అరకోటి రూపాయలు విలువచేసే సొత్తు. స్వాధీనం.. 5గురు అరెస్ట్ కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల ప్రకారం కాకినాడ సబ్ డివిజన్ ఏ.ఎస్.పి పాటిల్ దేవరాజ్ మనిష్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ పరిధిలో, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న రాత్రిపూట ఇంటి దొంగతనాల కేసులను డిటెక్ట్ చేయాలన్న ఉత్తర్వులపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు వారి సర్కిల్ ఎస్సైలు, క్రైమ్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్లో సిబ్బందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ముద్దాయిల గురించి ఆచూకీ తెలుసుకొని ఆదివారం గొల్లప్రోలు ఎస్ ఐ కి రాబడిన సమాచారం మేరకు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కేసు లో పిఠాపురం టౌన్ రైల్వేస్టేషన్ రోడ్డు నందు ఒక లాడ్జి రూమ్ లో ఉన్న 5 గురు ముద్దాయి లను గుర్తించి వారిని అరెస్ట్ చేసినారు. వల్లి లక్ష్మణ్ కుమార్ (రాజేంద్రనగర్, గైగోలు పాడు, కాకినాడ) ప్రస్తుతం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం.విత్తనాల దుర్గా ప్రసాద్ కిర్లంపూడి గ్రామం మండలం. (ప్రస్తుతం రాయుడు పాలెం, ఏపీ ఎస్ పి వెనుక, కాకినాడ).మజ్జి నరేంద్ర కుమార్ ,( శ్రీనివాస్ అపార్ట్మెంట్, ఒలేటి వారి వీధి, కాకినాడ.) ప్రస్తుతం ప్రతాప్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.వల్లి రామ్ కుమార్ (రాజేంద్రనగర్, గైగులపాడు, కాకినాడ ప్రస్తుతం నీలపల్లి గ్రామం, తాళ్లరేవు మండలం.)బీర సింహాచలం (కాకినాడ లోని అంబేద్కర్ కాలనీ గైగులు పాడు ) ఈ ఐదుగురు ముద్దాయిలు కొరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ల పరిధిలో తాళం వేసిన ఇండ్ల లో పగటి పూట రెక్కి చేసి రాత్రి వేళలో సదరు ఇంటి వద్ద హౌస్ లాక్ బ్రేకింగ్ నేరం లకు పాల్పడుతూ బంగారం మరియు వెండి వస్తువులను దొంగతనం చేసినారు. అంతే కాకుండా వాటితో పాటు గొల్లప్రోలు, పిఠాపురం టౌన్, పిఠాపురం రూరల్ మరియు యు . కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రదేశాలలో మోటార్ సైకిల్ నేరం లకు పాల్పడినారు. ఈ నేరములలో మొత్తం సుమారు 255.1 గ్రాములు బంగారు వస్తువులను, సుమారు 1760 గ్రాములు వెండి వస్తువులను వారి వద్ద నుండి రికవరీ చెయ్యడం జరిగిందన్నారు. అదే విధంగా వారి వద్ద నుండి 7 కేసు లలో 9 మోటార్ సైకిల్ లను మరియు నేరం చేసిన సొమ్ము తో కొనుగోలు చేసి నేరం చెయ్యు సమయంలో ఉపయోగించిన ఆటో ను కూడా రికవరీ చెయ్యడం జరిగినది. రికవరీ అయినా సొత్తు వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం 255 గ్రాములు,వెండి 1760 గ్రాములు, మోటార్ సైకిల్లు ( 9 ద్విచక్ర వాహనాలు) సోరీ సొత్తు విలువ సుమారుగా 51 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు.
