logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి. - ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి మోకా శ్రీకళ పిలుపు ​పిఠాపురం: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి మోకా శ్రీకళ తెలిపారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆ తర్వాత తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తల్లిపాలను కొనసాగించడం ద్వారా శిశువు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె వివరించారు. ​తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని అలాగే తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయని శ్రీకళ స్పష్టం చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి కుటుంబంలోనూ సరైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ​గర్భిణులు,బాలింతలు, కుటుంబ సభ్యులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ సమన్వయంతో చురుకుగా పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

1 hr ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Press advisory పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
2587ea92-b765-4331-bed3-cb94f8e888db

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి. - ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి మోకా శ్రీకళ పిలుపు ​పిఠాపురం: మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అన్ని మండలాల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు అధికారి మోకా శ్రీకళ తెలిపారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. పుట్టిన మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆ తర్వాత తగిన అనుబంధ ఆహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు తల్లిపాలను కొనసాగించడం ద్వారా శిశువు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని ఆమె వివరించారు. ​తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని అలాగే తల్లి ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయని శ్రీకళ స్పష్టం చేశారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి కుటుంబంలోనూ సరైన అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ​గర్భిణులు,బాలింతలు, కుటుంబ సభ్యులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ సమన్వయంతో చురుకుగా పాల్గొని ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం ​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ​నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి ​గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ​ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    1
    సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం

​పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ​నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి ​గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ​ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
    user_Prasanna kumar Rowthu
    Prasanna kumar Rowthu
    Press advisory పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    1
    ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా
కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్మోహన్‌ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్‌ టాప్‌ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...
    1
    *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..*
VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, రామ్మోహన్‌ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్‌ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్‌ టాప్‌ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    15 hrs ago
  • *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.
    1
    *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు.
తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి  పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి  చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి. 🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం 🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి 🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి 🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు 🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు
    1
    మొరాకో-స్పెయిన్ సరిహద్దులో వలస సంక్షోభం తీవ్రం. 57 మంది మృతి.

🔹 వలసదారులను చట్టబద్ధం చేస్తారనే ఆశతో మొరాకో నుంచి భారీగా స్పెయిన్‌లోకి ప్రవేశం
🔹 కేవలం 24 గంటల్లోనే సుమారు 60 వేల మంది దేశంలోకి వచ్చినట్లు స్పెయిన్ అధికారులు వెల్లడి
🔹 సరిహద్దు దాటే ప్రయత్నాల్లో 57 మంది మృతి
🔹 వలసదారులు-భద్రతా బలగాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు
🔹 పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.