*ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.
*ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.
- *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామ్మోహన్ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...1
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న థింసా నృత్యం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం దేశం లోనే అత్యధికంగా 13వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యింది. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్షంగా థింసా నృత్యాన్ని తిలకించి సంతృప్తినీ వ్యక్తం చేశారు. అనంతరం వరల్డ్ రికార్డ్స్ కు సంబంధించిన సర్టిఫికెట్ ను గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. 13,000 మంది పైబడి గిరిజన మహిళలు మరియు విద్యార్థినులు ఏకకాలంలో సంప్రదాయ థింసా నృత్యాన్ని ప్రదర్శించారు.1
- లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.3
- నెల్లిమర్ల నగరం నుండి 18 బస్సులలో భోగాపురానికి ప్రజలు ఉత్సాహంగా .. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో ప్రజలు శనివారం ఉదయం 18 బస్సులలో బోగాపురం ఎయిర్పోర్ట్ కు ఉత్సాహంగా బయలుదేరారు. నగర కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది సహకారంతో నగర ప్రజలను బస్సులలో ఎక్కించి తీసుకు వెళ్లడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. విజయనగరం జిల్లాకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయo ప్రారంభోత్సవం కాబోతుండటంతోనే ప్రజలు ఆనందంగా బయలుదేరుతున్నామని అన్నారు.1
- ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- రాజాం:రాజాం లో ప్రభుత్వ కార్యాలయలో విద్యుత్ దీపాలంకరణ.. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా రాజాం ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ దీపాలంకరణలతో కళకళలాడుతున్నాయి. ప్రధాన రహదారి పై ఉన్న పురపాలక సంఘం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలు కాంతుల విసిరితున్నాయి. దీపాలు చూసిన ప్రయాణికులు నిత్యం ఇలానే ఉంటే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు.1
- ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.1
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1