Shuru
Apke Nagar Ki App…
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.
GVG
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ వదలపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- రెండు వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు. హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం 2000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 5, మే 22 తేదీల్లో జరగబోయే మ్యాచ్‌ల కోసం భద్రతా ఏర్పాట్లపై హెచ్‌సీఏ కోశాధికారి అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బస్వరాజు, బీసీసీఐ అసిస్టెంట్ వెన్యూ మేనేజర్ వైభవ్, సన్‌రైజర్స్ ప్రతినిధి శర్వానన్‌లతో కలిసి ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు.1
- ఎమ్మిగనూరు నుండి ముఖ్య వార్త… అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టంగా మారడంతో ఎమ్మిగనూరులో ఘనంగా సంబరాలు నిర్వహించారు. రైతుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజలు ఈ విజయాన్ని పండుగలా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి, అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.1
- ప్రభుత్వం హిందువులపై కుట్రపూరితంగా హనుమాన్ జయంతి రోజున ప్రజా పాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం తగదని విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ అన్నారు.1
- Post by Tagore3
- *నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్క్ లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ వార్డు సభలో పాల్గొని ప్రసంగించిన శ్రీమతి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు*1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని నిమ్మకాయల మార్కెట్ యార్డులో దడువాయులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 22వ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దడువాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మహాధర్నాకు అధ్యక్షులు వంటేపాక లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షులు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న ముఖ్యంగా పాల్గొన్నారు. సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, వి సైదులు, బి రమేష్, ఎస్ ధీరజ్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, బి యాదగిరి, జి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిమ్మకాయల మార్కెట్ యార్డులో స్థానిక దడువాయులకు తగిన పని అవకాశాలు కల్పించాలని, వారి జీవనోపాధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.3
- ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు. హైదరాబాద్ చిల్కానగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా, నేర్ధం భాస్కర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా అన్యాయం చేస్తోందని, బడ్జెట్ లో కూడా బీసీలను విస్మరించిందని ఆరోపించారు. అంబేద్కర్ ఇచ్చిన ఓటు ఆయుధంగా, రాబోయే ఎన్నికల్లో హైదరాబాద్ లోని మూడు కార్పొరేషన్లలో బీసీలను గెలిపించుకుంటామని ఆయన అన్నారు. పాపన్న స్ఫూర్తితో కుల సంఘాల నాయకులు పాల్గొని నివాళులర్పించారు.1
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతన ఆశ్రమ ప్రారంభోత్సవం, జయంతి ఉత్సవాల కరపత్రం ఘనంగా విడుదలైంది. జిల్లా అధ్యక్షులు ఎద్దుల చెన్నయ్య, ఉపాధ్యక్షులు బైరుపోగు జయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్, డాక్టర్ కామాళే గణేష్‌తో పాటు పలువురు నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… విద్యా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మార్పుకు ఆశ్రమం కీలకమని తెలిపారు. ఏప్రిల్ 11న జరిగే ఆశ్రమ ప్రారంభోత్సవానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక వైఎస్ఆర్సిపి నాయకులు ఎం జక్కయ్య గారు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతలను ఘనంగా సన్మానించగా… కార్యక్రమంలో పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Tagore1