Shuru
Apke Nagar Ki App…
కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..! కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది
Ulidra Raju
కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..! కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం ఎరుకల కాలనీలో వర్షం కోసం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో మంగళవారం గంగమ్మ దేవతకు వర్షం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని ప్రజలు రోగాల బారి నుండి కోలుకోవాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారి ముందు నల్ల గొంగళి(కమ్మడి) పరిచి బియ్యంతో ముగ్గు వేసి ఉరుములు కొడుతూ అమ్మవారిని వేడుకున్నారు పూజారికి అమ్మవారు ఆవాహమై వర్షాలు బాగా పడేటట్టుగా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చూసుకుంటానని వాక్కు ఇచ్చారు తదుపరి భక్తులకు అన్న ప్రసాదం పెట్టారు.1
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా! అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా.. వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా. రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్ రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా! అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా.. వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా. రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్1
- మంగనూర్ లో బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి. మండల్ గారి 108వ జయంతి. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మంగనూర్ గ్రామం లోని బీసీ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే గార్ల నూతన విగ్రహాల దిమ్మె దగ్గర బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బి.పి. మండల్ ) గారి 108వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమంలో మంగనూర్ గ్రామం సర్పంచ్ జాలం నాగయ్య యాదవ్, ఉప సర్పంచ్ బోట్క చంద్రశేఖర్, వార్డు మెంబర్ కత్తి పరశురాములు, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్, బీసీ సంఘం నాయకులు వేముల సత్యశీల సాగర్, మేకల యాదయ్య యాదవ్, తోట జయరాములు, నక్కల సాయులు, వంక వెంకటయ్య, ఎలుక నరసింహ, అప్పల మల్లేష్, ఇండ్ల మల్లిఖార్జున్, కుమ్మరి సాంబశివ, వంక ఎల్లయ్య, దాసరి అంజి, వడ్ల నరేష్, పిట్టల నిరంజన్, అప్పల శ్రీను, సల్ల భీమయ్య, కొంగిరి లక్ష్మయ్య, నరసగల్ల కురుమూర్తి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.1
- రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా! అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా.. వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా. రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్ రైతు కుటుంబాలకు ఎనలేని ధీమా.. రైతు బీమా! అన్నదాతలు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా.. వారిని ఆదుకొనేందుకు మానవీయ కోణంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా. రైతు బీమా ప్రీమియం కట్టకుండా తెలంగాణ రైతులను నయవంచన చేస్తున్న కాంగ్రెస్ రాబందు సర్కార్1
- పులివెందుల మండలంల ఈ.కొత్తపల్లిలో అంత్రం పేరుతో బంగారు ఉంగరం చోరీ పులివెందుల మండలంలోని ఈ. కొత్తపల్లిలో అంత్రం,మంత్రం పేరుతో ఓ వ్యక్తి నుంచి బంగారు ఉంగరం చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఆలీపును అంత్రం వేసి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తానంటూ నమ్మించిన ఓ ఫకీరు, మత్తు మందు ఇచ్చి అతని వద్ద ఉన్న సుమారు రూ.80 వేల విలువైన బంగారు ఉంగరాన్ని అపహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థులు అప్రమత్తమై ఫకీరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు.1