సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.
సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే
నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- కూలీలను విస్మరించిన ప్రభుత్వాల తీరుకు నిరసనగా ధర్నా... బద్వేలు, ఆగస్టు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేదల వ్యతిరేక విధానాలకు నిరసనగా BKMU ఆధ్వర్యంలో సోమవారం గోపవరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని, పేదల భూములను అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న జరిగే "చలో ఢిల్లీ" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శి పి.వి.రమణ, గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, బద్వేలు ఏరియా అధ్యక్షులు పొంగూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..! కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది1
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న జిల్లా మంత్రులు - _*కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవి,కర్నూలు ఎంపీ బస్తి పాటి నాగరాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,మంత్రాలయం ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మన్న,మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.*_ #NimmalaRamaNaidu #kurnoolcity #BvJayaNageshwaraReddy #APGovernment #NDA #leader #temples1
- తుమ్మలచెరువు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మార్కాపురం జిల్లా తర్లపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో మంచినీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి కోసం ఏర్పాటు చేసిన రింగులు పగిలిపోయి రజక వీధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంచినీటి ట్యాంకర్ ను ఏర్పాటు చేసి శ్వాశిత పరిష్కారం చూపాలన్నారు. పలు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదని అధికారులు స్పందించాలని కోరారు.1
- మంగనూర్ లో బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ గారి 108వ జయంతి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామం లోని బీసీ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల నూతన విగ్రహాల దిమ్మె దగ్గర బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి.పి. మండల్ ) గారి 108వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో మంగనూర్ గ్రామం సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, ఉప సర్పంచ్ బోట్క చంద్రశేఖర్, వార్డు మెంబర్ కత్తి పరశురాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య యాదవ్, తోట జయరాములు, నక్కల సాయులు, వంక వెంకటయ్య, ఎలుక నరసింహ, అప్పల మల్లేష్, ఇండ్ల మల్లిఖార్జున్, కుమ్మరి సాంబశివ, వంక ఎల్లయ్య, దాసరి అంజి, వడ్ల నరేష్, పిట్టల నిరంజన్, అప్పల శ్రీను, సల్ల భీమయ్య, కొంగిరి లక్ష్మయ్య, నరసగల్ల కురుమూర్తి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.1
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1