Shuru
Apke Nagar Ki App…
పులివెందుల మండలంల ఈ.కొత్తపల్లిలో అంత్రం పేరుతో బంగారు ఉంగరం చోరీ పులివెందుల మండలంలోని ఈ. కొత్తపల్లిలో అంత్రం,మంత్రం పేరుతో ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆలీపును అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ నమ్మించిన ఓ ఫకీరు, మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థులు అప్రమత్తమై ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
LAKKU SIVA SANKAR reddy
పులివెందుల మండలంల ఈ.కొత్తపల్లిలో అంత్రం పేరుతో బంగారు ఉంగరం చోరీ పులివెందుల మండలంలోని ఈ. కొత్తపల్లిలో అంత్రం,మంత్రం పేరుతో ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆలీపును అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ నమ్మించిన ఓ ఫకీరు, మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థులు అప్రమత్తమై ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- కూలీలను విస్మరించిన ప్రభుత్వాల తీరుకు నిరసనగా ధర్నా... బద్వేలు, ఆగస్టు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేదల వ్యతిరేక విధానాలకు నిరసనగా BKMU ఆధ్వర్యంలో సోమవారం గోపవరం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ మాట్లాడుతూ, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, సూపర్ సిక్స్ పథకాలు అమలు కావడం లేదని, పేదల భూములను అధికార పార్టీ నేతలు కాజేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న జరిగే "చలో ఢిల్లీ" కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ ఏరియా సహాయ కార్యదర్శి పి.వి.రమణ, గోపవరం మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య, బద్వేలు ఏరియా అధ్యక్షులు పొంగూరు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.1
- పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పులివెందుల మండలంల ఈ.కొత్తపల్లిలో అంత్రం పేరుతో బంగారు ఉంగరం చోరీ పులివెందుల మండలంలోని ఈ. కొత్తపల్లిలో అంత్రం,మంత్రం పేరుతో ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆలీపును అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ నమ్మించిన ఓ ఫకీరు, మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థులు అప్రమత్తమై ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.1