సంతబొమ్మాలి మండలంలో ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు సుమారు 10 అడుగుల వినాయక విగ్రహం ఏర్పాటు సంతబొమ్మాలి : సంతబొమ్మాలి మండలం లోని పలు గ్రామాల్లో సోమవారం వినాయక చవితి మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కులాలకు మతాలకు అతీతంగా వీధివాడ తేడా లేకుండా చిన్నా పెద్దా అందరూ కలిసి వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గణనాథుని నామస్మరణతో గ్రామాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. సంతబొమ్మాలి మండలం లోని నౌపడ గ్రామంలో పెద్దవీధికి చెందిన శ్రీ మల్లేశ్వర కమిటీ సభ్యులు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వినాయకుని చిత్రాలతో కూడిన ప్రత్యేక వస్త్రాలను ధరించి, బాణాసంచా కాల్చుకుంటూ సుమారు పది అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకురావడం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి పూజలు చేశారు. విఘ్నేశ్వరుని విశిష్టత హిందూ సంప్రదాయంలో వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా, శుభకార్యాలకు ఆదిదేవుడిగా పూజలందుకుంటాడు. ఏ కార్యాన్ని ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

- త్రాగునీటిలో మురుగునీరు కలుషితం.... ఆందోళనలో గ్రామస్తులు.... మెళియాపుట్టి (M)మర్రిపాడు-సి పంచాయతీ జలక లింగుపురం ఆంజనేయ గుడి వీధిలో కుళాయిల నుంచి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటికి దుర్వాసన రావడంతో స్థానికులు పైపులను తవ్వి పరిశీలించగా మురుగునీరు కలిసినట్లు గుర్తించారు. మురుగు కాలువలోనే తాగునీటి పైపులు వేయడంతో సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.2
- పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి గర్భాలయం కొత్త వెలుగులతో మన్యం జిల్లా పాలకొండలో కొలువై ఉన్న శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం గర్భాలయ ముఖద్వారానికి ఒక భక్తుడు కొత్త ఏడుకొండలు ఇత్తడి ఇత్తడి రేకు తాపడం జరిగింది.కొత్త ఏడుకొండలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారి భక్తులు కోరుకుంటున్నారు.1
- సంతకవిటి మండలం లో ఈదురు గాలి లో తో కూడిన వర్షం ప్రజలు అంత సూరక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచనలు సంతకవిటి మండలం లో మంగళవారం ఒక్కసారి గా వాతావరణం లో మార్పులు చోటు చేసికొని వర్షం పడింది.పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలుoత సురక్షత ప్రాంతలలో నే ఉండాలని అధికారులు సూచించారు.1
- నెల్లిమర్ల నగరం లో వినాయక మండపంలో పిల్లలకు ఆటల పోటీలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జిమ్ గ్రౌండ్ వద్ద ఉన్న గణేష్ మండపం వద్ద బుధవారం సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. వినాయకుని ఐదు రోజుల్లో భాగంగా.. ఈరోజు సాయంత్రం పిల్లలకు క్రికెట్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించడంతో పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలు ఆడిన ఆటలు చూసి తమ తల్లిదండ్రులు వాళ్ళలో ఉత్సాహం నింపారు.1
- బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు1
- రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన...! బుడా చైర్మన్ - తెంటు లక్ష్మునాయుడు..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.3
- స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.1
- మరడాo గ్రామంలో స్మశాన వాటిక లేక మృతదేహాన్ని మోయలేక అవస్థలు.. దత్తిరాజేరు మండలం మరడాo గ్రామంలో స్మశాన వాటిక లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గ్రామం నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో పాత పద్ధతిలో పొలాలలో గట్టులపైన మృతదేహాన్ని పట్టుకొని తీవ్ర కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామానికి దగ్గర్లో స్మశాన వాటిక నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.1