Shuru
Apke Nagar Ki App…
చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
RP
చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- చింతామని గణపతి ఆలయం లో దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.. అన్నదానం... బాసర లోని చింతామని గణపతి ఆలయం లో బాసర కు చెందిన దాత దావు సంతోష్ ఆధ్వర్యంలో శ్రావణమాసం పౌర్ణమి ని పురస్కరించుకొని అన్నదానం నిర్వహించారు. స్థానికులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అన్నదానం స్వీకరించారు. ప్రతి పౌర్ణమి నాడు బాసర కు చెందిన దాతల సహకారం తో అన్నదానం నిర్వహిస్తామని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేసుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు.1
- నందిపేట్ మండల కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ ఏ.లక్ష్మాన్, మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి 12 ఫిర్యాదులు అందాయని ఎండీఓ తెలిపారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. నేడు వచ్చిన ఫిర్యాదులు ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా తెలిసింది.1
- కస్తూర్బా పాఠశాలలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు...... ......... చిన్నచింతకుంట: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను మదీనా మసీదు కమిటీ, మైనారిటీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, చదువుతో పాటు మంచి విలువలను పెంపొందించుకోవాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో జాకీర్, జాంగీర్, మైముద్, ఫారూక్, ఎండీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు.1
- నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ... నిజామాబాద్ జిల్లా, చందూర్ మండలం, కారెగాం తండాలో పట్టపగలే చోరీ జరిగింది. ఇంటి యజమాని అనిత గొళ్ళెం వేసి పక్కింటి కి వెళ్ళి వచ్చి చూసే వరకు ఇంట్లో బీరువా తాళం పగిలి, దుస్తులు చిందర వందరగా ఉండడం చూసి చోరీ జరిగిందని భావించి బీరువాలో ఉన్న 2.5 తులాల బంగారం, 28 తులాల వెండి ఆభరణాలు, లక్ష రూపాయల వరకు నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం సీ.సీ. ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు1
- అక్రమ కట్టడాలపై చర్యలు తిసుకోవాలని పిర్యాదు........... బిక్కనూర్ మండలంలోని అంతంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో 44వ జాతీయ రహదారి పక్కన మాల్గుడి హోటల్, రిలయన్స్ పెట్రోల్ బంక్, పరివార్ హోటల్ లను ప్రభుత్వ స్థలంలో ఇప్పటి ప్రభుత్వాలు నిర్మించుకునేందుకు అవకాశాలు కల్పించాయని, ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన హోటళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సిపిఎం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు గ్రామ సర్పంచ్ కు వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ భూములలో ఉన్న నిర్మాణాలను తొలగించేందుకు పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.1
- కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు” కామారెడ్డి: రక్తదాన సేవల్లో విశేష కృషి చేస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ బాలుకు “వాసవి నవరత్న అవార్డు”ను ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త అందజేశారు. డాక్టర్ బాలు 2007 సంవత్సరం నుంచి నిరంతరం రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, తాను వ్యక్తిగతంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు, తలసేమియా బాధిత చిన్నారుల కోసం సుమారు 6,000 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అలాగే ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని సేకరించి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న అనేకమందికి సకాలంలో రక్తాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విశిష్ట సేవలను గుర్తించిన వాసవి ఆర్ట్ థియేటర్స్ చైర్మన్ డాక్టర్ నీల శ్రీధర్ “వాసవి నవరత్న అవార్డు”ను ప్రకటించారు. ఈ అవార్డును ప్రముఖ సామాజిక సేవకులు గంజి రాజమౌళి గుప్త చేతుల మీదుగా డాక్టర్ బాలుకు అందజేశారు. ఈu సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ నీల శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ, “2007 నుంచి రక్తదాన సేవలను కొనసాగిస్తున్నాను. ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడేందుకు సకాలంలో రక్తాన్ని అందించగలగడం నాకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది” అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా రక్తదాన సేవలను విస్తృతంగా నిర్వహించి, సుమారు 100 యూనిట్ల ప్లాస్మా, 1,000 యూనిట్ల రక్తాన్ని సేకరించి బాధితులకు అందించినట్లు తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అత్యవసర సమయంలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒక యూనిట్ రక్తం అవసరమవుతుందని, వారి జీవితాంతం రక్తం అవసరమయ్యే పరిస్థితి ఉంటుందని తెలిపారు. అలాంటి చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు మరింత విస్తృతంగా రక్తదాన శిబిరాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, ఒక వ్యక్తి చేసే రక్తదానం మరొకరి కుటుంబానికి ప్రాణాధారంగా మారుతుందని డాక్టర్ బాలు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి, అత్యవసర సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని తెలిపారు. తన రక్తదాన సేవలకు సహకరిస్తున్న రక్తదాతలు, శ్రేయోభిలాషులు, వాసవి సంస్థ ప్రతినిధులు, సామాజిక సేవకులు మరియు మీడియా ప్రతినిధులకు డాక్టర్ బాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. “రక్తదానం చేద్దాం – ప్రాణాలను కాపాడుదాం” అనే మానవతా సందేశంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.1
- ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: TGEJAC ADB: ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై TGEJAC ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు PRC అమలు, పెండింగ్ DA, బకాయిల చెల్లింపు, CPS రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడి డిమాండ్లను సాధించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ తాడ్కోల్ రోడ్డు చౌరస్తా లొ రోడ్డు ప్రమాదం. బైక్ ను వెనుక నుండి ఢీ కొట్టిన లారీ. బైక్ పై తండ్రి వెనుక కూర్చున్న జైనబ్ ఫాతిమా 4 సం యుకెజి తలపై ఎక్కిన లారీ స్పాట్ లోనే మృతి. స్కూల్ కు వెళ్తుండగా ఘటన.1