logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితులైన A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా, నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి @ సనోజ్ కుమార్ (21) ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా, రామడుగు మండల శివారులోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అక్కడ దాచి ఉంచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ తో పాటు, నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక రెడ్ మి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రం, పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్ కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. A12 మహమ్మద్ మెహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడని, అయితే ఈ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.

1 hr ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
1 hr ago

కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితులైన A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా, నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం

నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి @ సనోజ్ కుమార్ (21) ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా, రామడుగు మండల శివారులోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అక్కడ దాచి ఉంచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ తో పాటు, నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక రెడ్ మి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రం, పాట్నాలోని పుల్వారి షరీఫ్

వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్ కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. A12 మహమ్మద్ మెహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడని, అయితే ఈ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు. ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ సీపీఐ (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ఇళ్లను పేదలకు పంచుతారా లేక సీపీఐ ఆధ్వర్యంలో వాటిని ఆక్రమించుకోమంటారా తక్షణమే తెలపాలని ఆయన సూటి ప్రశ్న వేశారు. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన ఈ డిమాండ్ చేశారు.

ఈ ధర్నా సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ నగరంలో అనేక మంది నిరుపేదలు ఇల్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చింతకుంట ప్రాంతంలో దాదాపు 600 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినప్పటికీ, అవి నిర్మించి పదేళ్లు కావస్తున్నా నేటికీ అర్హులైన వారికి కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్నాయని పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఈ ఇళ్లను ఇప్పటివరకు పంపిణీ చేయలేదని, వెంటనే అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఆ ఇళ్లను ఆక్రమించుకునేలా చేస్తామని ఆయన డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం సీపీఐ నాయకులు రెవిన్యూ డివిజనల్ అధికారి (ఆర్.డి.ఓ) షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కొట్టె అంజలి, ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరుకోలు సదానందం, దుడ్డేల సమ్మయ్య, సీపీఐ శాఖ కార్యదర్శులు గామినేని సత్యం, చెంచల మురళి, నగునూరి రమేష్, నునావత్ శ్రీనివాస్, బాకం ఆంజనేయులు, ఈ. భారతి, కాల్వ శ్రీనివాస్, తంగెళ్ళ సదయ్య, కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, మమత, స్వాతి, భూక్యా ముని, స్రవంతి, గుర్రం సదానందం, బరిగెల విజయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    14 hrs ago
  • కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    1
    కరీంనగర్ జిల్లా, గన్నేరువరం మండలం, చీమలకుంటపల్లి గ్రామంలో భూలక్ష్మి, శ్రీ లక్ష్మి బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవాలు సోమవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఈ ఉత్సవాల్లో భాగంగా గోపూజ, కుంకుమ పూజ, చండీ యాగాన్ని అపారమైన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ ఉత్సవాల ప్రారంభంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జంగిడి ప్రకాష్, పాలకవర్గం, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్‌లోని సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనితో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరిందని సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. పీఎంజే జ్యువెలరీ షాప్‌లో నేరుగా చోరీకి పాల్పడి, కాల్పులు జరిపిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్టవ్వగా, ఇప్పుడు మూడో వ్యక్తి సూర్యమణి @ సనోజ్ కుమార్ (21)ను పట్టుకున్నారు. నిందితులకు కారు సమకూర్చి, తుపాకులను సరఫరా చేసిన బీహార్‌కు చెందిన ఎం.డి. ఆదిల్ ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న ఆదిల్ ఖాన్‌ను కరీంనగర్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి పిస్టల్, మ్యాగజైన్, ఒక బైక్, దోపిడీ రోజు వారు ధరించిన ఐదు జతల బట్టలు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ ఆర్‌సీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు - A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్‌లను కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి కస్టడీ ఈ నెల 23న ముగుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ నుంచి టీవీఎస్ అపాచీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రామడుగు మండల శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ వద్ద కీలక ఆధారాలను సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక మొబైల్ ఫోన్, అక్కడ దాచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు.
    4
    కరీంనగర్‌లోని సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ షాపు చోరీ కేసులో పోలీసులు తాజాగా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనితో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 8కి చేరిందని సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. పీఎంజే జ్యువెలరీ షాప్‌లో నేరుగా చోరీకి పాల్పడి, కాల్పులు జరిపిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్టవ్వగా, ఇప్పుడు మూడో వ్యక్తి సూర్యమణి @ సనోజ్ కుమార్ (21)ను పట్టుకున్నారు. నిందితులకు కారు సమకూర్చి, తుపాకులను సరఫరా చేసిన బీహార్‌కు చెందిన ఎం.డి. ఆదిల్ ఖాన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్ జైల్లో ఉన్న ఆదిల్ ఖాన్‌ను కరీంనగర్‌కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితుల నుంచి పిస్టల్, మ్యాగజైన్, ఒక బైక్, దోపిడీ రోజు వారు ధరించిన ఐదు జతల బట్టలు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ ఆర్‌సీ కార్డులు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు - A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్‌లను కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి కస్టడీ ఈ నెల 23న ముగుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కస్టడీ విచారణలో నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ నుంచి టీవీఎస్ అపాచీ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రామడుగు మండల శివారులోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్ వద్ద కీలక ఆధారాలను సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక మొబైల్ ఫోన్, అక్కడ దాచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

