logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్...రైతులు పండించిన పంటలను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కరీంనగర్ లో మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్...రైతులు పండించిన పంటలను త్వరగా కొనుగోలు చేయాలని డిమాండ్ తెలంగాణలో దళారి వ్యవస్థను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. పంట మార్పిడి చేయాలని చెబుతున్న ప్రభుత్వమే పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పర్యటించి కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించిన ఆయన... తీసుకోవల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ

సందర్భంగా వారు మాట్లాడుతూ... పంట మార్పిడితో భూమి సారవంతమవుతుందని... ప్రత్యామ్నాయన పంటలతో దిగుబడి పెరుగుతుందని... పంట మార్పిడిని ప్రోత్సహించిన ప్రభుత్వం... పంట మార్పిడిలో భాగంగా సాగు చేసిన మొక్కజొన్నను కొనుగోలు చేసేందుకు రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో చొప్పదండి... మానకొండూర్ నియోజకవర్గాల్లో తప్ప... కరీంనగర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలేదన్న గంగుల... కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం ఎం.డితో మాట్లాడితే... ఇప్పుడు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో సుమారు 3 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేశారని... సాగుకు అనుగుణంగా... ఒకటి కరీంనగర్ అగ్రికల్చర్ మార్కెట్ లో... మరొకటి కొత్తపల్లి మండలం మల్కాపూర్ లో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కజొన్న సాగు చేస్తే... ఎకరాకు 35 నుంచి

40 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని... 24 వందల మద్దతు ధరతో... ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని గంగుల తప్పుబట్టారు. ఎకరాకు 25 క్వింటాళ్ళు మాత్రమే కొంటామంటే... మిగతా 10 క్వింటాళ్ళ ధాన్యాన్ని రైతులు ఏం చేయాలని ప్రశ్నించారు. దళారులకు అమ్ముకుంటే క్వింటాల్ కు 18 వందలు మాత్రమే చెల్లిస్తున్నారని... దీంతో ఒక్కో క్వింటాల్ పై రైతులు 6 వందల రూపాయల వరకు నష్టపోతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమా అంటు ప్రశ్నించారు. ఎకరాన ఎన్ని క్వింటాళ్ళు పండితే అన్ని క్వింటాళ్ళు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న గంగుల... ఏదో మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాన్ని నడిపించి... మధ్యలో ఎత్తివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాన్నీ నడిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.
    1
    బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 
జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
    1
    మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.
సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి  సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు.
ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ
వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని,
30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో   మలయశ్రీ రచించిన  సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • Post by Vodnala thirupthi
    1
    Post by Vodnala thirupthi
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    8 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
  • జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు.  సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    1
    జగిత్యాల జిల్లా...
తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. 
సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు.
పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.
    1
    హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. మండలాధ్యక్షుడు మరుగిద్దె రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందుకూరి నరేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, యువ నాయకులు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు గారి సేవలను స్మరించుకుంటూ అభివృద్ధి దిశగా ఆయన నాయకత్వాన్ని ప్రశంసించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    1
    raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    user_Katta Thirupathi
    Katta Thirupathi
    Grain Wholesaler బుగ్గారం, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉదృతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.
    1
    హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన  నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని,  సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉదృతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు.  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.