Shuru
Apke Nagar Ki App…
అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
Arja Durga Prasad
అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అనుమతి లేకుండా బైక్ ర్యాలీ.. యువతకు సీఐ సూచనలు........ మచిలీపట్నం: మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా బైక్ ర్యాలీ, డీజేలకు అనుమతి లేదని ఇనుగుదురుపేట సీఐ ముందుగానే స్పష్టం చేశారు. అయితే సీఐ సూచించిన సమయం కంటే ముందే కొంతమంది ముస్లిం యువత బైక్‌లతో బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మత పెద్దలు చెప్పిన విధంగా యువత నడుచుకోవాలని సీఐ సూచించి, పరిస్థితిని సర్దుబాటు చేసి యువతను అక్కడి నుంచి పంపించారు.1
- ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదు ఇంటి సమస్య పరిష్కారం చేసుకోలేని అసమర్ధుడు జోగి రమేష్ టీడీపీపై విమర్శలు చేస్తే సహించేది లేదని, మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై అవాకులు చవాకులు పేలితే ఇంటిని ముట్టడిస్తామని తెలుగు యువత జిల్లా అధ్యక్షులు దండమూడి చౌదరి హెచ్చరించారు. బుధవారం చల్లపల్లిలోని నందమూరి తారకరామారావు గ్రామ పంచాయతీ ఆవరణలోని ఎన్టీఆర్ కళా పరిషత్ వేదికపై ఆయన మీడియాతో మాట్లాడుతూ పెడన నియోజకవర్గాన్ని దోచుకుని, మంత్రిగాను విఫలమైన జోగి రమేష్ చివరికి కుటుంబ సమస్య పరిష్కారంలోనూ విఫలమయ్యారన్నారు. ఇంటి సమస్య పరిష్కారం చేతకాని జోగి రమేష్ బయటకు వచ్చి సీఎం నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై రాజకీయ విమర్శలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇంటి సమస్య తీర్చుకోలేక కులం కార్డు వాడుకుంటున్న జోగి రమేష్ రేపల్లె నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడి సజీవ దహనం ఘటనలో బీసీలకు అండగా నిలువకుండా కులానికి న్యాయం చేయని జోగి రమేష్ నేడు కులం కార్డు వాడుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబు, లోకేష్ లపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. లిక్కర్ కుంభకోణంలో జోగి రమేష్ అరెస్టు ఖాయం అన్నారు.3
- ఒళ్ళు దగ్గర పెట్టుకుని మర్యాదగా ఉంటే మంచిది . ఏబీఎన్ రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి సోదరా ABN రాధాకృష్ణ మాగురించి రాసే ముందు చూసుకొని రాయి, బావుండదు హెచ్చరిస్తున్నా.కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా ఉంటే మంచిది.ABN రాధాకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ABN లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది.మేము అనుకుంటే ఇక్కడ ఏ ఛానల్ ఉండదు, ఏ పేపర్ ఉండదు మీడియా అంటే, జర్నలిస్టులు అంటే నాకు గౌరవం ఉంది.ఇప్పుడు ABN ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది.. మా గురించి రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి రాధాకృష్ణ కానీ మీడియా ముసుగులో తెలంగాణలో మాలాంటి రాజకీయ నాయకులని కించపరిచే విధంగా చేస్తున్న ఆంధ్ర మీడియా ఛానళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా ఆంధ్ర మీడియా ఛానళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...1
- డయేరియా బాధితులను పరామర్శించిన ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని నాని ఉయ్యూరు నగర పంచాయతీ మాజీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అలియాస్ వల్లభనేని నాని డయేరియా బాధితులను పరామర్శించారు.ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి బ్రెడ్, పళ్ళు పంపిణీ చేశారు.స్థానిక కాపుల రామాలయం సెంటర్లో సుమారు పదిమందికి పైగా బాధితులను కలిసి వారి ఇంటి వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకొని, పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేసిన నాని. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉయ్యూరు టౌన్ టిడిపి మాజీ వైస్ ప్రెసిడెంట్ తుంగల పెద్ద రత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.1
- ప్రవక్త జన్మదిన సందర్భంగా గుంటూరులో స్వీట్లు పంపిణీ కార్యక్రమం మొహ్మద్ ప్రవక్త చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని YCP గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీఫాతిమా ప్రవక్త జన్మదిన సందర్భంగా స్వీట్లు పంపిణీఅన్నారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పొత్తూరువారితోటలోని వైసీపీ నగర కార్యాలయం వద్ద నూరీఫాతిమా స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రతీయేటా మిలాద్ ఉన్ నబీ నాడు సేవా కార్యక్రమాలను చేయడం ఆనవాయతీగా వస్తుందన్నారు. ప్రవక్త మహమ్మద్ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె అన్నారు1
- బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు1
- ఆర్ డబ్ల్యూ ఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన గుంటూరు జిల్లా మంగళగిరి.. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన కార్యాలయం వద్ద నిరసన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట నిలబెట్టుకోవాలి.. మా అసోసియేషన్ లో ఆరుగురు తో కమిటీ వేసి బకాయిలు విడుదల చేపిస్తామన్నారు ఇంతవరకు నెరవేరలేదు.. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సరఫరా కోసం పనులు చేసాము.. 2024 నవంబర్ నుంచి ఇప్పటివరకు మా నిధులు ఇంతవరకు చెల్లించలేదు.. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ధర్నాలు వినతి పత్రాలు ద్వారా తెలియజేశాము.. పవన్ కళ్యాణ్ కొత్త ప్లాట్ ఫామ్ లోకి బిల్లులు అప్లోడ్ చేయించుకుంటే పాత బకాయిలు సత్వరమే చెల్లిస్తామని భరోసా ఇచ్చారు.. 2026 జులై నాటికి దాదాపు 90 శాతం నుండి 95 శాతం వరకు తప్పకుండా కొత్త సిస్టంలో అప్లోడ్ చేయాలి.. ప్రస్తుతం ఫిట్టింగ్ బకాయి ఉన్న నాలుగువేల 133 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. మా సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడే ఉంటాము అంటూ తెలియజేశారు..2
- మహా ప్రళయం.. 98 సెకన్లలోనే పెను విషాదం నేపాల్ మెరుపు వరదలకు సంబంధించిన ఓ 98 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. భోటే కోషి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రసువా జిల్లాలో తీరంలో ఉన్న ఓ గ్రామం క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. భారీ భవంతులు సైతం మునిగిపోయాయి. బస్సులు, వ్యాన్లు, కార్లు ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణభయంతో కొందరు మనుషులు పరిగెత్తడం ఆ వీడియోలో కనిపించింది.....1