logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దెబ్బట మహేందర్ కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ ఆపన్నహస్తం *చెన్నూర్, సెప్టెంబర్ 16, 2026: దెబ్బట మహేందర్ కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ ఆపన్నహస్తం *చెన్నూర్, సెప్టెంబర్ 16, 2026: లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన దెబ్బట మహేందర్ (తండ్రి: అశోక్) కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, సమాజ సేవలో భాగస్వామ్యం కావడం లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. “We Serve” అనే సేవా స్ఫూర్తితో అవసరమైన వారికి తమ వంతు సహాయం అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు:* - లయన్ శ్రీ కరుణసాగర్ రావు — క్లబ్ మెంబర్‌షిప్ చైర్‌పర్సన్ - లయన్ శ్రీ అమెర్ అహ్మద్ — సెకండ్ ప్రెసిడెంట్ - లయన్ శ్రీ మహమ్మద్ జైనుల్ అబ్దీన్ — సెక్రటరీ లయన్స్ క్లబ్ సభ్యులైన శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు, పెద్దపల్లి ఎంపీ, మరియు డా. శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి సేవా స్ఫూర్తితో క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

22 hrs ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
22 hrs ago
25e703b9-a5e7-4eb5-b228-d9b82fee6420

దెబ్బట మహేందర్ కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ ఆపన్నహస్తం *చెన్నూర్, సెప్టెంబర్ 16, 2026: దెబ్బట మహేందర్ కుటుంబానికి లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ ఆపన్నహస్తం *చెన్నూర్, సెప్టెంబర్ 16, 2026: లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ విశాఖ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన దెబ్బట మహేందర్ (తండ్రి: అశోక్) కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం, సమాజ సేవలో భాగస్వామ్యం కావడం లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. “We Serve” అనే

0b3879fd-58a9-4f28-b6db-2177bdca228c

సేవా స్ఫూర్తితో అవసరమైన వారికి తమ వంతు సహాయం అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు:* - లయన్ శ్రీ కరుణసాగర్ రావు — క్లబ్ మెంబర్‌షిప్ చైర్‌పర్సన్ - లయన్ శ్రీ అమెర్ అహ్మద్ — సెకండ్ ప్రెసిడెంట్ - లయన్ శ్రీ మహమ్మద్ జైనుల్ అబ్దీన్ — సెక్రటరీ లయన్స్ క్లబ్ సభ్యులైన శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు, పెద్దపల్లి ఎంపీ, మరియు డా. శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి గారి సేవా స్ఫూర్తితో క్లబ్ సభ్యులు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు 
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_కర్ణాల నాగరాజు
    కర్ణాల నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
    1
    జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో  పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    48 min ago
  • తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాo సుంకరి సంపత్ అల్ ఇండియా అగ్రికల్చర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది . ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు. దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు. ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు. ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు ప్రజలను హింసించారు. ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్, సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి ,వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం , నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సంఘం నాయకులు ఈ వెంకటేష్, బాలరాజు, సాగర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు...
    2
    తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాo సుంకరి సంపత్ అల్ ఇండియా అగ్రికల్చర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది . ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు. దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్  యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు.  ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు.  
ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు  ప్రజలను హింసించారు.
ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్,  సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం  ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి ,వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం , నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సంఘం నాయకులు ఈ వెంకటేష్, బాలరాజు, సాగర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు...
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్ కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    1
    ఉట్నూర్‌లో తుడుందెబ్బ ఐటీడీఏ మార్చ్
కదం తొక్కిన ఆదివాసీలు.. హక్కుల పరిరక్షణకు నినాదాలు
ఉట్నూర్‌లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీడీఏ మార్చ్ ర్యాలీ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు ర్యాలీలో పాల్గొని తమ హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నినాదాలు చేశారు. తుడుందెబ్బ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ కొనసాగగా, ఆదివాసీ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    1
    జన్నారంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు
జన్నారం మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతిని విశ్వబ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జన్నారం మండల అధ్యక్షులు కడారి నర్సయ్య ఆధ్వర్యంలో సంఘం సభ్యులు కులస్తులు గురువారం ఉదయం జన్నారంలోని కవ్వాల్ చౌరస్తా వద్ద విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్‌ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
    1
    కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి  పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్‌ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్‌, లైటింగ్‌, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్‌, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు
అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    36 min ago
  • వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి
    1
    వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • బండి సంజయ్‌కు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం: మాజీ సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎందుకు విచారణ జరపడం లేదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్రమంత్రే చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, చెడు జరిగితే ఆ నెపాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
    4
    బండి సంజయ్‌కు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం: మాజీ సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఎందుకు విచారణ జరపడం లేదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్రమంత్రే చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, చెడు జరిగితే ఆ నెపాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    1
    జన్నారం మండలంలోని విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండా ఆవిష్కరణ
జన్నారం: విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని జన్నారం మండలంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి, విశ్వకర్మ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. సంఘం అధ్యక్షుడు కడర్ల నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సింగ్ ఓజి శ్రీనివాస్, కోశాధికారి కొత్త శ్రీనివాస్‌తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ ఐక్యత, సమాజ అభివృద్ధి, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.