Shuru
Apke Nagar Ki App…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
Ponna Eswaraiah
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామస్తులు ధర్నా.. పుంగనూరు మండలం, వనమలదిన్నె పంచాయతీ, ఓబిరెడ్డిపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉన్నాయని, గత మూడు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమీప వ్యవసాయ బోర్ల వద్దకు నీటి కోసం వెళ్తే రైతులు అనుమతించడం లేదని వాపోయారు. బోరు మరమ్మతులకు ప్రభుత్వ నిధులు లేవని, మరమ్మతుల కోసం ప్రతి ఇంటి నుంచి రూ.100 నుంచి రూ.200 వరకు డబ్బులు అడుగుతున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.1
- శ్రీశ్రీశ్రీ శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం. శివయ్య స్వామి గుడి లక్ష్మీ శ్రీనివాస నగర్. తుమ్మలగుంట రోడ్డు తిరుపతి, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ సోమవారం. సాయంత్రం స్వామివారికి దీపారాధన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది .హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ1
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- తేలికపాటి వర్షానికే రోడ్డుపై నీరు.. వాహనదారులకు ఇబ్బందులు పుంగనూరు పట్టణంలో సోమవారం రాత్రి కురిసిన తేలికపాటి వర్షానికి మంగళవారం రామసముద్రం రోడ్డుపై వర్షపు నీరు చేరింది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు , పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రహదారుల భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి గుంతలను మరమ్మతులు చేసి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు. అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు. అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. 1. Cr.No.139/2026 01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. 2. Cr.No.140/2026 16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. స్వాధీనం చేసుకున్న సొత్తు • రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది. • రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది. • మొత్తం రూ.30,900/- నగదు. • 67 ATM కార్డులు. • ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్. అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు: మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.4
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- పులివెందుల మండలంల ఈ.కొత్తపల్లిలో అంత్రం పేరుతో బంగారు ఉంగరం చోరీ పులివెందుల మండలంలోని ఈ. కొత్తపల్లిలో అంత్రం,మంత్రం పేరుతో ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆలీపును అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ నమ్మించిన ఓ ఫకీరు, మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థులు అప్రమత్తమై ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.1
- పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.3