద్రోహం చేసిందని విమర్శించారు. వెంటనే కాంగ్రెస్, ఇండీ కూటమి నేతలు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళా లోకం ఏకమై కాంగ్రెస్ పార్టీని దేశంలో నుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వడ్లకొండ రవి, గడ్డం నరేందర్, రావుల అనిల్, మైస మహేందర్, మందపూరి రాజు, బూరుగు నవీన్, వీరబ్రహ్మం, గోరంట్ల ప్రభాకర్, చిర్ర నాగరాజు, పెండ్యాల గణేష్, మంచాల సుమన్ యాదవ్, బండారి దినేష్, జక్కుల సందీప్ యాదవ్, సిద్దు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన సదస్సు ఘనంగా జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు కీలక సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ కూడా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రమాదాలు క్షణాల్లో జరుగుతాయని, అందుకే డ్రైవింగ్ సమయంలో అప్రమత్తత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. హైవేలపై ఎల్లప్పుడూ ఎడమ వైపు ప్రయాణిస్తూ, అవసరమైనప్పుడు మాత్రమే ఓవర్‌టేక్ చేయాలని సూచించారు. రాత్రివేళల్లో లో-బీమ్ లైట్లు వినియోగించడం, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో ముందు-వెనుక సీట్లలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవడం వంటి అంశాలను స్పష్టంగా వివరించారు. పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, “‘అరైవ్ అలైవ్’ అంటే సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే కుటుంబానికి ఇచ్చే హామీ” అని భావోద్వేగపూరితంగా తెలిపారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. మోటార్ సైకిళ్లపై ముగ్గురు ప్రయాణించడం, అధిక లోడ్‌తో వాహనాలు నడపడం వంటి ప్రమాదకర చర్యలను మానుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సదస్సు ద్వారా వాహనదారుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు, ప్రమాదాల నియంత్రణకు దోహదపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.4
- Hyderabad Traffic Police #HyderabadTrafficPolice #CPRAwareness #SaveLives #RoadSafety #HyderabadNews #TrafficAwareness #HumanityFirst #EmergencyCare #HeartAttackHelp #PublicSafety #HyderabadPolice #LifeSavingSkills #CPRTraining #SafetyFirst #IndiaNews1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి.. *బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు... పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం... అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం... నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.? నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు... నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్... "రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు... ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్... సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️1