అరకోటి రూపాయలు విలువచేసే సొత్తు. స్వాధీనం.. 5గురు అరెస్ట్ కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల ప్రకారం కాకినాడ సబ్ డివిజన్ ఏ.ఎస్.పి పాటిల్ దేవరాజ్ మనిష్ పర్యవేక్షణలో పిఠాపురం సర్కిల్ పరిధిలో, ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో గత సంవత్సర కాలంగా జరుగుతున్న రాత్రిపూట ఇంటి దొంగతనాల కేసులను డిటెక్ట్ చేయాలన్న ఉత్తర్వులపై పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాసు వారి సర్కిల్ ఎస్సైలు, క్రైమ్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్లో సిబ్బందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎంతో చాకచక్యంగా ముద్దాయిల గురించి ఆచూకీ తెలుసుకొని ఆదివారం గొల్లప్రోలు ఎస్ ఐ కి రాబడిన
సమాచారం మేరకు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కేసు లో పిఠాపురం టౌన్ రైల్వేస్టేషన్ రోడ్డు నందు ఒక లాడ్జి రూమ్ లో ఉన్న 5 గురు ముద్దాయి లను గుర్తించి వారిని అరెస్ట్ చేసినారు. వల్లి లక్ష్మణ్ కుమార్ (రాజేంద్రనగర్, గైగోలు పాడు, కాకినాడ) ప్రస్తుతం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామం.విత్తనాల దుర్గా ప్రసాద్ కిర్లంపూడి గ్రామం మండలం. (ప్రస్తుతం రాయుడు పాలెం, ఏపీ ఎస్ పి వెనుక, కాకినాడ).మజ్జి నరేంద్ర కుమార్ ,( శ్రీనివాస్ అపార్ట్మెంట్, ఒలేటి వారి వీధి, కాకినాడ.) ప్రస్తుతం ప్రతాప్ నగర్ లో నివాసం ఉంటున్నాడు.వల్లి రామ్ కుమార్ (రాజేంద్రనగర్, గైగులపాడు, కాకినాడ ప్రస్తుతం నీలపల్లి గ్రామం, తాళ్లరేవు మండలం.)బీర సింహాచలం
(కాకినాడ లోని అంబేద్కర్ కాలనీ గైగులు పాడు ) ఈ ఐదుగురు ముద్దాయిలు కొరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ ల పరిధిలో తాళం వేసిన ఇండ్ల లో పగటి పూట రెక్కి చేసి రాత్రి వేళలో సదరు ఇంటి వద్ద హౌస్ లాక్ బ్రేకింగ్ నేరం లకు పాల్పడుతూ బంగారం మరియు వెండి వస్తువులను దొంగతనం చేసినారు. అంతే కాకుండా వాటితో పాటు గొల్లప్రోలు, పిఠాపురం టౌన్, పిఠాపురం రూరల్ మరియు యు . కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రదేశాలలో మోటార్ సైకిల్ నేరం లకు పాల్పడినారు. ఈ నేరములలో
మొత్తం సుమారు 255.1 గ్రాములు బంగారు వస్తువులను, సుమారు 1760 గ్రాములు వెండి వస్తువులను వారి వద్ద నుండి రికవరీ చెయ్యడం జరిగిందన్నారు. అదే విధంగా వారి వద్ద నుండి 7 కేసు లలో 9 మోటార్ సైకిల్ లను మరియు నేరం చేసిన సొమ్ము తో కొనుగోలు చేసి నేరం చెయ్యు సమయంలో ఉపయోగించిన ఆటో ను కూడా రికవరీ చెయ్యడం జరిగినది. రికవరీ అయినా సొత్తు వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం 255 గ్రాములు,వెండి 1760 గ్రాములు, మోటార్ సైకిల్లు ( 9 ద్విచక్ర వాహనాలు) సోరీ సొత్తు విలువ సుమారుగా 51 లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు.
