సదాశివ నగర్ మండలం : ప్రజాపాలన ప్రగతిప్రణాళికలో భాగంగా సదాశివ నగర్ లో మండల స్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.

- పత్రిక ప్రకటన తేది :16.04.2026 కామారెడ్డి జిల్లా గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లో గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై, జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ స్థాయిలో సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారం అందించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మండల సమావేశంలో లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని ప్రాధాన్యంగా పరిగణించి, నిర్ణీత కాలంలో పరిష్కారం చూపించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఎదురవుతున్న తాగునీరు, రహదారులు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమర్థవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ సర్పంచ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కనీసం పది మంది రైతులతో ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయిల్ పామ్ పంట ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని కోరారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, శిక్షణలు అందిస్తూ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు.1
- : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలోని బాలాజీ ఫంక్షనల్ లో అరైవు-అలైవ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, పాల్గొని రోడ్డు భద్రత నియమాలను ఉల్లంఘించొద్దు ,సురక్షితంగా గమ్యాన్ని చేరాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్,జిల్లా వైద్య అధికారి శ్రీరామ్,జిల్లా ట్రాన్స్ పోర్ట్ అధికారి వెంకట స్వామి, డి ఎస్పీ ప్రసన్న కుమార్,మున్సిపల్ చైర్మన్ కనుగుల రాధిక భూపతి రాజ్,వైస్ ఛైర్మన్ దొంతి నరేష్ గౌడ్,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao1
- Indiramma Indlu Meeting Protocol Issue :స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు, జిల్లా సర్పంచుల పోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ మధ్యల ప్రోటోకాల్ పై రగడ జరిగింది. బుధవారం నాడు కౌడిపల్లి రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే కోటా కింద మంజూరైన ఇందిరమైండ్ల పత్రాల పంపిణీ సమావేశానికి స్థానిక ఎంపీడీవో అధ్యక్షత వహిస్తూ జిల్లా సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షులు గ్రామ సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ ని వేదిక నల్లంకరించాలని ప్రసంగించగానే బి ఆర్ ఎస్ నాయకులు మిగతా సర్పంచ్ వేదిక పైకి పిలవాలంటూ నినాదాలు చేశారు. దీంతో స్థానిక సర్పంచ్ చంద్రం కృష్ణ గౌడ్ బీఆర్ఎస్ నాయకుడు దుర్గా రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. సర్పంచ్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులు స్థానిక సర్పంచికి సమాచారం ఇవ్వకుండా హుటాహుటిన ప్రభుత్వ కర్యక్రమాలు ఎలానిర్వహిస్తారని కృష్ణా గౌడ్ మండిపాటు. ఒక్కసారిగా వేడెక్కిన సమావేశం. ఇరు వర్గాల వాదనలతో సభ ప్రాంగణం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువర్గాలను శాంతింప చేసింది.ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు కౌడిపల్లి గ్రామానికి చెందిన దుర్గా రెడ్డి,సర్పంచ్ కృష్ణ గౌడ్ ని వేదిక పైకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించగా నీవు ఏ ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదాలో అడుగుతున్నావని దుర్గారెడ్డిని సర్పంచ్ కృష్ణ గౌడ్ గట్టిగా నిలదీశారు. దీంతో ఒక్కసారిగా రైతు వేదిక రస బసాగా మారింది.స్థానిక సర్పంచికి ప్రోగ్రాం గురించి ఆలస్యంగా సమాచారం అందించడం సరికాదన్నారు ఇరు వర్గాల వాదనలతో రైతు వేదిక దద్దరిల్లింది స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి కలగజేసుకొని ఇరువురిని శాంతింప చేసింది ఇవి రాజకీయ సమావేశం కాదని సభా సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుందని అది అందరూ పాటించాలని అన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే ఆయా గ్రామాల సర్పంచుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ డిఎల్ పి ఓ సాయి బాబా హౌసింగ్ డిఇ ప్రభు ఏఈ అభిషేక్ ఎస్సై అమర్ ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు4
- స్వీయ క్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి. జిల్లా కేంద్రంలో నేతన్న చౌరస్తాలో పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక Arrive Alive కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్,రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తా వద్ద వాహనదారులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....ప్రతి ఒక్కరు స్వీయక్రమశిక్షణతో రోడ్డు ప్రమాదాలను అరికట్టవచన్నారు. రోడ్డు పై ప్రయాణం చేసే సమయాల్లో మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మనతో పాటు ఎదుటివారిని కుటుంబాలని రోడ్డుపై పడేయచ్చని,ట్రాఫిక్ నింబంధనలు ఉన్నది మీ రక్షణ కోసమే అని ట్రాఫిక్ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యం చేరాలని తెలిపారు.వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని,మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, స్వీయారక్షణార్ధం హెల్మెట్ తప్పక ధరించాలని,వాహనాలు నడిపే సమయాల్లో మొబైల్ ఫోన్ వడాద్దని,తల్లిదండ్రులు మైనర్ పిల్లలు వాహనాలు ఇవ్వవద్దని మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు.జిల్లాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వస్తున్నామని ప్రజలు వాహనదారులు ట్రాఫిక్, రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ...రక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఆర్.ఐ సురేష్, ఎస్.ఐ శ్రీకాంత్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్,amvi పృథ్విధర్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.3
- గజ్వేల్ లో ఈతకెళ్లి యువకుడి మృతి సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ ఏప్రిల్ 16, గజ్వేల్ పట్టణానికి చెందిన యువకుడు కొలిచెలిమా మధు వయసు 25 సంవత్సరాలు ఎండలు బగ్గు మంటున్న కారణంగా పట్టణంలో గల స్విమ్మింగ్ పూల్ లో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు, కుటుంబ సభ్యులు బంధువులు వెళ్లి స్విమ్మింగ్ పూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా ఎవరు స్పందించడం లేదు. అందుచేత అందరూ కలిసి మాకు న్యాయం కావాలని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. మాకు న్యాయం కావాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.4
- బెజ్జంకి మండలంలోని రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మండల సభ గురువారం ముగిసింది. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ గేయాన్ని ఆలపించగా, అనంతరం మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ సీఎం సందేశాన్ని చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి, భువన చేయూత, పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తదితర పథకాల అమలు తీరును అధికారులు వివరించారు. గ్రామ స్థాయిలో సమస్యలు, పరిష్కారాలపై సర్పంచులు, అధికారులు చర్చించారు. అంగన్వాడి ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి భావన నాగరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్, తహసిల్దార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.1
- కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇందిరమ్మ లబ్ధిదారులు మాట్లాడుతూ....ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమకు స్థిరమైన నివాసం కలగడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఇంతకాలం ఎదుర్కొన్న గృహ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని, తమ కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం అందిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తమలాంటి పేదలకు ఇల్లు కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంబంధిత అధికారులు పథకం అమలులో పారదర్శకతను పాటిస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలోrdo nv గిరి, drdo సురేందర్, ప్రత్యేక అధికారి సతీష్, dmho రవీందర్, తహసీల్దార్ సత్యం, సర్పంచ్ శిరీష, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.1