logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గుడివాడలో మిలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీ పాల్గొని సందడి చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గుడివాడ పట్టణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిలాద్-ఉన్-నబీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ముబారక్ సెంటర్ నుంచి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మైనార్టీ పెద్దలు తమ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే రాముతో పాటు కూటమి నేతలను ఘనంగా సత్కరించారు.మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న శాంతి ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ముబారక్ సెంటర్ నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ బస్టాండ్ సెంటర్, ఏలూరు రోడ్డు, నెహ్రూ చౌక్ సెంటర్, ఎజికే స్కూల్ సెంటర్ మీదుగా సాగి తిరిగి ముబారక్ సెంటర్‌కు చేరుకుంది.ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ వేడుకలను నిర్వహించారు. ర్యాలీ మార్గంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, మైనార్టీ పెద్దలు షేక్ మౌలాలి, షేక్ జానీ షరీఫ్, సయ్యద్ మున్వర్, మహమ్మద్ రఫీ, షేక్ సర్కార్, షేక్ ఇబ్రహీం, కరీముల్లా, సయ్యద్ జబీన్, అబ్బాస్, మైనార్టీ సోదరులు,చిన్నారులు మహమ్మద్ ప్రవర్తన స్తుతిస్తూ ఉత్సాహంగా పాల్గొనగ, యువత బైక్ ర్యాలీ నిర్వహించారు.

5 hrs ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
4eb980c2-14f3-4219-a132-79b63012f34f

గుడివాడలో మిలాద్-ఉన్-నబీ శాంతి ర్యాలీ పాల్గొని సందడి చేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గుడివాడ పట్టణంలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిలాద్-ఉన్-నబీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ముబారక్ సెంటర్ నుంచి భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొని ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా

e90ce829-a6f8-4152-8329-a888225a2c5e

మైనార్టీ పెద్దలు తమ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే రాముతో పాటు కూటమి నేతలను ఘనంగా సత్కరించారు.మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజును పురస్కరించుకుని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న శాంతి ర్యాలీలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హర్షం వ్యక్తం చేశారు. ప్రవక్త బోధించిన శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ముబారక్ సెంటర్ నుంచి ప్రారంభమైన శాంతి ర్యాలీ బస్టాండ్ సెంటర్, ఏలూరు రోడ్డు, నెహ్రూ చౌక్ సెంటర్, ఎజికే స్కూల్ సెంటర్ మీదుగా సాగి తిరిగి ముబారక్ సెంటర్‌కు

1e6c5676-3112-4e7a-8dc1-923c8b6ed827

చేరుకుంది.ర్యాలీలో ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో మిలాద్-ఉన్-నబీ వేడుకలను నిర్వహించారు. ర్యాలీ మార్గంలో ఏర్పాటు చేసిన సాంప్రదాయ నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, మైనార్టీ పెద్దలు షేక్ మౌలాలి, షేక్ జానీ షరీఫ్, సయ్యద్ మున్వర్, మహమ్మద్ రఫీ, షేక్ సర్కార్, షేక్ ఇబ్రహీం, కరీముల్లా, సయ్యద్ జబీన్, అబ్బాస్, మైనార్టీ సోదరులు,చిన్నారులు మహమ్మద్ ప్రవర్తన స్తుతిస్తూ ఉత్సాహంగా పాల్గొనగ, యువత బైక్ ర్యాలీ నిర్వహించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
    1
    డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని
ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
    1
    అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........
మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
    1
    ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి
సోదరా ABN రాధాకృష్ణ  మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు
మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ
కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా
ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    4 hrs ago
  • ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.
    3
    ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు 
ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.
    user_Md.A.K.Jilani
    Md.A.K.Jilani
    Photographer అవనిగడ్డ, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    1
    ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం
మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    11 hrs ago
  • గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    4
    గ్రీన్‌ఫీల్డ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ మృతి
ఖమ్మం జిల్లా పెనుబల్లి ప్రాంతంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాటిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
    1
    మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం
నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. 

భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.