మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* *మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు. కుట్ర గుట్టు రట్టు కావడం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం వినుకొండ పోలీసులు క్రైమ్ నెంబర్ 91/2026, 506-308 సెక్షన్ల క్రింద ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు 2020లో లేని భూమిని ఉన్నట్టుగా చూపి అక్రమంగా జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మి సుమారు 90 లక్షలు స్వాహా చేశారు. ఈ అవినీతిని మేడం రమేష్ బయటకు తీసి గత ఏడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి నిగ్గు తేలింది. దీనితో కక్ష కట్టిన గొట్టం గోవిందరాజులు, B. వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి మేడం రమేష్ హత్యకు కుట్ర పన్ని సుపారి ఇచ్చి హత మార్చే ప్రయత్నం చేశారంటూ, తనకు రక్షణ కల్పించి ప్రాణాలు కాపాడాలంటూ ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీకి మేడం రమేష్ ఫిర్యాదు చేశాడు. దీనిపై వినుకొండ పోలీసులు విచారణ జరపగా కొన్ని వాస్తవాలు వెలుగు చూడడంతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు బాధితుడు మేడం రమేష్ తెలిపారు.
మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* *మేడం రమేష్ పై హత్యాకు కుట్ర..* - *ఇరువురి పై కేసు నమోదు చేసిన పోలీసులు* పల్నాడు జిల్లా,వినుకొండ: సీనియర్ నాయకుడు, వైశ్య ప్రముఖుడు, ప్రముఖ అపరాల వ్యాపారి మేడం రమేష్ పై హత్యకు కుట్ర పన్నారు. కుట్ర గుట్టు రట్టు కావడం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం వినుకొండ పోలీసులు క్రైమ్ నెంబర్ 91/2026, 506-308 సెక్షన్ల క్రింద ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామానికి చెందిన గొట్టం గోవిందరాజులు 2020లో లేని భూమిని ఉన్నట్టుగా చూపి అక్రమంగా జగనన్న కాలనీకి ప్రభుత్వానికి అమ్మి సుమారు 90 లక్షలు స్వాహా చేశారు. ఈ అవినీతిని మేడం రమేష్ బయటకు తీసి గత ఏడాది అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి నిగ్గు తేలింది. దీనితో కక్ష కట్టిన గొట్టం గోవిందరాజులు, B. వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో కలిసి మేడం రమేష్ హత్యకు కుట్ర పన్ని సుపారి ఇచ్చి హత మార్చే ప్రయత్నం చేశారంటూ, తనకు రక్షణ కల్పించి ప్రాణాలు కాపాడాలంటూ ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీకి మేడం రమేష్ ఫిర్యాదు చేశాడు. దీనిపై వినుకొండ పోలీసులు విచారణ జరపగా కొన్ని వాస్తవాలు వెలుగు చూడడంతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు బాధితుడు మేడం రమేష్ తెలిపారు.
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1
- Post by Ramprasad islavath1
- తిరుపతి భాకరపేట ఘాట్ రోడ్డులో ప్రమాదం ఘాట్ రోడ్డులో లోయలోకి దూసుకెళ్లిన లారీ లోయలోకి దూసుకెళ్లడంతో బయటకు దూకేసిన డ్రైవర్ లారీలోని క్లీనర్ కు స్వల్ప గాయాలు....1
- నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...1
- ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐3
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- పెదకూరపాడు: పోలీస్ సిబ్బంది ఉండేందుకు నిర్మించిన క్వార్టర్స్ శిథిలావస్థకు సుమారు 20 సంవత్సరాలు అయినప్పటికీ తొలగింపు చర్యలు చేపట్టలేదని స్థానికులు అన్నారు. వివిధ కేసుల నిమిత్తం స్టేషన్ వచ్చేవారికి శిథిలావస్థలో చేరిన బిల్డింగ్ నుండి విషసర్పలు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. ఏ సమయంలో క్వార్టర్స్ పెచ్చులు ఊడి కింద పడతాయో తెలియని పరిస్థితిలో ఉన్నామన్నారు.1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- ఈరోజు సుధనపల్లి గ్రామంలో Arrive Alive మరియు 'మన ఊరు మన బాధ్యత' సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డాక్టర్ శభాష్ పి ఐ పి ఎస్ గారు, తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ గారు మరియు మరిపెడ సిఐ పవన్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకున్న సుదనపల్లి గ్రామంలో మూడు తీర్మానాలు 1. రోడ్డు భద్రతలో భాగంగా గ్రామంలో ఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం 2. గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయించడం 3. గ్రామాన్ని గంజాయి రైతు గ్రామంగా తీర్చిదిద్దడం పై అంశాల గురించి గ్రామస్తులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ద్విచక్ర వాహనదారులకు 150 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ నీలం వెంకన్న మరియు ఉపసర్పంచ్ పాలకవర్గం ను ఎస్పీ గారు అభినందించారు, అలాగే గ్రామంలో గంజాయి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని గంజాయి సేవిస్తున్నట్టుగాని రవాణా చేస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే 87126 56 99 9 ఇంటి నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందిస్తే 5000 వరకు బహుమతి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే గ్రామంలోని యువతకి పిల్లలకి ఎస్పి గారు స్పోర్ట్స్ కిట్ ను అందజేయడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న సైకిల్ కి సైకిల్ ముందు వెనక రేడియం స్టిక్కర్లు అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా ఎస్పీ గారు చేసిన సూచనలను పాటిస్తామని విలేజ్ ని గంజాయి రైతు గ్రామంగా మారుస్తామని నిర్ణయించడం జరిగింది.1