logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

IIT-JEE (ΜΑΙΝ) -2026 ఫలితాలలో “అల్ఫోర్స్” కు ర్యాంకుల పంట...విద్యార్థులను అభినందించిన ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18 ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

IIT-JEE (ΜΑΙΝ) -2026 ఫలితాలలో “అల్ఫోర్స్” కు ర్యాంకుల పంట...విద్యార్థులను అభినందించిన ఆల్పోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి IIT-JEE (MAIN) 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎం.శ్రీపార్టీష్ 29 వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలువగా, సి.హెచ్. లక్ష్మీహాసిని 116 వ ర్యాంకు, సి.హెచ్.పూర్ణచంద్ 138, ఎస్.వర్జినిరెడ్డి 211, ఎన్.రత్నప్రకాశ్ 239, పి.అక్షయ 250, ఎ.కీర్తన 274, యు.సిద్దీశ్వర్ 459, కె. ధనుష్ 556, కె.నచికేత్ 593, బి. లిఖిత్సాయి 737, యమ్.వశిష్ట 884, కె. ప్రజ్ఞాన్ 991, రెడ్డి శ్రీకర్ 1000 వ ర్యాంకులు సాధించి అల్ఫోర్స్ కీర్తీని మరింత ఇనుమడింపజేశారని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డా. వి.నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను పేరెంట్స్ తోపాటు అధ్యాపకులు అభినందించారు. 1000 లోపు 14 ర్యాంకులు, 2000 లోపు 18

