logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో హార్వెస్టర్ బావిలో పడ్డ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మరణించిన హార్వెస్టర్ డ్రైవర్ మధు మృతదేహాన్ని బయటకు తీసే చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బావిని మంత్రి పరిశీలించారు. మృతదేహాన్ని పలికితీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. మృతదేహం వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం అయ్యేవరకు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ మండల బాధిత కుటుంబానికి అండగా నిలవాలి మంత్రి సూచించారు. నందగిరి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న బావితో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు సోమవారం నందగిరి గ్రామాన్ని సందర్శించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి ఫోన్ లో అధికారులను ఆదేశించారు.

21 hrs ago
user_Porandla ramesh
Porandla ramesh
వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
21 hrs ago
e2c48731-e5eb-4823-822b-03b6ea78e7e3

*ప్రమాద స్థలాన్ని సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..* హార్వెస్టర్ బావిలో పడి జరిగిన ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో హార్వెస్టర్ బావిలో పడ్డ ప్రమాద స్థలాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మరణించిన హార్వెస్టర్ డ్రైవర్ మధు మృతదేహాన్ని బయటకు తీసే చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి

47269efa-2797-4d2f-8ae5-bddd623fca07

హామీ ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన బావిని మంత్రి పరిశీలించారు. మృతదేహాన్ని పలికితీయడానికి తగిన చర్యలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను ఫోన్ లో మంత్రి ఆదేశించారు. మృతదేహం వెలికి తీసిన తర్వాత పోస్టుమార్టం అయ్యేవరకు అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు కాంగ్రెస్ మండల బాధిత కుటుంబానికి అండగా నిలవాలి మంత్రి సూచించారు. నందగిరి గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో ప్రమాదకరంగా ఉన్న బావితో ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధికారులు సోమవారం నందగిరి గ్రామాన్ని సందర్శించి తగిన జాగ్రత్తలు చేపట్టాలని మంత్రి ఫోన్ లో అధికారులను ఆదేశించారు.

