మహిళ హత్య కేసులో నిందితుడు అరెస్టు వివాహేతర సంబంధం కొనసాగించాలంటూ ఒత్తిడి.. నిరాకరించడంతో హత్య విజయనగరం, సెప్టెంబరు 16: పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడైన పూసపాటిరేగ మండలం పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (28)ను అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద నడిపల్లి గ్రామానికి చెందిన శీల అప్పారావు తన భార్య శీల రమ (37) కనిపించడం లేదని సెప్టెంబరు 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పూసపాటిరేగ పోలీసులు మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం శీల రమ మృతదేహం లభించడంతో కేసును హత్య కేసుగా మార్చారు. డీఎస్పీలు పి.వి.వి. నరసింహారావు, ఎస్. రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు శీల రమ, నిందితుడు బంగారుబాబుకు గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత నాలుగు నెలలుగా రమ అతడిని దూరం పెట్టింది. అతడి ఫోన్ కాల్స్‌కు సరిగా స్పందించలేదు. దీంతో ఆమె మరొకరితో సంబంధం పెట్టుకుందనే అనుమానం బంగారుబాబులో పెరిగింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. సెప్టెంబరు 14న ఉదయం 11 గంటల సమయంలో బంగారుబాబు రమకు ఫోన్ చేశాడు. కొద్దిసేపు మాట్లాడిన అనంతరం ఆమె ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రమ మరోసారి బంగారుబాబుకు ఫోన్ చేసింది. ఇంట్లో ఎవరూ లేరని చెప్పిన అతడు, తనతో మాట్లాడేందుకు ఇంటికి రావాలని ఆమెను కోరాడు. అతడి మాటలు నమ్మిన రమ అతడి ఇంటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని బంగారుబాబు ఆమెపై ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సంబంధాన్ని కొనసాగించకపోతే ఈ విషయాన్ని భర్తకు చెబుతానని బెదిరించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆగ్రహానికి గురైన బంగారుబాబు దిండుతో రమ ముక్కు, నోటిని అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని మాయం చేయాలని భావించాడు. గోనె సంచిలో మృతదేహాన్ని ఉంచాడు. మోటార్‌సైకిల్‌పై సారిపల్లి కొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు ఎస్పీ తెలిపారు. సాంకేతిక ఆధారాలతో ఛేదింపు దర్యాప్తులో భాగంగా పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. బంగారుబాబుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. క్లూస్ టీం సహకారంతో నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్‌సైకిల్, నిందితుడు వినియోగించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి త్వరలో న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కేసులో చురుకుగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, కానిస్టేబుళ్లు సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ తెలిపారు. చిన్న వయసులోనే పిల్లలను నిరాశ్రయులను చేసి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి సంబంధాలకు దూరంగా ఉండాలని సూచించారు. మీడియా సమావేశంలో డీఎస్పీలు ఎస్. రాఘవులు, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ పి.వి.వి. నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎ.వి. లీలారావు, పూసపాటిరేగ ఎస్‌ఐ అరుణ్ కిరణ్, నెల్లిమర్ల ఎస్‌ఐ గోపాలరావు పాల్గొన్నారు.