ర్యాంకులు, 5000 లోపు 35 ర్యాంకులు సాధించగా, 450 మంది విద్యార్థులు IIT (Adv) పరీక్షకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్ష వ్రాయుటకు ఎంపికైన విద్యార్థులకు అత్యుత్తమ అధ్యాపక బృందంచే కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల పట్టుదల అహర్నిషల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘన విజయం సాధించగలిగిందని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే IIT (Adv) పరీక్షలో కూడ అల్ఫోర్స్ విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి ప్రతిష్టాత్మక IIT లలో సీట్లు సాధిస్తారని విశ్వసిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం IIT, NEET EAPCET పోటీ పరీక్షలలో అల్ఫోర్స్ విద్యార్థులు రాణిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. IIT JEE (MAIN) - 2026 ఫలితాలలో జాతీయస్థాయి అత్యున్నత ర్యాంకులు సాధించిన అల్ఫోర్స్ విద్యార్థులను వారి తల్లిదండ్రులను అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..* *అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..* *అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..* రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి.. ముఖ్యమంత్రి ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు. రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.
    4
    *కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు..*మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు గౌరవం ఇచ్చాం..*
*అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఆహ్వానించాం..*
*అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు పై చర్చకు ఆహ్వానించినా స్పందించని కెసిఆర్..*
రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పోవాలి..
ముఖ్యమంత్రి  ఏకవచనంతో మాట్లాడడం తగదు..*కరీంనగర్ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి..* 
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదని కేసీఆర్ గౌరవం ఇచ్చి తెలంగాణలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కరీంనగర్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్ తో పాటు పలువురు నేతలతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో అన్నారు.* 
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఈనెల 20వ తేదీన నిర్వహించిన సభలో మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన ఎస్సీ వర్గీకరణ బిల్లు సందర్భంగా అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరినప్పుడు అసెంబ్లీకి రాలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
బీసీలకు 42 శాతం బిల్లు విషయంలో సైతం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని గౌరవంగా ఆహ్వానించారని అయినప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని మంత్రి అడ్లూరి అన్నారు. రాష్ట్రం 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే 2023 ఎన్నికల ఫలితాలకు ముందే బీఆర్ఎస్ నాయకులు మూడోసారి అధికారంలోకి వస్తామని ముందస్తు విజయోత్సవాలు నిర్వహించుకున్నారని మంత్రి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుబంధు నిధులు టింగు టింగుమని పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని 2023లో చివరి రైతుబంధు వేసినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ను అగ్గువకు కుదువబట్టి రైతుబంధు డబ్బులు జమ చేశారని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. 
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. 2014 నుండి 2018 వరకు 2018 నుండి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న జానారెడ్డి, భట్టి విక్రమార్క ఏనాడు ఏకవచనంతో ముఖ్యమంత్రి ని అమర్యాదగా మాట్లాడలేదని మంత్రి గుర్తు చేశారు. 
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలని అంటున్నారని ఎందుకు పోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు వంటి అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకు కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. 2014, 2018 ఇచ్చిన ఒక హామీను కేసీఆర్ నెరవేర్చలేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ మోసం చేశారని మంత్రి అన్నారు.
రెండు సంవత్సరాల నాలుగు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకంత కోపం అని మంత్రి అన్నారు. ధాన్యం కొనుగోలు పై జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో తరుగు, తప్ప, తాలు పేరుతో తూకంలో కోతలు విధించేవారని మంత్రి పేర్కొన్నారు.
ఇందులో 2023లో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. సన్నవడ్లకు రూ. 500 బోనాస్ ఇవ్వడంలో పాటు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మీ రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు అన్ని రకాల చర్యలు చేపట్టామని వచ్చే వర్షాకాలం యూరియా కోరత లేకుండ చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. 
రాష్ట్రం శాసనసభలో 64 మంది కాంగ్రెస్ సభ్యులు ఉండగా 40 మంది కొత్తగా ఎన్నికైన వారని మంత్రి తెలిపారు. అసెంబ్లీలో సీనియర్ సభ్యులుగా ఉన్న వారి నుంచి కొత్తగా ఎన్నికైన తాము సభ మర్యాదలు నేర్చుకుందామని అనుకుంటే బీఆర్ఎస్ సీనియర్  శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారికి ఏకవచనంతో సంబోధిస్తున్నారని ఇదేనా సీనియర్ సభ్యులు కొత్తగా ఎన్నికైన వారికి నేర్పించే మర్యాద అనే మంత్రి మండిపడ్డారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తన మంత్రి వర్గ సహచరులతో ఏనాడైనా మాట్లాడారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్ ఏం మాట్లాడినా కుటుంబంలోని హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావులతో మాత్రమే వారిని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
రెండున్నర సంవత్సరాల క్రితం ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి క్యాబినెట్లో అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పక్కన కూర్చొని అన్ని అంశాలపై చర్చించే స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నమని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాలను సమానంగా చూస్తూ సమాన అవకాశాలు కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలో వస్తుందని మంత్రి తెలిపారు. 
రాష్ట్రంలో ఎస్ సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వలను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం కేసు విషయం సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని సీబీఐ విచారణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి  సూచించారు.
ముఖ్యమంత్రి తో త్వరలో జగిత్యాలను సభ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించిన మంత్రి ఆ శాఖ మంత్రి కార్మిక సంఘాల నేతలతో మాట్లాడుతారని అన్నారు. గత ప్రభుత్వం లాగా తాము ఆర్టీసీ కార్మికుల ఇబ్బంది పెట్టమని మంత్రి అన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందించిన జూనియర్ అసిస్టెంట్ జన్మంచి లక్ష్మీరాజం బదిలీపై జగిత్యాల జిల్లా పెంబట్లలోని దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందజేసి, స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందించారు.తదనంతరం, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ తరఫున అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి. వంశీ మోహన్ సమక్షంలో ఆలయ సిబ్బంది లక్ష్మీరాజంని కండువాతో సత్కరించి, ఆయన సుదీర్ఘ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘునందన్, ఏఈఓ శ్రవణ్ కుమార్, జయకుమారి పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, రాజు, పూజిత,శివ సాయి , మరియు ఇతరులు పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 17 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సేవలందించిన జూనియర్ అసిస్టెంట్ జన్మంచి లక్ష్మీరాజం బదిలీపై జగిత్యాల జిల్లా పెంబట్లలోని దుబ్బ రాజేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందజేసి, స్వామివారి శేషవస్త్రం మరియు లడ్డూ ప్రసాదాన్ని అందించారు.తదనంతరం, రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఉద్యోగుల యూనియన్ తరఫున అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి. వంశీ మోహన్  సమక్షంలో ఆలయ సిబ్బంది లక్ష్మీరాజంని కండువాతో సత్కరించి, ఆయన సుదీర్ఘ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీఈవో భాస్కర్,డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రఘునందన్, ఏఈఓ శ్రవణ్ కుమార్, జయకుమారి పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, రాజు,  పూజిత,శివ సాయి ,  మరియు ఇతరులు పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    1
    ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    15 hrs ago
  • జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    1
    జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
    1
    వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో  మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను  వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారని, బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ లాంటిదని తెలిపారు. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని తెలిపారు. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.
    1
    ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి  ,నేను  ప్రభుత్వం  దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని  సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారని, బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ లాంటిదని తెలిపారు. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం  ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని తెలిపారు. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి గారు ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాం.. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
    1
    ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది..
నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు..
ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది..
ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి గారు  ,నేను  ప్రభుత్వం  దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని  సమస్యలు పరిష్కారం చేస్తాం..
65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.. 
ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ 
ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి  ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం  ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం..
ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, రుద్రవరం లోని ఇన్ టెక్ వెల్ ను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రాజెక్ట్ లలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.
    1
    వేసవి కాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి, సరఫరా, రుద్రవరం లోని ఇన్ టెక్ వెల్ ను క్షేత్రస్థాయిలో మంగళవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్ కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటి పారుదల, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ప్రాజెక్ట్ లలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ.. ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రిడ్ కార్య నిర్వాహక ఇంజనీర్లు అన్వర్, సుమలత, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.