*ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలి.నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్* నాగర్ కర్నూల్ జనవరి 6..:మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఓటరు ముసాయిదాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టరేట్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఓటర్ జాబితా సవరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ...... జిల్లా వ్యాప్తంగా 3 మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా ఓటర్ల జాబితా అభ్యంతరాల పై మున్సిపాలిటీల వార్డుల వారీగా ఇదివరకే విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.ముసాయిదా ఓటర్ల జాబితాను జనవరి 1న నోటీసు బోర్డులపై వార్డుల వారీగా ప్రచురించడం జరిగిందని, ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సకాలంలో సమర్పించాలని సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఓటర్ల జాబితాను 2026 జనవరి 10న ప్రచురించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం కోరారు.నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీలు, నాగర్ కర్నూల్, మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులు, 48 పోలింగ్ కేంద్రాలు , కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులు, 44 పోలింగ్ కేంద్రాలు , కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డులు, 38 పోలింగ్ కేంద్రాలు , తెలిపారు. ఇప్పటివరకు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో 28, అభ్యంతరాలు, కల్వకుర్తి మున్సిపాలిటీలో 2, అభ్యంతరాలు కొల్లాపూర్ మున్సిపాలిటీలో 50, అభ్యంతరాలు వచ్చాయని వాటిని అన్నిటిని వెంటనే పరిష్కరిస్తామని, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక వార్డుకు సంబంధించిన ఓటర్ మరో వార్డులో ఓటర్ గా ఉన్నట్లయితే ఈనెల తొమ్మిదో తేదీ నాటికి రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యంతరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు కోరారు. ఫామ్ 7 లేకుంటే ఏ ఒక్క ఓటరు తొలగించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు గుర్తించిన, డూప్లికేట్, డబల్ ఓట్లు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు, తరలి వెళ్లిన ఓటర్ల వివరాలను తమకు అందిస్తే పరిశీలించి ఫామ్ 7 ద్వారా తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మూడు మున్సిపాలిటీల పరిధిలోని వార్డుల వారీగా జాబితా ప్రచురించడం జరిగిందని, ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ నెల 9వ తేదీ నాటికి అధికారులకు తెలియపరచాలని, ఈనెల 10వ తేదీన తుజజాబితా విడుదల కానున్నట్లు కలెక్టర్ తెలిపారు.జిల్లా ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, మున్సిపల్ కమిషనర్లు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

- నల్లగొండ బ్రేకింగ్: నల్గొండ జిల్లాలో ఉన్న రైల్వే ఆగిన బస్సులే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ కి చెందిన థార్ గ్యాంగ్ ను నల్గొండ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ శరత్చంద్ర పవర్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. ఆదమరిస్తే అరనిమిషంలో గాయబ్! చేసే థార్ గ్యాంగ్! హైవేలపై బస్సులే టార్గెట్.! ధాబాల వద్ద ఆగి ఉన్న బస్సులో ప్రయాణికుల బంగారం మాయం.. గత నెల చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బస్సు లో భారీ మొత్తం లో బంగారు ఆభరణాల చోరీ సంచలనం... కేసు ను సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. 15 రోజుల హైటెన్షన్ ఖాకి సినిమా రేంజ్ లో నల్లగొండ పోలీస్ ఆపరేషన్.. మధ్యప్రదేశ్ థార్ జిల్లాకు చెందిన అంతరాష్ట్ర “థార్ గ్యాంగ్” దొంగ నల్గొండ జిల్లా పోలీసుల వలలో చిక్కాడు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సీసీఎస్ బృందాల సైలెంట్ ట్రాక్... చివరికి ఉమర్భాన్ క్రాస్ రోడ్డు వద్ద ముఠా సభ్యుడు (దొంగ) షా అల్లా రఖా పట్టివేత.. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం... ముఠాలో ఐదుగురు… ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పాత నేర చరిత్ర... హోటళ్ల వద్ద ఆగిన బస్సులే టార్గెట్.. క్షణాల్లో చేతివాటం పరారీలో ఉన్న మిగతా నేరస్తుల కోసం వేట కొనసాగింపు... ఇట్టి ముఠా సభ్యులను సిసిఎస్, ఇన్స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి పర్యవేక్షంలో పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన, చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ,సి.సి.ఎస్ ఎస్ఐ శివ కుమార్, మరియు సి.సి.ఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన గిరి, పుష్పగిరి, నాగరాజు, కానిస్టేబుల్స్ వెంకటేష్, సాయికుమార్ , జూనేద్ , శివరాజు, మహేశ్, కమల్ కిశోర్. చిన్న బాబు మరియు ఇతర సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎప్.పి ప్రత్యేకంగా అభినందించి రివార్డును ప్రకటించారు.1
- ఎమ్మెల్యే పోతే పోవచ్చు.. కేటీఆర్ కానీ.. జీహెచ్ఎంసి ఎన్నికల్లో చాకుల్లాంటి యువకులను నిలబెడతాం..! వాళ్ళను గెలిపించుకుందాం కార్పొరేషన్ లో మళ్లొక్కసారి గులాబీ జెండా ఎగిరేద్దాం1
- VBG- RAMG కొత్త చట్టం ద్వారా తెలంగాణకు ఎంతో మేలు: సంగారెడ్డి లో మీడియాతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి1
- 👉గజ్వేల్ జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్ మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ అమ్మ బాగున్నారా అని ఆత్మీయంగా పలకరించిన కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను సమ్మక్క సారలమ్మ జాతరను ఆహ్వానించిన మంత్రులు సీతక్క కొండా సురేఖ తెలంగాణ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతను గజ్వేల్ ఎర్రవెల్లిలోని తననివాసానికి వచ్చిన మహిళా మంత్రులను బీఆర్ఎ ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా స్వాగతించారు. తెలంగాణ మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర ప్రసాదాన్ని అందించి, రాష్ట్ర ప్రభుత్వ తరపున జాతరకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు సాంప్రదాయ పద్ధతిలో పసుపు, కుంకుమ, చీరలు, తాంబూలాలతో మంత్రులను సత్కరించారు. తేనీటి విందు అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రులు ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నప్పుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1
- పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పమిడిపాడు గ్రామంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు2
- నకిరేకల్ నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు తాను అహర్నిశలు పనిచేస్తారని కార్యకర్తల శ్రేయస్సును మరువనని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం రాత్రి నార్కెట్పల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలకు అండగా ఉండడంతో పాటు అవసరమైన సమయంలో ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న అధికారులు1
- ములుగు జిల్లా మల్లంపల్లి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.1