logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

5 hrs ago
user_Venkata Satyanarayana
Venkata Satyanarayana
Vizianagaram, Andhra Pradesh•
5 hrs ago

స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నెల్లిమర్ల నగరం లో వినాయక మండపంలో పిల్లలకు ఆటల పోటీలు.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జిమ్ గ్రౌండ్ వద్ద ఉన్న గణేష్ మండపం వద్ద బుధవారం సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. వినాయకుని ఐదు రోజుల్లో భాగంగా.. ఈరోజు సాయంత్రం పిల్లలకు క్రికెట్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించడంతో పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలు ఆడిన ఆటలు చూసి తమ తల్లిదండ్రులు వాళ్ళలో ఉత్సాహం నింపారు.
    1
    నెల్లిమర్ల నగరం లో వినాయక మండపంలో పిల్లలకు ఆటల పోటీలు..
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జిమ్ గ్రౌండ్ వద్ద ఉన్న గణేష్ మండపం వద్ద బుధవారం సాయంత్రం పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. వినాయకుని ఐదు రోజుల్లో భాగంగా.. ఈరోజు సాయంత్రం పిల్లలకు క్రికెట్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్, లెమన్ స్పూన్ తదితర ఆటలు ఆడించడంతో పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు. పిల్లలు ఆడిన ఆటలు చూసి తమ తల్లిదండ్రులు వాళ్ళలో ఉత్సాహం నింపారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    1
    స్వచ్చత హి సేవా కార్యక్రమాలు విజయవంతం చేయాలి: కలెక్టర్ 
విజయనగరం జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వచ్ఛత హి సేవా–2026’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పరిశుభ్రత, పబ్లిక్ ప్లేసెస్ డ్రైవ్‌లు, శ్రమదానం, సఫాయి మిత్రుల సంక్షేమ కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
    user_Venkata Satyanarayana
    Venkata Satyanarayana
    Vizianagaram, Andhra Pradesh•
    5 hrs ago
  • మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య విజయనగరం, సెప్టెంబరు 16: పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు. డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఛేదింపు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. క్లూస్‌ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.
    1
    మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య
విజయనగరం, సెప్టెంబరు 16:
పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు.
డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది.
వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు.
సాంకేతిక ఆధారాలతో ఛేదింపు
దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
క్లూస్‌ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.
కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు.
కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • విజయనగరం జిల్లా స్వచ్ఛత హే సేవ 2026 విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి.. ​విజయనగరం, సెప్టెంబరు 16: జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కార్యక్రమాల షెడ్యూల్ మరియు విధివిధానాలను వెల్లడించారు. *​స్వచ్ఛత కార్యక్రమాల షెడ్యూల్ :* ​సెప్టెంబరు 17 - 18 (స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత): వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞాన యాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు. ​సెప్టెంబరు 19 - 20 (టార్గెట్ యూనిట్ల సుందరీకరణ): అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరచడం, సెల్ఫీలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం. ​సెప్టెంబరు 21 - 22 (క్లీన్ పబ్లిక్ ప్లేసెస్): బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, నీటి వనరులు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధక చర్యలు. ​సెప్టెంబరు 23 - 24 (జన్ భాగీదారి అడ్వొకేసీ డ్రైవ్స్): డోర్-టు-డోర్ ప్రచారం, 4-వే సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, గుడ్డ సంచుల వాడకంపై అవగాహన. ​సెప్టెంబరు 25 - 26 (స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత): వినాయక నిమజ్జనం తర్వాత ఘాట్ల పరిశుభ్రత, క్రీడా మైదానాల్లో జీరో-వేస్ట్ పోటీలు మరియు స్వచ్ఛతా డ్రైవ్‌లు. ​సెప్టెంబరు 27 (ప్రపంచ పర్యాటక దినోత్సవం): చారిత్రక, పర్యాటక ప్రదేశాల శుభ్రత మరియు పబ్లిక్ టాయిలెట్ల వద్ద దీపాలంకరణ. ​సెప్టెంబరు 28 - 29 (వ్యర్థాల నుండి సంపద - RRR): వ్యర్థాలతో కళాఖండాలు ('కబాడ్ సే కలా'), రీసైక్లింగ్ మేళాలు, ఉత్తమ సృష్టికర్తల సత్కారం. ​సెప్టెంబరు 30 (సఫాయి మిత్ర సురక్షా): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల అందజేత, సన్మానం. ​అక్టోబర్ 1 (శ్రమదానం): ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారుల సమిష్టి శ్రమదానం. ​అక్టోబర్ 2 (స్వచ్ఛ భారత్ దివస్): ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. *​అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు:* ​పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగానే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలి. ​ప్రజా మరుగుదొడ్లను సురక్షితమైన, శుభ్రమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి. ​అధికారులు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ​ఈ సమావేశంలో డీఈవో మాణిక్యం నాయుడు, డీపీవో మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీవో పీ. బాలాజీ తదితర అధికారులు, ఆన్లైన్ ద్వారా ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
    1
    విజయనగరం జిల్లా స్వచ్ఛత హే సేవ 2026 విజయవంతం చేయండి : జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి..