కాగా, ఈ కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    37 min ago
  • మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    4
    మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలంలోని 76 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి విడతలో మండలానికి మంజూరైన 526 ఇళ్లలో 76 మంది లబ్ధిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంతో, వారి స్థానంలో కొత్త అర్హులను ఎంపిక చేసి ఈ పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

అర్హులందరికీ గృహాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వెల్లడించారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియను ప్రారంభించి, మండలవ్యాప్తంగా మరింత మంది అర్హులకు లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 'డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల' పేరుతో కాలయాపన జరిగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలిచి అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కోరారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన వరి ధాన్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యమకారుడు మరవేణి రంజిత్ కుమార్ సివిల్ సప్లైస్ మరియు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు యల్లారెడ్డిపేట కిషన్ దాస్ పేట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని రంజిత్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణం కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదని, గత అనేక సంవత్సరాలుగా ఇదే తరహా అక్రమాలు జిల్లాలో కొనసాగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొంత మంది అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు కుమ్మక్కై రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పాత్రను లోతుగా విచారించి నిజాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని రంజిత్ కుమార్ అన్నారు. సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిల ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం, మిల్లింగ్‌కు పంపిన ధాన్యం, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం మరియు ప్రస్తుతం మిగిలి ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలపై పూర్తి వివరాలను సేకరించి ప్రజలకు వెల్లడించాలని కోరారు. నిల్వలు, రికార్డులు, ఆన్‌లైన్ ఎంట్రీలు మరియు లెక్కల్లో ఉన్న వ్యత్యాసాలను గుర్తించి బాధ్యులను నిర్ధారించాలని సూచించారు. ఈ వ్యవహారం వల్ల రైతులకు, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుండి రికవరీ చేయడంతో పాటు, విచారణ పూర్తయ్యే వరకు అనుమానిత అధికారులు మరియు సంబంధిత ఇన్‌చార్జిలను విధుల నుండి తప్పించి నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యం విషయంలో జరిగిన ఈ అక్రమాలపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ మరియు సివిల్ సప్లైస్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగు చూసిన వరి ధాన్యం కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యమకారుడు మరవేణి రంజిత్ కుమార్ సివిల్ సప్లైస్ మరియు డైరెక్టర్ జనరల్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు యల్లారెడ్డిపేట కిషన్ దాస్ పేట్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియలో భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయని రంజిత్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణం కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం కాదని, గత అనేక సంవత్సరాలుగా ఇదే తరహా అక్రమాలు జిల్లాలో కొనసాగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కొంత మంది అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు కుమ్మక్కై రైతుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి పాత్రను లోతుగా విచారించి నిజాలను వెలికితీయాల్సిన అవసరం ఉందని రంజిత్ కుమార్ అన్నారు. సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిల ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, కొనుగోలు చేసిన మొత్తం ధాన్యం, మిల్లింగ్‌కు పంపిన ధాన్యం, ప్రభుత్వానికి అప్పగించిన బియ్యం మరియు ప్రస్తుతం మిగిలి ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలపై పూర్తి వివరాలను సేకరించి ప్రజలకు వెల్లడించాలని కోరారు. నిల్వలు, రికార్డులు, ఆన్‌లైన్ ఎంట్రీలు మరియు లెక్కల్లో ఉన్న వ్యత్యాసాలను గుర్తించి బాధ్యులను నిర్ధారించాలని సూచించారు.

