Shuru
Apke Nagar Ki App…
గోదావరిలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు కుర్సం నాగేశ్వరరావు (45) దుర్మరణం – వెంకటాపురం మండలంలో విషాదం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
M D Azizuddin
గోదావరిలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడు కుర్సం నాగేశ్వరరావు (45) దుర్మరణం – వెంకటాపురం మండలంలో విషాదం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో మాదిగ సమాజం ఐక్యతపై ఎంఆర్పీఎస్ నాయకులు కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్ రాష్ట్ర అధ్యక్షులు జన్ను రాములు మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు మారుపట్ల అంజయ్య మాదిగ, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ఈరెల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు ఒక్కతాటిపై వస్తే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.1
- Post by JADI RAJU1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఇండియా కూటమి లోని వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేకుర్తిలో చెరువు పునర్జీవం పనులను మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ లో గల్లీ రోడ్డును అమృత్ నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహిళా బిల్లు కు సీఎం రేవంత్ రెడ్డి, స్టాలిన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. వారసత్వ కుటుంబ పార్టీలు మాత్రమే మహిళా బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. మహిళలు ఆ పార్టీలను క్షమించరని చెప్పారు. కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా ఉంటే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ ద్వారా పెంచాలని చూస్తే కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలంగాణ సమాజం గమనించాలని బండి సంజయ్ కోరారు.4
- Post by Tagore1
- పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి *సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ మిషన్స్ డొనేషన్* యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో * ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై సానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో జెండర్ సమానత్వం పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి యువత మీ కళలు సాకారం చేసుకోండి అన్నారు * మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు. శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. డాక్టర్ ఉమేష్ కుమార్ వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ – వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్) డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం, డాక్టర్ సావిత్రి శాతవాహన యూనివర్సిటీ ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.3
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1