*"మన రైతన్న- మన బలం" యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్* పుట్టపర్తి /ధర్మవర్ ఏప్రిల్, 20: కలెక్టర్ లోని పీజీఆర్ఎస్ హాలు నందు జిల్లాలోని రైతుల అభ్యున్నతే లక్ష్యంగా, వారి విజయగాధలను మరియు సాగులో పాటిస్తున్న ఉత్తమ పద్ధతులను అందరికీ చేరవేసేందుకు గౌరవ జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ గారు ఈరోజు *"మన రైతన్న- మన బలం"* అనే ప్రత్యేక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. జిల్లాలో తోటి రైతులు సాధించిన విజయాలను, అనుసరిస్తున్న మెరుగైన వ్యవసాయ విధానాలను వీడియోల రూపంలో అందరికీ అందించి, వారిలో స్ఫూర్తి నింపడం.వ్యవసాయం, ఉద్యానవన శాఖ, పాడి పరిశ్రమ, పట్టు పరిశ్రమ మరియు మత్స్యశాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం మరియు ఆధునిక సాంకేతికత.రైతులకు అవసరమైన సాంకేతిక అంశాలపై సందేహాలు ఉంటే ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలియజేయవచ్చు, వాటికి నిపుణుల ద్వారా సమాధానాలు అందించబడతాయి. ప్రతి శాఖాధికారి సమన్వయంతో పనిచేస్తూ, జిల్లా రైతులను ఆధునిక సాగు దిశగా నడిపించి వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. "మన పక్క గ్రామంలోని తోటి రైతు సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని, జిల్లాలోని రైతులందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం." ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , జిల్లా రెవెన్యూ అధికారి విజయసారధి , వ్యవసాయ శాఖ అధికారి కృష్ణయ్య, డి.ఆర్.డి.ఏ పీడి నరసయ్య, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్, పాడి పరిశ్రమ అధికారి శుభదాస్, కోపరేటివ్ అధికారి కృష్ణా నాయక్, మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- Post by Daatha Foundation Trust1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2