- మరడాo గ్రామంలో స్మశాన వాటిక లేక మృతదేహాన్ని మోయలేక అవస్థలు.. దత్తిరాజేరు మండలం మరడాo గ్రామంలో స్మశాన వాటిక లేక స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గ్రామం నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో పాత పద్ధతిలో పొలాలలో గట్టులపైన మృతదేహాన్ని పట్టుకొని తీవ్ర కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రామానికి దగ్గర్లో స్మశాన వాటిక నిర్మిస్తే బాగుంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.1
- విజయనగరం జిల్లా గజపతినగరం మండలం తహసిల్దార్ కార్యాలయం వద్ద డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు, గీత కార్మిక సంఘం మండల నాయకులు, చేతి గుర్తుదారులు గౌరవాధ్యక్షుడు పురం అప్పారావు మాట్లాడుతూ కొత్త పెన్షన్లకు దరఖాస్తులకు అవకాశం 18 తేదీ వరకు పొడిగించడం మంచి పరిణామం.. గజపతినగరం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద పత్రిక సమావేశం జరిగినది ఇందులో పాల్గొన్నవారు డప్పు కళాకారుల సంఘం మండల నాయకులు బి రాంబాబు కళ్ళు గీత కార్మిక సంఘం మండల నాయకులు ఎం నరసయ్య పాల్గొన్నారు ఈ పత్రిక సమావేశంలో చేతి వృత్తిదారుల గజపతినగరం నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు పురం అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఈనెల 5వ తేదీన కొత్త పెన్షన్లకు అవకాశం ఇచ్చినట్లు ఏడవ తేదీ నుండి 16వ తేదీ వరకు గ్రామాలలో లోను పట్టణాలలో నున్న వార్డు సచివాలయాలలోనూ దరఖాస్తులు పెట్టవచ్చును అని ప్రభుత్వం ప్రకటించి పది రోజులు సమయం ఇచ్చినప్పటికీ 15వ తేదీ వరకు దరఖాస్తులు చేసిన వారి సంఖ్య ఇంకా పెరుగుతున్నప్పటికీ రెండు రోజులు అదనంగా అనగా 18వ తేదీ వరకు పొడిగించడం మంచి శుభ పరిణామం అయినప్పటికీ ఇంతకుముందే ఆయా చేతి వృత్తిదారులు అనగా కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు మత్స్యకార కార్మికులు డప్పు కళాకారులు చెప్పులు తయారీదారుల ప్రతినిధులతోనూ సమావేశాలు మండలాల వారీగా ఏర్పాటు చేసి కార్మికులకు అవగాహన కల్పించే విధంగా గ్రామ సభల ద్వారా తెలియజేయవలసి ఉన్నప్పటికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ప్రసారం ద్వారా ప్రకటించడం అర్హత గల పెన్షన్ దారులు అవగాహన లేక ఇంకా లక్షలాదిమంది రాష్ట్రంలో కానీ వేలాదిమంది జిల్లాలలో కానీ ఉన్నారు కనుక ఈనెల ఆఖరి వరకు పెన్షన్లకు అప్లై చేయడానికి సమయం ఇవ్వాలని పురం అప్పారావు తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరి ఏ ప్రభుత్వమైనా ప్రజల సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ ఎటువంటి సమస్యకైనా కొంత సమయము అంటే కొన్ని రోజులు అనగా వారం రోజులు 15 రోజులు నెల రోజులు ఇలా 90 రోజులు కడుపులో పరిష్కారం చేయవలసి ఉన్నది అదే విధంగా పెన్షన్లకు కూడా కనీసం 15 నుండి 30 రోజుల వరకు సమయం పొడిగిస్తే ఇంకా అర్హత గల వారందరూ పెన్షన్లు పొందగలరు అని అప్పారావు తెలిపిరి.1
- రాష్ట్ర మాజీ ఉప-ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతికి సంతాపం..! బొబ్బిలి ఎమ్మెల్యే - బేబీనాయన...! బుడా చైర్మన్ - తెంటు లక్ష్మునాయుడు..! విజయనగరం జిల్లా... బొబ్బిలి... ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప-ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని హఠాన్మరణం పట్ల బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి బొబ్బిలి కోటలో సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ, 2004 నుంచి బొబ్బిలి రాజకుటుంబానికి వారితో సత్సంబంధాలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ఎంతో సేవ చేశారని కొనియాడారు. బొబ్బిలి ప్రాంతంతో కూడా వారికి అవినాభావ సంబంధం ఉందని, మన ప్రాంతంలో వారికి వ్యవసాయ క్షేత్రం కూడా ఉందని గుర్తుచేసుకున్నారు. వారి హఠాన్మరణం మన అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.3
