Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
M D Azizuddin
మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
More news from తెలంగాణ and nearby areas
- ములుగు జిల్లా మేడారంకు నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు రానున్నారు. సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుని, మహా జాతర–2026 ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఇదే నెల 18 సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా మేడారం రానుండగా, 19న ఆధునీకరించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రారంభించి సమ్మక్క–సారక్క దేవతలకు మొక్కులు చెల్లించనున్నారు. మేడారం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.1
- కరాటే పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి.. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన కరాటే పోటీలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఆటలు, ధ్యానం వంటివి వారి మేధస్సును మెరుగుపరుస్తాయని ఆయన అన్నారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత పిల్లలకు సమయం కేటాయించి, సెల్ ఫోన్లకు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన సూచించారు.1
- సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ పట్టణం ఖాళీగా దర్శనమిస్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లు ట్రాఫిక్ జాములతో దర్శనమిస్తోంది. నిన్న ఈరోజు దాదాపు లక్ష వాహనాలు విజయవాడ వైపుగా వెళ్ళినట్లు కొర్లపాడు చౌటుప్పల్ టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఆదివారం కావడంతో తెల్లవారుజాము నుంచే విపరీతమైన ట్రాఫిక్ జాం నెలకొంది.1
- కరీంనగర్ జిల్లా హైదరాబాద్ ప్రధాన రహదారి అలుగునూరు బ్రిడ్జిపై మారుతి 800 కారులో మంటలు తగలబడుతున్న కారు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కు కలిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది1
- గజ్వేల్ మున్సిపల్‌లో బిజెపి జెండా ఎగరవేస్తాం – బైరి శంకర్ 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 10 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని 20 వార్డుల్లో బిజెపి జెండాను గర్వంగా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పనిచేస్తోందని అన్నారు. గజ్వేల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని, మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని బైరి శంకర్ హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.బైరి శంకర్ ముదిరాజ్, ఎల్లు రామ్ రెడ్డి, గడిపల్లి భాస్కర్, కప్పర ప్రసాద్ రావు, దేవులపల్లి మనోహర్ యాదవ్, శ్రీను, ఏల్కంటి సురేష్, చెప్యాల వెంకట్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చారి, కమ్మరి, నాయిని సందీప్ కుమార్, మడుగురి నరసింహ ముదిరాజ్, బారు అరవింద్,నాగు ముదిరాజ్, బింగి లక్ష్మీనారాయణ, మంద వెంకట్,దయాకర్ రెడ్డి, పోకల ప్రభాకర్, రామచంద్ర రెడ్డి,నిరంజన్ రెడ్డి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు1
- - ఏకశిలానగర్ రియల్ ఎస్టేట్ గుండా వెంకటేష్ కి సహకరిస్తుంది పోలీసులా ? ప్రభుత్వ పెద్దలా ? - ఈ ప్రాంత ఎంపీగా ఉన్న నేనే స్వయంగా హెచ్చరించిన తర్వాత కూడా బరితెగిస్తున్నారు అంటే ఎవరి అండ చూసుకుని ? - కత్తులు, రాడ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ల వెనుక ఉంది ఎవరు ? - ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు ? - పోలీసులు, లా అండ్ ఆర్డర్ ఏమైనట్టు ? - రోజుకో దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిచ్చేస్టమై పోయింది. - ప్రజల రక్తం కళ్ళచూస్తున్నా కళ్లు తెరవని ప్రభుత్వం. - ముడుపుల కోసం నోరు మూసుకుంటే.. ప్రాణాలు పోతున్నా పట్టించుకోకపోతే.. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. - వారికి అండగా మేమున్నాం.. ఉంటాం అంటున్న - ఈటల రాజేందర్.1
- Post by Ravi Poreddy1
- మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లకండం మేఘన రాణి, కడియాల భావన చిన్ననాటి నుంచి సన్నిహిత స్నేహితులు. పాఠశాల నుంచి ఉన్నత విద్య వరకు కలిసే చదువుకున్న వీరు, ఎంఎస్ చదువుల కోసం మూడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. ఇటీవల చదువులు పూర్తిచేసుకున్న అనంతరం కాలిఫోర్నియాలో విహారయాత్రకు వెళ్లిన సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడటంతో ఇద్దరూ మృతి చెందారు. 14 రోజుల తర్వాత వారి పార్ధివ దేహాలు స్వగ్రామాలకు చేరగా, ముల్కనూర్‌లో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.1