ఈ వ్యవహారం వల్ల రైతులకు, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుండి రికవరీ చేయడంతో పాటు, విచారణ పూర్తయ్యే వరకు అనుమానిత అధికారులు మరియు సంబంధిత ఇన్‌చార్జిలను విధుల నుండి తప్పించి నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. రైతులు పండించిన ధాన్యం విషయంలో జరిగిన ఈ అక్రమాలపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ మరియు సివిల్ సప్లైస్ శాఖ సంయుక్తంగా ప్రత్యేక విచారణ చేపట్టి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    22 min ago
  • కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
    3
    కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నాడు సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో వర్షం పడితే నీరు నిలిచిపోయి చెరువును తలపిస్తుందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని, ఉన్నత పాఠశాలలో మూడు ఉపాధ్యాయ పోస్టులు, ఒక అటెండర్ పోస్టు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనా ఇంతవరకు ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. విద్యార్థుల కోసం అదనంగా రెండు తరగతి గదులను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న మరో రెండు గదులను ఆధునికరించాలని ఆయన కోరారు. అలాగే, పాఠశాలలకు సరిపడా మున్సిపల్ నీటిని సరఫరా చేయాలని, పనిచేయని పాత బోరుబావి స్థానంలో కొత్త బోరుబావిని వేసి విద్యార్థులకు తగిన నీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదకరంగా క్లాస్ రూమ్‌లపైకి చేరిన పెద్ద చెట్లను వెంటనే తొలగించాలని, గాలి దుమారం వస్తే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాటు చేసిన రెండు రేకుల షెడ్లు విరిగిపోయి శిథిలావస్థకు చేరాయని, వాటిని ఆధునికరించాలని వాసుదేవరెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వ బడుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే చదువుతున్నారని, వారికి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యను పేదలకు అందకుండా కుట్రలు చేస్తున్నాయని, తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్దేశించబడుతుందన్న స్ఫూర్తిని పాలకులు విస్మరిస్తున్నారని వాసుదేవరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేటు విద్యాసంస్థలను ప్రోత్సహిస్తూ, చదువులు కొనుక్కునే పరిస్థితిని పాలకులు తీసుకొచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వాసుదేవరెడ్డి పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు పుల్లెల మల్లయ్య, డి. నరేష్, శ్రీకాంత్, సూర్య, అరవింద్, భాస్కర్, ఇస్సాక్, ఆకాష్, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితులైన A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా, నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి @ సనోజ్ కుమార్ (21) ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా, రామడుగు మండల శివారులోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అక్కడ దాచి ఉంచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ తో పాటు, నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక రెడ్ మి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రం, పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్ కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. A12 మహమ్మద్ మెహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడని, అయితే ఈ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.
    3
    కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది.

ఈ నెల 17వ తేదీన కోర్టు అనుమతితో ఆరు రోజుల పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు ముఖ్య నిందితులైన A1 సుబోధ్ సింగ్, A2 రఘునాథ్, A3 రావిష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా, నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు, నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్‌ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

షోరూంలో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి అయిన సూర్యమణి @ సనోజ్ కుమార్ (21) ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా వచ్చిన సమాచారం ఆధారంగా, రామడుగు మండల శివారులోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అక్కడ దాచి ఉంచిన ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ తో పాటు, నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన ఐదు జతల దుస్తులు, మూడు జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్‌సి కార్డులు, ఒక రెడ్ మి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక నిందితుడు ఎం.డి. ఆదిల్ ఖాన్ ను బీహార్ రాష్ట్రం, పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటా కార్ డ్రైవర్ జైనులబ్దీన్ కు నేరానికి సహకరించేందుకు ఈ ఆదిల్ ఖానే క్రెటా కారును, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. A12 మహమ్మద్ మెహతాబ్ ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు గాను అరెస్ట్ కాబడి జైలులో ఉన్నాడని, అయితే ఈ నిందితుడిని పోలీస్ కస్టడీకి తీసుకోలేదని కూడా పేర్కొన్నారు.

ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్ రెడ్డి, బొల్లం రమేష్, బగ్గని శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ మరియు ఇతర పోలీసు అధికారులను, సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.