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మృతి చెందిన జర్నలిస్టు డేగల చినబాబు కుటుంబానికి ఆర్థిక సహాయం చెక్కు అందజేత ఇటీవల మృతి చెందిన ఏబీఎన్ అన్నవరం రిపోర్టర్ డేగల చినబాబు కుటుంబానికి జర్నలిస్టుల ఫెడరేషన్ అండగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో చినబాబు కుటుంబ సభ్యులకు సోమవారం ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు చినబాబు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చినబాబు మరణం జర్నలిస్టు సమాజానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్టకాలంలో జర్నలిస్టుల ఫెడరేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అధికార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చినబాబు జర్నలిజం రంగంలో ఎంతో అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఆయన ఎప్పుడూ ముందుండేవారని గుర్తుచేశారు. నిజాయితీ, నిబద్ధతతో వార్తలను అందించడంలో ఆయన చూపిన కృషి ఇతర జర్నలిస్టులకు ఆదర్శమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని, జర్నలిస్టులు లేదా వారి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చినబాబు కుటుంబానికి సంఘం తరఫున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిరంతరం పని ఒత్తిడితో జర్నలిజం వృత్తిని చేస్తున్న పలువురు అకస్మాత్తుగా మరణిస్తుండడంతో వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా చినబాబు కుటుంబ సభ్యులు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి సమయంలో జర్నలిస్టుల సంఘం అండగా నిలవడం తమకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు పుర్రె త్రినాథ్, కే.వి.సత్యనారాయణ, శ్రీధర్, ఎస్ కే ఇమ్రాన్, దుర్గా శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు రమణ, వెంకట్, ప్రసాద్, హరగోపాల్, ప్రవీణ్, లోవరాజు పడాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.6
- నల్లజర్ల మండలం చీపురుగూడెంలో సీసీ రోడ్ల పనులను ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సోమవారం పరిశీలించారు. నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. గ్రామంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు కోరగా, తాగునీటి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.1
- चीन ने हांगकांग-झुहाई-मकाऊ (HZMB) ब्रिज के रूप में दुनिया का सबसे लंबा समुद्री पुल बनाया है, जो 55 किमी लंबा है। अक्टूबर 2018 में खुला यह पुल 3 शहरों को जोड़ता है और इसका एक महत्वपूर्ण 6.7 किमी हिस्सा समुद्र के नीचे एक टनल के रूप में बना है, जिससे यात्रा का समय 4 घंटे से घटकर 30 मिनट हो गया है।1
- ఆంధ్రప్రదేశ్ పోలవరం జిల్లా చింతూరు మండలం సూరన్న గొంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల యేలకాలం నుండి శిధిలమైన పాఠశాలలోనే పిల్లల చదువులు కొనసాగుతున్న దీన పరిస్థితి అధికారులు వచ్చిన చూసి చూడనట్లు వ్యవహరించి వెళ్లడం తప్ప గ్రామస్తులు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ స్పందించని అధికారులు గిరిజన అభివృద్ధి సంస్థ ఎంతో దూరం కాదు కేవలం 14 కిలోమీటర్ల దూరం మాత్రమే పిల్లలు వర్షం వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియని పరిస్థితి అయినా సరే టర్పాన్స్ వేసో ఎలాగో అలాగా పాఠశాల ఉపాధ్యాయులు సొర్వతీసుకొని పాఠశాలను నడిపించడం జరుగుతుంది దీనమైన పాఠశాలను ప్రజాప్రతినిధులు ఆసక్తి సూపి తక్షణమే నూతన పాఠశాల భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకోవడం జరుగుతుంది.2
- Post by Shyam1
- అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో పట్టాదారు భూమిపై వివాదం చెలరేగింది. గ్రామానికి చెందిన డేగల అప్పారావు పేరుమీద ఉన్న సర్వే నెంబర్ 28-2లో ఎకరం 20 సెంట్ల సొంత పట్టా భూమిని రెవెన్యూ అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామకంఠం భూమిగా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠానికి సంబంధించి సర్వే నెంబర్ 28-1లో ఇప్పటికే భూమి ఉండగా, అప్పారావు పట్టా భూమిని బలవంతంగా గ్రామకంఠంగా చూపించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనివెనుక ప్రభావశీలులైన కొందరు పెద్దల రాజకీయ హస్తం ఉందేమో అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత రెవెన్యూ అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు మరియు కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.1
- డుంబ్రిగూడ మండలంలోని అరకు ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ద్విచక్ర వాహనాల ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలు అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, లైవ్ యాక్సిడెంట్ వీడియోలు బయటకు వచ్చాయి. ఘటన క్షణాలు స్పష్టంగా రికార్డ్ కావడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.1
- కాకినాడ జిల్లాలో పులి సంచారం కలకలం..! కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడక గ్రామంలో పులి సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. గ్రామ సమీపంలోని పామాయిలు తోటలో రాత్రి వేళలో పొలంలో కట్టివున్న గేదెపై పులి దాడి చేసి చంపిన ఘటన కలకలం రేపింది. ఉదయం రైతులు పొలాలకు వెళ్లగా గేదె కళేబరం కనిపించడంతో పులి సంచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమీప గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని గ్రామ పెద్దలు సూచిస్తున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రాంతాన్ని పరిశీలించి, పులి సంచారం పై గమనిస్తున్నారు. గ్రామ పరిసరాల్లో రాత్రి వేళల్లో ఎవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా పులి ఆనవాళ్లు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.1