సిరిసిల్లలో వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు... నిందితుడు రాజును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో మూడు రోజుల క్రితం వృద్ధురాలు కోన లక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన గడీల రాజు ను చూసి వృధ్ధురాలు అరవడంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సమక్షంలో అరెస్ట్ అయిన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు, బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని టార్గెట్ గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. చోరీకి వెళ్ళిన రాజును చూసి వృద్ధురాలు అరవడంతో కత్తెరతో పొడిచేసాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2000 నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డిఎస్పి హెచ్చరించారు.
సిరిసిల్లలో వృద్ధురాలి హత్యకేసును చేధించిన పోలీసులు... నిందితుడు రాజును అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో మూడు రోజుల క్రితం వృద్ధురాలు కోన లక్ష్మి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలి ఇంట్లో చోరీకి వెళ్లిన గడీల రాజు ను చూసి వృధ్ధురాలు అరవడంతో కత్తెరతో మెడలో పొడిచి హత్య చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి సమక్షంలో అరెస్ట్ అయిన రాజును చూపించి వివరాలు వెల్లడించారు. జల్సాలకు అలవాటు పడిన రాజు డబ్బులు, బంగారం కోసం ఒంటరిగా ఉన్న లక్ష్మిని
టార్గెట్ గా చేసుకుని నేరానికి పాల్పడినట్లు డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. చోరీకి వెళ్ళిన రాజును చూసి వృద్ధురాలు అరవడంతో కత్తెరతో పొడిచేసాడని, స్థానికులు ఇచ్చిన క్లూతో విచారణ చేపట్టగా నిందితుడు పట్టుబడ్డాడని తెలిపారు. రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 2000 నగదు, మృతురాలి చెవి కమ్మలు, దివ్యాంగుల సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. బయోభారంతో ఉండే వృద్ధులను ఒంటరిగా వదిలిపెట్టవద్దని అలా వదిలిపెడితే వారి పిల్లలపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదని డిఎస్పి హెచ్చరించారు.
- Post by నీరటి మహేందర్1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో గురువారం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. సాయంత్రం మహా లింగార్చన కార్యక్రమంలో భాగంగా 365 జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు ఈశ్వర్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహించారు.1
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు వివరించారు. ర్యాలీలో హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదని సూచించారు. అనంతరం మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, వార్డు మెంబర్ గాడిపెల్లి రాజబాబు, పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక్ చారి, కరస్పాండెంట్ గంజి మహేందర్, డైరెక్టర్ కోటగిరి రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.1
- అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ సహకారంతో గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బి ఎస్ లత హాజరై, ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్. లత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, కొమురవెల్లి వేణుగోపాల్, జగిత్యాల, ధర్మపురి అగ్నిమాపక కేంద్రం అధికారులు కృష్ణ కాంత్, శ్రీకాంత్ సంబంధిత శాఖ ఉద్యోగులు, సిబ్బంది, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డా. రాణి, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్లతో మాట్లాడుతూ...రక్తదానం పట్ల ఇలాంటి అపోహలు అనుమానాలు అక్కరలేదని ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు. అలాగే, అగ్నిప్రమాదాలు మరియు ఇతర విపత్తులు సంభావించిన సందర్భంలో క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకొని ఆస్తులు, ప్రాణాలు కాపాడడంలో ముందుండేది అగ్నిమాపక సిబ్బందిదే ప్రధానపాత్ర అనీ, వారిని ముందుకు నడిపించే అధికారులే అసలైన రియల్ హీరోస్ అన్నారు. అనంతరం, అగ్నిమాపక శాఖలో అమరులైన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులు అర్పించారు. కాగా ఈ రక్తదాన శిభిరంలో జిల్లా అధికారి సైదులుతో పాటుగా 30 మంది అగ్నిమాపక అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు.4
- Post by JADI RAJU1
- సిరిసిల్ల లో ఇసుక స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎమ్మార్వో పై దాడి కి యత్నించారు. సిరిసిల్ల లో తహశిల్దార్ మహేశ్‌పై ఇసుక స్మగ్లర్లు ట్రాక్టర్ తోలో దాడికి యత్నించారు. ట్రాక్టర్ డ్రైవర్ శివరాత్రి శివాజీ పరార్ అయ్యారు. ప్రమాదం నుంచి తృటిలో తహశీల్దార్ తప్పించుకున్నారు. పోలీసులకు తహశిల్దార్ ఫిర్యాదు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ట్రాక్టర్ ను సీజ్ చేసి ఎమ్మార్వో కు రాశారు.2
- జయశంకర్ భూపాలపల్లి జిల్లామహాదేవపురం మండలం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు త్రివేణి విశ్రాంతి భవనంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ పాల్గొన్నారు. మౌలిక వసతుల విస్తరణపై చర్చించారు.1
- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1