​విజయనగరం, సెప్టెంబరు 16:
జిల్లాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛత హి సేవా - 2026’ కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ కార్యక్రమాల షెడ్యూల్ మరియు విధివిధానాలను వెల్లడించారు.
*​స్వచ్ఛత కార్యక్రమాల షెడ్యూల్ :*
​సెప్టెంబరు 17 - 18 (స్వచ్ఛ పాఠశాల – యువ ఫర్ స్వచ్ఛత): వ్యర్థాల విభజనపై విద్యార్థులకు అవగాహన, స్వచ్ఛత జ్ఞాన యాత్రలు, వర్షపు నీటి సంరక్షణపై చర్చలు.
​సెప్టెంబరు 19 - 20 (టార్గెట్ యూనిట్ల సుందరీకరణ): అపరిశుభ్ర ప్రాంతాలను శుభ్రపరచడం, సెల్ఫీలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రచారం.
​సెప్టెంబరు 21 - 22 (క్లీన్ పబ్లిక్ ప్లేసెస్): బస్టాండ్లు, మార్కెట్లు, ఆసుపత్రులు, నీటి వనరులు మరియు పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిరోధక చర్యలు.
​సెప్టెంబరు 23 - 24 (జన్ భాగీదారి అడ్వొకేసీ డ్రైవ్స్): డోర్-టు-డోర్ ప్రచారం, 4-వే సెగ్రిగేషన్, హోమ్ కంపోస్టింగ్, గుడ్డ సంచుల వాడకంపై అవగాహన.
​సెప్టెంబరు 25 - 26 (స్పోర్ట్స్ ఫర్ స్వచ్ఛత): వినాయక నిమజ్జనం తర్వాత ఘాట్ల పరిశుభ్రత, క్రీడా మైదానాల్లో జీరో-వేస్ట్ పోటీలు మరియు స్వచ్ఛతా డ్రైవ్‌లు.
​సెప్టెంబరు 27 (ప్రపంచ పర్యాటక దినోత్సవం): చారిత్రక, పర్యాటక ప్రదేశాల శుభ్రత మరియు పబ్లిక్ టాయిలెట్ల వద్ద దీపాలంకరణ.
​సెప్టెంబరు 28 - 29 (వ్యర్థాల నుండి సంపద - RRR): వ్యర్థాలతో కళాఖండాలు ('కబాడ్ సే కలా'), రీసైక్లింగ్ మేళాలు, ఉత్తమ సృష్టికర్తల సత్కారం.
​సెప్టెంబరు 30 (సఫాయి మిత్ర సురక్షా): పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు, రక్షణ పరికరాల అందజేత, సన్మానం.
​అక్టోబర్ 1 (శ్రమదానం): ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, అధికారుల సమిష్టి శ్రమదానం.
​అక్టోబర్ 2 (స్వచ్ఛ భారత్ దివస్): ప్రత్యేక గ్రామసభలు, పట్టణ కౌన్సిల్ సమావేశాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు.
*​అధికారులకు ముఖ్యమైన ఆదేశాలు:*
​పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ముందుగానే స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి పూర్తిస్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలి.
​ప్రజా మరుగుదొడ్లను సురక్షితమైన, శుభ్రమైన ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించాలి.