- పాలకొండ శ్రీ కోట దుర్గ అమ్మవారి గర్భాలయం కొత్త వెలుగులతో మన్యం జిల్లా పాలకొండలో కొలువై ఉన్న శ్రీ కోట దుర్గ అమ్మవారి దేవాలయం గర్భాలయ ముఖద్వారానికి ఒక భక్తుడు కొత్త ఏడుకొండలు ఇత్తడి ఇత్తడి రేకు తాపడం జరిగింది.కొత్త ఏడుకొండలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారి భక్తులు కోరుకుంటున్నారు.1
- అనకాపల్లి నుండి శ్రీకాకుళం పుణ్యక్షేత్రాలకు ఉచిత తీర్థ యాత్ర ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు సేవ అనకాపల్లి, సెప్టెంబర్ 16:ప్రజల సేవే పరమ ధర్మం అనే లక్ష్యంతో ఎం.వి.ర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత దేవాలయ దర్శన బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. అనకాపల్లి జిల్లా, జీవీఎంసీ పరిధి 82వ వార్డు, నర్సింగరావుపేట, సాయి పద్మ అపార్ట్మెంట్ (BSNL ఆఫీస్ సమీపం) వాస్తవ్యులు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం, శ్రీ కూర్మం, శ్రీ కోటిలింగేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి బయలుదేరారు. ఈ యాత్రను MVR ట్రస్ట్ అధినేత, బీజేపీ నాయకులు ముత్యాల వెంకటేశ్వరరావు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముత్యాల సూర్యకుమారి కి సన్నిహితురాలైన శ్రీమతి తాటికొండ శ్రీ లక్ష్మి గారు మాట్లాడుతూ, MVR చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో MVR చారిటబుల్ ట్రస్ట్ అనకాపల్లి ఇంచార్జి గైపురి రాజు , తాటికొండ కృష్ణమోహన్ , శాంతి , తీగల నగేష్ తదితరులు పాల్గొన్నారు.2
- త్రాగునీటిలో మురుగునీరు కలుషితం.... ఆందోళనలో గ్రామస్తులు.... మెళియాపుట్టి (M)మర్రిపాడు-సి పంచాయతీ జలక లింగుపురం ఆంజనేయ గుడి వీధిలో కుళాయిల నుంచి మురుగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాగునీటికి దుర్వాసన రావడంతో స్థానికులు పైపులను తవ్వి పరిశీలించగా మురుగునీరు కలిసినట్లు గుర్తించారు. మురుగు కాలువలోనే తాగునీటి పైపులు వేయడంతో సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని కోరుతున్నారు.2
- విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో యువ చైతన్యం, త్రిశూల పేరుతో పోలీసులు మరియు వివేకనంద యాజమాన్యం సహకారంతో 150 మంది విద్యార్థులతో త్రీ కె రన్.. విజయనగరం జిల్లా... శృంగవరపుకోటలో యువ చైతన్యం,త్రిశూల్ పేరుతో పోలీసులు మరియు వివేకానంద యాజమాన్యం సహకారంతో 150 మంది విద్యార్థులతో 3k రన్... శ్రీ వివేకానంద కాలేజీ నుంచి స్థానిక ఎరుకమ్మా కళ్యాణ మండపం వరకు విద్యార్థులతో 3K రన్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్న జిల్లా ఎస్పీ దామోదర్, డిఎస్పీ రాఘవులు డ్రగ్స్ మరియు మహిళల భద్రతపై అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో ఎరుకమ్మ పేరంటాలు కళ్యాణ మండపంలో యువతకు అవగాహన సమావేశం విజయనగరం జిల్లా SP ఏ.ఆర్. దామోదర్ మాట్లాడుతూ యువత గంజాయి, మహిళలపట్ల అసభ్యప్రవర్తన రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించారు సెల్ ఫోన్ వచ్చిన తరువాత మోసాలు ఎక్కువయ్యాయి ఆర్టిఫిషల్ టెకనోలజి వచ్చినప్పటి నుంచి ఏది నిజం ఏది అబద్దం తెలియటలేదు ఫోన్ అనేది అవసరాలకు మించి వాడకూడదు, చెడు అవసరాలకు వినియోగించకూడదు ప్రమాదం అనేది చెప్పిరాదు వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ వాడకం తప్పినిసరి, ఆన్లైన్ బెట్టింగ్ ఆప్ ద్వారా యువత బారినపడుతున్నారు ఈ బెట్టింగుల వలన అప్పులు చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మధ్యస్థ వయస్సువారు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోతున్నారు వీటి భారీనాపడి మోసపోవద్దు ప్రజలను కాపాడటమే మాలక్ష్యం యువత మంచి మార్గంలో నడిచి భవితరాలకు మార్గదర్శియులుగా మెలగాలని కోరారు.4
