అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్' కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తన కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేసి ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో భాగంగా, పాఠశాలలు మరియు కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహించబడతాయి. అంతేకాకుండా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్-ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ కార్యక్రమాలు మరియు కమ్యూనిటీ విజిలెన్స్ కమిటీల ఏర్పాటు వంటి విభిన్న కార్యకలాపాలు చేపట్టబడతాయి. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన గట్టి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం (జూన్ 26) సందర్భంగా, కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 'యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్' కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తన కార్యాలయంలో పోస్టర్లను విడుదల చేసి
ఈ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాలలో భాగంగా, పాఠశాలలు మరియు కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు నిర్వహించబడతాయి. అంతేకాకుండా, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్-ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ కార్యక్రమాలు మరియు కమ్యూనిటీ విజిలెన్స్ కమిటీల ఏర్పాటు
వంటి విభిన్న కార్యకలాపాలు చేపట్టబడతాయి. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన గట్టి పిలుపునిచ్చారు.
- కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.1
- కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.1
- మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.4
- వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.3
- కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితులైన A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా, నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి @ సనోజ్ కుమార్ (21) ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా, రామడుగు మండల శివారులోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అక్కడ దాచి ఉంచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ తో పాటు, నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక రెడ్ మి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రం, పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్ కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. A12 మహమ్మద్ మెహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడని, అయితే ఈ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.3