బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ - బద్వేలులో 108వ జయంతి... బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు ఆర్టీసీ ప్రాంగణంలోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో బి.పి.మండల్ 108వ జయంతి వేడుకలను మండల్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కావేటి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేసిన మహనీయుడు బి.పి.మండల్ అని, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ఆయన ఆశయాలు నెరవేరుతాయన్నారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్, కావేటి రమేష్ యాదవ్ లు మండల్ జీవిత విశేషాలను వివరించారు.ఈ కార్యక్రమంలో గంటా వెంకటయ్య, ఎస్.ఎ.సత్తార్, అన్వర్ భాషా, సొద్దల పెంచలయ్య, మస్తానయ్య, నరేంద్ర, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ - బద్వేలులో 108వ జయంతి... బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు ఆర్టీసీ ప్రాంగణంలోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో బి.పి.మండల్ 108వ జయంతి వేడుకలను మండల్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కావేటి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి నిస్వార్థంగా పనిచేసిన మహనీయుడు బి.పి.మండల్ అని, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించినప్పుడే ఆయన ఆశయాలు నెరవేరుతాయన్నారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ కొలవలి వేణుగోపాల్, కావేటి రమేష్ యాదవ్ లు మండల్ జీవిత విశేషాలను వివరించారు.ఈ కార్యక్రమంలో గంటా వెంకటయ్య, ఎస్.ఎ.సత్తార్, అన్వర్ భాషా, సొద్దల పెంచలయ్య, మస్తానయ్య, నరేంద్ర, రసూల్ తదితరులు పాల్గొన్నారు.
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.1
- 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. 2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా? ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? మా త్యాగానికి న్యాయం చేయండి. 18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1
- వెలుగొండ ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులు ట్రాక్టర్స్ ర్యాలీ వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా మార్కాపురం పట్టణ కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల చేయబోతున్నట్లు నాయకులు తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ యాడ్ నుండి అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ చేసి, నల్గొండ ప్రాజెక్టు జలాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కూటమిన్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రబాబు తెగ సంపద సృష్టించేస్తున్నాడని ప్రజలను భ్రమింపజేసేలా 4 నెలల్లో రూ.54,059 కోట్ల రెవెన్యూ రాబడి వచ్చిందంటూ ఈనాడులో వార్త రాశారు. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తంలో ఈ 4 నెలల్లో వచ్చింది 23 శాతమే. అంటే.. మిగిలిన 8 నెలల్లో ఇదే తరహాలో వచ్చినా 69% మాత్రమే వస్తోంది. ఈనాడు వార్త ప్రకారం ఈ ఆర్థిక ఏడాదిలో దాదాపు 23% రాష్ట్రం నష్టపోతున్నట్లే కదా? కానీ ఈ విషయం ప్రజలకు అర్థం కాకుండా రాసింది. -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి1
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1