- అంగరంగ వైభవంగా వినాయక చవితి నవరాత్రి వేడుకలు టిడిపి నాయకురాలు జ్యోతుల లక్ష్మి దేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు కాకినాడ జిల్లా .జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట మండలం: ఇర్రిపాక .గణేష్ నవరాత్రుల సందర్భంగా టిడిపి మహిళా నాయకురాలు, జగ్గంపేట శాసనసభ్యులు,టీటీడీ బోర్డు నెంబర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ కోడలు, కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో వారి స్వగృహం నందు విశిష్ట పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది జరిపే ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపంను నిర్మించి వినాయకుడికి విశేష పూజలు అందిస్తున్నారు. బుధవారం నాడు నవీన్ లక్ష్మీదేవి దంపతులు నిర్వహించారు. జగ్గంపేట మండలం కాట్రాలపల్లి వారిచే కోలాటం, నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం భక్తి పారవశంతో పూజలు నిర్వహించడంతో స్థానిక భక్తులు, జగ్గంపేట నియోజవర్గంలోని భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో తంటికొండ దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర , గోకవరం మండల టిడిపి నాయకులు దాసరి సీతారామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జ్ బద్దిరెడ్డి బాబి, మలిరెడ్డి సిరి, బద్దిరెడ్డి రవి,మింది నరేంద్ర,కొంగరపు రాజు, చింతల నాగు, గంటిపూడి శ్రీధర్,బీశెట్టి వెంకన్న, పడాల దొర ,నాగం నాగిందు , బద్దిరెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.4
- శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం *శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా వేల మందికి అన్నదాన (అన్నప్రసాద వితరణ) కార్యక్రమం* జగ్గంపేట మండలం గుర్రంపాలెం గ్రామం లో కృష్ణాష్టమి సందర్భంగా18వ శ్రీకృష్ణ జయంతి పురస్కరించుకొని యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని గుడి వద్ద భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కమిటీ వారు తెలియజేస్తూ గత 18 సంవత్సరాలుగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ప్రజలకు భారీ సంఖ్యలో అన్న ప్రసాద వితరణ జరుగుతుందని అన్నారు యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణుని గుడి దగ్గర జరిగే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలు నుండి భక్తులు,భారీ సంఖ్యలో వస్తారని అలాగే వచ్చిన వారికి కమిటీ ఆధ్వర్యంలో తగిన సౌకర్యాలు,జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు అలాగే ప్రతి సంవత్సరము లాగ కమిటీ పెద్దలు పర్యవేక్షణలో యూత్ కూడా ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణుని జయంతి మొదటి రోజు నుండి చివరగా స్వామివారి అన్నదాన(అన్న ప్రసాద వితరణ) కార్యక్రమం జరిగేంతవరకు ఎంతో క్రమశిక్షణతో పెద్దలను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని యాదవ సంఘం కమిటీ పెద్దలు తెలియజేశారు శ్రీ స్వామి వివేకానంద స్కూల్ అధినేత ఒమ్మి రఘురాం మాట్లాడుతూ.. యాదవులు అంటే ఎటువంటి కల్మషం లేని వ్యక్తులని, తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొదటి దర్శనం యాదవులకె కల్పించారని, అలాగే ఈ ఊర్లో యాదవులలో సర్పంచులు చేసిన వ్యక్తులు ఉన్నారని, యువత బాగా చదువుకోవాలని, గొప్ప గొప్ప ఉద్యోగ అవకాశాలు పొందాలని అయన కోరారు3