More news from తెలంగాణ and nearby areas
  • గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం: హిందువుల ఐక్యతే దేశ భద్రతకు బలమని కరీంనగర్ వివాగ్ సహా వ్యవస్థ ప్రముఖ్ దవులూరి మురళీధర్ అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్ వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో జంగపల్లి ఉప మండలం హిందూ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గుండ్లపల్లి లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ భద్రతకు హిందువుల ఐక్యత అవసరమని, ప్రతి హిందువు చైతన్యవంతు డై దేశ రక్షణకు, హిందూ ధర్మ రక్షణకు నడుము బిగించాలని పిలుపునిచ్చారు. హిందూ ఆడబిడ్డలు ల్యాండ్ జియాది, లవ్ జియాది ల చేతిలో మోసపోతున్నారని, వారి వలలు ఆడబిడ్డలు పడకుండా వారిని తల్లిదండ్రులు చైతన్యవంతులను చేయాలని సూచించారు. అందరూ ఐకమత్యంతో హిందూ పండుగలను వైభవంగా జరుపుకొని, కట్టు బొట్టు హైందవ శ్రీ అలంకరణ గొప్పతనాన్ని భావితరాలకు తల్లులు తెలియపరచాలని, ప్రతి హిందువు గర్వంగా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలని సూచించారు. హిందువులంతా ఐక్యమత్యంతో ఉంటే ఈ దేశాన్ని ఏ ఒక్కరు ఏమి చేయలేరని అన్నారు. హిందూ సమ్మేళన సభకు అధిక సంఖ్యలో మహిళలు స్థానిక ప్రజలు హాజరు కావడం ఆనందకరం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ శ్రీ రామ నామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ చేసి మానసిక ప్రశాంతతను పొందాలని, భావితరాలకు చక్కని క్రమశిక్షణ ను రామాయణ మహాభారత భాగవత గ్రంథాల నుండి గొప్ప వ్యక్తుల జీవిత గాధలతో తెలియపరచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సొల్లు అజయ్ వర్మ, సామ రాజిరెడ్డి, నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి, లెంకల కిషన్ రెడ్డి, దొమ్మాట భాస్కర్ రెడ్డి, తాళ్ల పెళ్లి పరుశురాం గౌడ్, కొంకటి గణేష్, అటికం రామచంద్రం గౌడ్ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    22 hrs ago
  • కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..
    1
    కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామం లోని ప్రాథమిక పాఠశాలల లో గత రాత్రి ఆకతాయిలు హల్చల్ చేశారు. పాఠశాల తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో ఉన్న సామాగ్రి తో పాటు టీచింగ్ మెటీరియల్ ను ధ్వంసం చేశారు. నేడు ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగులగొట్టి క్లాస్ రూమ్స్ లో సామాగ్రి.ధ్వంసం అయి ఉండడం తో స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. కొంత మంది గంజాయి మత్తులో ఈ అరాచకం సృష్టించి ఉంటారని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే టీచింగ్ మెటీరియల్ ధ్వంసం చేశారని వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, స్థానికులు కోరుతున్నారు..
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు. స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.
    1
    తెలంగాణ సత్తెమ్మ గా గుర్తింపును సాధించిన పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచ ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన చిందం సత్తెమ్మ మృతి చెందగా మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సత్తెమ్మ అంత్య క్రియల్లో పాల్గొని స్వయంగా పాడేను మోసి సత్తెమ్మకు ఘన నివాళి అర్పించారు.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గం అగ్రహారానికి సమీపంలో ఉన్న తేట్టకుంట వద్ద ఆర్ అండ్ ఆర్ కాలనీ చీర్లవంచలో నివాసం ఉంటున్న  ప్రముఖ ఉద్యమకారురాలు తెలంగాణ సత్తెమ్మ మృతి పట్ల బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తు ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించడమే కాకుండా, కేటీఆర్ స్వయంగా పాడె మోశారు.తెలంగాణ మలిదశ ఉద్యమంలో సత్తెమ్మ చురుకైన పాత్ర పోషించారు. ఉద్యమ సమయంలో ప్రతిరోజూ ఉద్యమంలో పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనితగా గుర్తింపును సాధించారు.
స్వరాష్ట్ర సాధన కోసం సత్తెమ్మ చేసిన పోరాటం, ఆమె అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు ,మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ ,రాష్ట్ర నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు పలికారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    6 hrs ago
  • పత్రికా ప్రకటన ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్: ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది. జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి. “మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి. నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది. ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి. 3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది. వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది. ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి. విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి. గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది. దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది. నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.
    1
    పత్రికా ప్రకటన 