​అధికారులు, స్థానిక సంస్థలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
​ఈ సమావేశంలో డీఈవో మాణిక్యం నాయుడు, డీపీవో మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, సీపీవో పీ. బాలాజీ తదితర అధికారులు, ఆన్లైన్ ద్వారా ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • అనారోగ్యంతో వ్యక్తి మృతి... అంత్యక్రియలకు బంధువులు దూరం..సీఐ మానవత్వం జీవిత భాగస్వామిని కోల్పోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న మహిళ ఆప న్న హస్తం అందాల్సిందే పోయి. బంధువులు మొహం చాటేయడం ఇరుగు పొరుగు వాళ్ళు దూరం పెట్టడం మానవత్వానికి మాచ్చ..ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా రాజాం లో చోటు చేసుకోంది.రాజాం కుమ్మరి విధికి చెందిన వెంకట్రావు అనారోగ్యంతో ఇంట్లో చనిపోయాడు.వీరి కి పిల్లలు లేరు భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో భార్య పుణ్యవతి భర్త మృతదేహం వద్ద 5గంటలు కూర్చొని కన్నీరు పెట్టుకుంది. అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. బంధువులు కూడా మొహం చాటేసారు. చివరి చూపులుకు కూడా రావడం లేదు. పుణ్యవతి పరిస్థితిని అటుగా వెళ్తున్న గమనించిన ఒక వ్యక్తి సిఐ నవీన్ కుమార్ కు సమాచారాన్ని ఇచ్చారు.రాజాం సిఐ కుమార్ నేనున్నాoటు ముందుకు వచ్చారు. దహన సంస్కారుల కోసం ఆర్థిక సహాయం అందించారు . రక్తం పంచుకున్న వాళ్ల దూరం పెట్టినా సిఐ. నవీన్ కుమార్ చూపించిన ఆదరణ ఆ సమయంలో అ మహిళలకు బ్రతుకు పై నమ్మకం ఇచ్చింది.
    1
    అనారోగ్యంతో వ్యక్తి మృతి... అంత్యక్రియలకు బంధువులు దూరం..సీఐ మానవత్వం
జీవిత భాగస్వామిని కోల్పోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న మహిళ ఆప న్న హస్తం అందాల్సిందే పోయి. బంధువులు మొహం చాటేయడం ఇరుగు పొరుగు వాళ్ళు దూరం పెట్టడం మానవత్వానికి మాచ్చ..ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా రాజాం లో చోటు చేసుకోంది.రాజాం కుమ్మరి విధికి చెందిన వెంకట్రావు అనారోగ్యంతో ఇంట్లో చనిపోయాడు.వీరి కి పిల్లలు లేరు భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేకపోవడంతో భార్య పుణ్యవతి భర్త మృతదేహం వద్ద 5గంటలు కూర్చొని కన్నీరు పెట్టుకుంది. అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. బంధువులు కూడా మొహం చాటేసారు. చివరి చూపులుకు కూడా రావడం లేదు. పుణ్యవతి పరిస్థితిని అటుగా వెళ్తున్న గమనించిన ఒక వ్యక్తి సిఐ నవీన్ కుమార్ కు సమాచారాన్ని ఇచ్చారు.రాజాం సిఐ కుమార్ నేనున్నాoటు ముందుకు వచ్చారు. దహన సంస్కారుల కోసం ఆర్థిక సహాయం అందించారు . రక్తం పంచుకున్న వాళ్ల  దూరం పెట్టినా సిఐ. నవీన్ కుమార్ చూపించిన ఆదరణ ఆ సమయంలో అ మహిళలకు బ్రతుకు పై నమ్మకం ఇచ్చింది.
    user_HARIBABU  TALADA
    HARIBABU TALADA
    Farmer రాజాం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం................. మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి. తాను కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని నరసింగరావు ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ బాధితుడు విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై కక్షతోనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన.. అప్పలరాజుతో పాటు ఈ ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    1
    ఆఫీస్‌లోకి కత్తితో వచ్చి దాడికి యత్నం.................
మంగమారిపేటలో అడ్వకేట్ సూరాడ నరసింగరావుపై కత్తితో దాడికి యత్నించారంటూ చల్లపిల్లి అప్పలరాజుపై ఆరోపణలు వచ్చాయి.  తాను కార్యాలయంలో ఉండగా అప్పలరాజు కత్తితో ఆఫీస్‌లోకి వచ్చి తనపై దాడికి ప్రయత్నించాడని నరసింగరావు ఆరోపించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంటూ బాధితుడు విశాఖ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తనపై కక్షతోనే దాడికి యత్నించారని ఆరోపించిన ఆయన.. అప్పలరాజుతో పాటు ఈ ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు
    1
    బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని హౌసింగ్, వెలుగు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు నీట మునిగాయి. పట్టణంలో కురిసిన వర్షానికి వరదనీరు కార్యాలయాల చుట్టూ నిలవడంతో రాకపోకలకు అధికారులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీరు వెళ్లేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని తెలిపారు. అధికారులు స్పందించి నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
జలదిగ్బంధంలో ప్రభుత్వ కార్యాలయాలు
    user_B.RAJESH
    B.RAJESH
    Media company బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య విజయనగరం, సెప్టెంబరు 16: పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు. డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఛేదింపు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.క్లూస్‌ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.
    1
    మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య
విజయనగరం, సెప్టెంబరు 16:
పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు.
డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది.
వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు.
సాంకేతిక ఆధారాలతో ఛేదింపు
దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.క్లూస్‌ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు.కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు.
కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి
వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.