Shuru
Apke Nagar Ki App…
గ్రామపంచాయితీ పాలకవర్గం అక్రమ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేయునైనది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో మహిళల కోరిక మేరకు గ్రామసభలో గ్రామపంచాయితీ పాలకవర్గం అక్రమ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేయునైనది. ఈ తీర్మానాన్ని ఎక్సైజ్ అధికారులు సిరిసిల్ల అక్రమ మద్యాన్ని అమ్మకాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినము. కానీ చర్యలు శూన్యం ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
Bollam Saireddy జయం న్యూస్ మీడ
గ్రామపంచాయితీ పాలకవర్గం అక్రమ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేయునైనది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కంది కట్కూర్ గ్రామంలో మహిళల కోరిక మేరకు గ్రామసభలో గ్రామపంచాయితీ పాలకవర్గం అక్రమ మద్యం అమ్మకాలను నిషేధిస్తూ తీర్మానం చేయునైనది. ఈ తీర్మానాన్ని ఎక్సైజ్ అధికారులు సిరిసిల్ల అక్రమ మద్యాన్ని అమ్మకాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినము. కానీ చర్యలు శూన్యం ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
More news from తెలంగాణ and nearby areas
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కు చెందిన కూన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 13వ తేదీన హత్యకు గురికాగా పోలీసులు హత్య కేసును ఛేదించి నిందితుడి వివరాలను సిరిసిల్ల డిఎస్పి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా నాగేంద్ర చారి మాట్లాడుతూ.. ఒంటరిగా ఉంటున్న కూనలక్ష్మిని గమనించిన గడీల రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై జల్సాలకు డబ్బులు సరిపోనందున ఎలా అయినా డబ్బులు సంపాదించాలనుకుని కొంత కాలం నుండి రాజీవ్ నగర్ లో ఇంటిలో లక్ష్మీ ఒక్కతే ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి కత్తెరతో హత్య చేసి 2000 రూపాయలు నగదు, రెండు చీరలు, బ్యాంకు పాసుబుక్కులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు, హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ లు తీసుకెళ్లినట్లు చెవులకు ఉన్న బంగారు పుల్లలు తీయడానికి ప్రయత్నించగా అవి రాకపోవడంతో తన వద్ద ఉన్న కత్తెరతో రెండు చెవులను కత్తిరించి ఇంటికి తీసుకుపోయి అవి కడిగే ప్రయత్నం చేయగా ఆ బంగారు పోగులు పడిపోయాయని తెలిపారు. సాంకేతికత ఆధారంగా నిందితుని పట్టుకోవడం జరిగిందని అతని వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తెర రెండు చీరలు బ్యాంకు పాసుబుక్కులు రాజీవ్ ఆరోగ్యశ్రీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్లు 2000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.1
- lగన్నేరువరం: మండలం మైలారం గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈనెల 23న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి రావాలి అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమానికి విస్తృత స్థాయిలో ప్రజలను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో మూడు రోజుల క్రితం వృద్ధురాలు కోన లక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన గడీల రాజు ను చూసి వృధ్ధురాలు అరవడంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సమక్షంలో అరెస్ట్ అయిన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు, బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని టార్గెట్ గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. చోరీకి వెళ్ళిన రాజును చూసి వృద్ధురాలు అరవడంతో కత్తెరతో పొడిచేసాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2000 నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డిఎస్పి హెచ్చరించారు.2
- Post by Solanke Ravi4
- హుస్నాబాద్ సబ్ స్టేషన్ సమీపంలో కరీంనగర్ రహదారి పై ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.500 రూపాయల ట్యూషన్ ఫీజు కడితేనే హల్ టిక్కెట్లు ఇస్తానని కళాశాల ప్రిన్సిపాల్ బెదిరించినట్లు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని హాల్ టిక్కెట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులకు పోలీసులు నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు.1
- Post by నీరటి మహేందర్1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1