ఏప్రిల్ 20, 2026-ఆదిలాబాద్:
ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రతిభకు గాను ప్రధాన మంత్రి అవార్డు లభించింది. ఇది గర్వకారణమైన ఘనత మాత్రమే కాకుండా, నార్నూర్‌కు కొత్త మార్పు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది.
ఈ గుర్తింపుతో నార్నూర్ నీటిని కేంద్రంగా చేసుకొని సమగ్ర అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టింది. ఏప్రిల్ తర్వాత వెంటనే చెరువుల పునరుద్ధరణ పనులు ప్రారంభించబడ్డాయి. మొత్తం 10 సాగునీటి చెరువులు పునరుద్ధరించబడి, 79,300 ఘన మీటర్ల మట్టిని తొలగించి, నీటి నిల్వ సామర్థ్యం 30 లక్షల ఘన మీటర్లకు పైగా పెంచబడింది.
జల్ శక్తి అభియాన్ కింద పెర్కొలేషన్ ట్యాంకులు, చెక్ డ్యామ్‌లు, బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు తాడిహత్నూర్, సోనాపూర్, నాగల్కొండ, జాండా, గుంజాల వంటి గ్రామాలలో చేపట్టబడ్డాయి. ఇవి భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడి వ్యవసాయానికి బలాన్నిచ్చాయి.
“మన బడి – మన నీరు” కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో వర్షపు నీటి సంగ్రహణ గుంతలు నిర్మించబడ్డాయి.
నీటి లభ్యత మెరుగుపడడంతో తాగునీటి పై ప్రత్యేక దృష్టి పెట్టబడింది. నాందీ వాటర్స్ సహకారంతో నార్నూర్, ఖంపూర్, నాగల్కొండలో RO ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. CHC నార్నూర్‌లో కూడా RO ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య కేంద్రాల్లో సురక్షిత నీటి అందుబాటు పెరిగింది.
ఆర్థికాభివృద్ధి దిశగా మహువా లడ్డూ యూనిట్, బాంబూ ప్రాసెసింగ్ యూనిట్, దాల్ మిల్ వంటి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. మార్కెట్ లింకేజ్లు, రివాల్వింగ్ ఫండ్ మద్దతు ద్వారా రైతులకు మంచి ధరలు లభించాయి.
3700 చెట్లపై లాక్ సాగు చేపట్టి 370 గిరిజన కుటుంబాలకు స్థిర ఆదాయం కల్పించబడింది.
వ్యవసాయంలో వాడి మూడు స్థాయిల సాగు విధానం, డ్రిప్ ఇరిగేషన్, సేంద్రీయ వ్యవసాయం, తేనెటీగల పెంపకం, ఆయిల్ పామ్ సాగు వంటి పద్ధతులు అమలు చేయబడ్డాయి. సాయిల్ హెల్త్ కార్డులతో శాస్త్రీయ వ్యవసాయం ప్రోత్సహించబడింది.
ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కింద గృహ నిర్మాణం (హౌసింగ్), PM JANMAN ద్వారా గిరిజన అభివృద్ధి చేపట్టబడింది.
ఆరోగ్యరంగంలో టెలీమెడిసిన్ సేవలు, ధర్మ సేవ వెల్నెస్ ప్రోగ్రామ్, మెన్స్ట్రుయల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు అమలు చేయబడ్డాయి. అంగన్వాడీ కేంద్రాలు బలోపేతం చేయబడి, పోషణ మేళాలు నిర్వహించబడ్డాయి. రెండు సబ్‌సెంటర్లు NQAS సర్టిఫికేషన్ పొందాయి.
విద్యలో డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంగ్లీష్ లిటరసీ ప్రోగ్రామ్ ద్వారా 48.6% మెరుగుదల నమోదైంది. ప్రత్యేక అవసరాల పిల్లల కోసం AI ఆధారిత బోధన పద్ధతులు ప్రవేశపెట్టబడ్డాయి.
గిరిజన సంస్కృతిని పరిరక్షించేందుకు ట్రైబల్ మ్యూజియం స్థాపించబడింది. యువతలో నాయకత్వాన్ని పెంపొందించేందుకు యంగ్ లీడర్స్ క్లబ్బులు ఏర్పాటు చేయబడ్డాయి.
ఈ సమగ్ర చర్యల ఫలితంగా నార్నూర్ అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించబడింది.
దీని ఫలితంగా 2025 సెప్టెంబర్ క్వార్టర్‌లో దక్షిణ ప్రాంతంలో డెల్టా ర్యాంకింగ్‌లో 1వ స్థానం సాధించబడింది. NITI Aayog స్టేట్ యూజ్ కేస్ ఛాలెంజ్‌లో విద్య విభాగంలో 3వ స్థానం కూడా లభించింది.
నార్నూర్ ప్రయాణం నీటి ఆధారిత, సమగ్ర అభివృద్ధి మోడల్‌గా నిలిచింది. ప్రధాన మంత్రి అవార్డు ద్వారా ప్రారంభమైన ఈ మార్పు, ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి దిశగా కొనసాగుతోంది.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
    13 min ago
  • నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    నెరడిగొండ మండలంలోని బుద్దికొండ గ్రామంలో నూతనంగా గొల్ల నారాయణ నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృప్రవేశానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. అర్హులందరికీ రెండవ విడతలో ఇల్లు అందేలా కృషి చేస్తానని అన్నారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇండ్లను త్వరతరగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Neradigonda, Adilabad•
    4 hrs ago
  • తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.
    3
    తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో  ఏర్పాటు చేసిన వరి ధాన్యపు  కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు  చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    6 hrs ago
  • ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ. స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼
    1
    ఆవిడకు తెలంగాణ రాష్ట్రంపై ఉన్న ప్రేమ, కేసీఆర్ గారిపై ఉన్న అభిమానం వెలకట్టలేనిది. సత్తెమ్మ గారి పాడె మోసి, ఆవిడ పార్థివ దేహానికి నేడు నివాళులర్పించాము.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ప్రతిరోజూ పాల్గొంటూ, "జై తెలంగాణ" నినాదమే ఊపిరిగా జీవించిన ధీరవనిత సత్తెమ్మ.
స్వరాష్ట్ర సాధన కోసం వారు చేసిన పోరాటం, వారి అంకితభావం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. 💐🙏🏼
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    ఇచ్చోడ, ఆదిలాబాద్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.