గ్రామాల్లో తాగు నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాల కలెక్టర్ చిత్ర మిశ్రా *గ్రామాల్లో మంచినీటి బావులు పరిశీలన* ఎండలు పెరుగుతున్నందున.. గ్రామాల్లో ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయితీ పరిధి మల్లన్నపల్లి గ్రామాల్లో ఉన్న మంచినీటి బావులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని అందించి.. నీటి సమస్య తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ఇందుకోసం మంజూరైన ప్రభుత్వనిధులతో పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వాటి పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత నోడల్ అధికారులకు, ఎంపీఓలకు సూచించారు. గ్రామాల్లో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్లు, చేతి పంపుల స్థితి, వాటి వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. దీర్ఘకాలికంగా సమస్యను పరిష్కరించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ గనుల శాఖ అధికారులకు సూచించారు. డిపిఓ జగదీశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ శ్రీనివాస్, ఏఈ, డీఈ వినయ్, ఎంపీడీవో వేణుగోపాల చారి, ఎంపీ ఓ రాజగోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో తాగు నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాల కలెక్టర్ చిత్ర మిశ్రా *గ్రామాల్లో మంచినీటి బావులు పరిశీలన* ఎండలు పెరుగుతున్నందున.. గ్రామాల్లో ప్రజలకు మంచి నీటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి మండలం గుమ్లాపూర్, కాట్నపల్లి పంచాయితీ పరిధి మల్లన్నపల్లి
గ్రామాల్లో ఉన్న మంచినీటి బావులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆయా గ్రామాల్లో జనాభా అవసరాలకు అనుగుణంగా నీటిని అందించి.. నీటి సమస్య తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ఇందుకోసం మంజూరైన ప్రభుత్వనిధులతో
పెండింగ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పైప్‌లైన్‌లలో ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే నీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వాటి పూర్తి వివరాలను సమర్పించాలని సంబంధిత నోడల్ అధికారులకు, ఎంపీఓలకు సూచించారు. గ్రామాల్లో ఉన్న సింగిల్ ఫేజ్ మోటార్లు, చేతి
పంపుల స్థితి, వాటి వినియోగంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. దీర్ఘకాలికంగా సమస్యను పరిష్కరించేందుకు శాశ్వత ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, భూగర్భ గనుల శాఖ అధికారులకు సూచించారు. డిపిఓ జగదీశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఈ ఈ శ్రీనివాస్, ఏఈ, డీఈ వినయ్, ఎంపీడీవో వేణుగోపాల చారి, ఎంపీ ఓ రాజగోపాల్ చారి తదితరులు పాల్గొన్నారు.
- పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి *సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ మిషన్స్ డొనేషన్* యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో * ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై సానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో జెండర్ సమానత్వం పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి యువత మీ కళలు సాకారం చేసుకోండి అన్నారు * మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు. శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. డాక్టర్ ఉమేష్ కుమార్ వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ – వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్) డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం, డాక్టర్ సావిత్రి శాతవాహన యూనివర్సిటీ ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.2
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గోపాల్ నగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యూవల్ డే కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరు హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ గోపాల్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ సంస్కృత కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఆదరణను పెంచేలా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పోటీ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభగలవారీగా ప్రభుత్వం చే ఎంపిక చేయబడిన ఉపాధ్యాయులు విద్యా భోధన చేస్తారు కాబట్టి ఉపాధ్యాయులు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నేటి పోటీ ప్రపంచంలో ప్రవేట్ పాఠశాలల విద్యార్థులకంటే మెరుగైన విషయ పరిజ్ఞానాన్ని అందించి విద్యార్థులను ఉపాధ్యాయులు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని అన్నారు.నేడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ద్వారా కూడా విద్యను అందిస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ పాఠశాలను తక్కువ భావనతో చూడకుండ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ లు తీసుకోవాలని అన్నారు.. అనంతరం విద్యార్థుల ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా తిలకించారు.ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా కౌన్సిలర్ సభ్యులు ఎర్ర వెంకటరాజం కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, ఎంఈవో దూసరగుపతి, విద్యాశాఖ క్లస్టర్ ఇంచార్జ్ హెచ్ఎం మోతిలాల్, నెహ్రూ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతా మాధురి, బోప్ప దేవయ్య , ఓజ్జాల అగ్గి రాములు మొదలగువారు పాల్గొన్నారు.1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...4
- జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.1
- *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..* *అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..* *అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..* రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి.. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.4