Shuru
Apke Nagar Ki App…
శ్రీశ్రీశ్రీ శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం. శివయ్య స్వామి గుడి లక్ష్మీ శ్రీనివాస నగర్. తుమ్మలగుంట రోడ్డు తిరుపతి, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ సోమవారం. సాయంత్రం స్వామివారికి దీపారాధన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది .హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
RAVI KUMAR
శ్రీశ్రీశ్రీ శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం. శివయ్య స్వామి గుడి లక్ష్మీ శ్రీనివాస నగర్. తుమ్మలగుంట రోడ్డు తిరుపతి, తిరుపతి జిల్లా. ఆంధ్రప్రదేశ్ సోమవారం. సాయంత్రం స్వామివారికి దీపారాధన పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది .హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు. అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు. అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. 1. Cr.No.139/2026 01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. 2. Cr.No.140/2026 16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. స్వాధీనం చేసుకున్న సొత్తు • రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది. • రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది. • మొత్తం రూ.30,900/- నగదు. • 67 ATM కార్డులు. • ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్. అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు: మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.4
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.1
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- తేలికపాటి వర్షానికే రోడ్డుపై నీరు.. వాహనదారులకు ఇబ్బందులు పుంగనూరు పట్టణంలో సోమవారం రాత్రి కురిసిన తేలికపాటి వర్షానికి మంగళవారం రామసముద్రం రోడ్డుపై వర్షపు నీరు చేరింది. రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు , పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రహదారుల భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి గుంతలను మరమ్మతులు చేసి వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- పుంగనూరు లో సుగుటూరు గంగమ్మ FPO యొక్క 5వ వార్షిక మహాసభ సమావేశము... ఈరోజు పుంగనూరు మండలం కల్లుపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన సుగుటూరు గంగమ్మ FPO యొక్క 5వ వార్షిక మహాసభ సమావేశము ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల ఉద్యానవన శాఖాధికారి వరప్రసాద్, DCCB సహాయక మేనేజరు ఆయేషా,ఎపిమాస్ సంస్థ ప్రాజెక్టు మేనేజరు రమేష్ రెడ్డి, డా.ప్రహ్లాద ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. పుంగనూరు మండలం లోని రైతులు FPO కార్యవర్గ సభ్యులు సమక్షంలో సంస్థ CEO జానకి ఆధ్వర్యంలో ఈ మహాసభ నిర్వహించడం జరిగింది.ఈ మహాసభ సమావేశంలో గత 2025-26 సంవత్సరంలో FPO ద్వారా సాధించిన కార్యక్రమాల ప్రగతి,ఆర్థిక నివేదిక,మరియు రాబోవు 2026-27 సంవత్సరంలో FPO ద్వారా చేపట్టబోవు కార్యక్రమాల ప్రణాళిక, బడ్జెట్ ప్రణాళిక, గురించి మహాసభలో చర్చించి వాటిని ఆమోదించారు. ఉద్యానవన శాఖాదికారి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం వలన భూగర్భ జలాలు అడుగంటి పోవడం వలన వరి, చెరకు లాంటి నీటి తడి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగుచేయాలని భూమిపై పడిన వర్షపు నీటిని ఫారంపాండ్స్ ద్వారా నింపుకుని వర్షం లేని సమయంలో ఉపయోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా FPO లకు ప్రభుత్వం ద్వారా అందించు సహాయ సహకారాలు గురించి, వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు గురించి ఆయన ఈ సందర్భంగా వివరించారు. రైతులందరూ కలసి FPO లుగా ఏర్పడి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సంస్థ సీఈఓ జానకి ఆశాభావం వ్యక్తం చేశారు.2
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- పులివెందుల మండలంల ఈ.కొత్తపల్లిలో అంత్రం పేరుతో బంగారు ఉంగరం చోరీ పులివెందుల మండలంలోని ఈ. కొత్తపల్లిలో అంత్రం,మంత్రం పేరుతో ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆలీపును అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ నమ్మించిన ఓ ఫకీరు, మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థులు అప్రమత్తమై ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.1