logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిది. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

4 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
4 hrs ago

సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిది. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • *మేధావులారా....డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పెదవి విప్పండి* *మీ మౌనం సమాజానికి అరిష్టం* *సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే ప్రయోజనాలను వివరించండి* *కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి* *మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే* *మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని కాంగ్రెస్ కూటమి తీరని ద్రోహం చేసింది* *సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమోళి, సుప్రియాలకు పదవులిస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లా?* సాధారణ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టకూడదా? కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు. రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు బస సత్యనారాయణ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు వాసాల రమేశ్, గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే.... అంబేద్కర్ బీజేపీ నాయకుడు కాదు. అయినా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను, ఆయన ఆలోచనా విధనాలను, ఆశయాలను గల్లీగల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎందుకంటే అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంబేద్కర్... అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అలుపెరగని పోరాటానికి మరో రూపం. సమాజంలోని అట్టడుగు వర్గాల సమానత్వం, స్వేచ్ఛ, హక్కులకు సజీవ స్వరూపం. యావత్ ప్రపంచంలోని అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే బాబాసాహెబ్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అంతటి మహోన్నుతుడి గురించి భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. నిజానికి అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి? అణగారిన వర్గాల బాధలను తెలుసుకోవడం. దళిత కులంలో పుట్టి అంటరానివాడిగా వెలివేయబడ్డా, తినడానికి తిండి లేకపోయినా ఒకపూట పస్తులుంటూ ఆ పైసలతో పుస్తకాలు కొనుక్కుని మొక్కవోని దీక్షతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని లక్ష్యాన్ని చేరుకుని అద్బుతమైన రాజ్యాంగాన్ని అందించారు. ఎక్కడో మధ్యప్రదేశ్ లోని ‘‘మౌ’’ అనే ఓ చిన్న పల్లెటూళ్లో దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ పుట్టుకతో సంపన్నుడు కాదు... కటిక పేదరికాన్ని అనుభవించాడు. గుడ్డి దీపం వెలుతురులో బతికినోడు. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం చేసేవాడు. డబ్బులు మిగిలించి వాటితో పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే ఫణంగా పెట్టాడు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆసక్తి ఉన్న స్తోమత లేకపోవడంతో అప్పటి బరోడా మహారాజు వద్దకు పోయి సాయం కోరితే.... విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చాక 10 ఏళ్ల పాటు తన సంస్థానంలోనే పనిచేయాలని షరతు పెడితే.... చదువు మీద మక్కువతో ఆ షరతును ఒఫ్పుకున్నాడు. మనకు స్వాతంత్ర్యం రాకముందే అంటే 1925లోనే దళిత, గిరిజన జాతులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలుండాలని ఆనాటి సైమన్ కమిషన్ కు నివేదిక ఇచ్చారంటే ఆయనకున్న ముందుచూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. దళిత, గిరిజన, మహిళలందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు. ఒక మనిషికి ఒకే ఓటు.. సమాన విలువ పేరుతో అంబానీ అయినా అడుక్కునేవాడికైనా సరే ఒకే ఓటు కల్పించిన నాయకుడు. ‘‘ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని శక్తివంతులవుతారో..... డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుని బానిసలుగా బతుకుతారో మీ చేతుల్లోనే ఉంది’’అని నిష్కర్షగా చెప్పిన మేధావి అంబేద్కర్. ఇయాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని నడిపేవారు చెడ్డవాళ్లయితే అది కూడా చెడిపోతుంది’’అని నిర్మొహమాటంగా చెప్పిన మహనీయుడు. అంబేద్కర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచింది. ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని చెరబట్టింది. వారసత్వ పాలనతో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు కుట్రలు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్. మహాత్మాగాంధీ విజ్ఝప్తి మేరకు స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కేబినెట్ లో చేరిన కాంగ్రెసేతర వ్యక్తులు ఇద్దరే. వారిలో అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. వీళ్లను కేబినెట్ నుండి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నా సరైన గౌరవం ఇవ్వకుండా నెహ్రూ ప్రభుత్వం 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. స్వాతంత్రానికి పూర్వం హిందువులకు వేర్వేరుగా అనేక వ్యక్తిగత చట్టాలుండేవి. వాటిని ఒకే చట్టంగా మార్చేందుకు 1951లో హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మహిళలకు సమాన ఆస్తి హక్కులు, కుటుంబ ఆస్తిలో సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రతిపాదించారు. ఒకే వ్యక్తికి ఒకే భార్య ఉండాలని, మహిళలకూ విడాకులు తీసుకునే హక్కు ఉండాలని, వివాహ బంధాన్ని చట్టపరమైన ఒప్పందంగా ఉండాలని, పిల్లలపై తల్లి హక్కులను గుర్తించాలని, మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు. వాటిని పక్కకుపెట్టి నెహ్రూ అంబేద్కర్ ను అవమానించారు. తీవ్ర మనస్థాపంతో అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఆ తరువాత 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే.... కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ ను ఓడించేందుకు కుట్ర చేశారు. 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అంబేద్కర్ నిలబడితే ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ స్వయంగా అభ్యర్థిని నిలబెట్టింది. చరిత్రలో అంబేద్కర్‌ ప్రాధాన్యత తగ్గించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి 2 గజాల జాగా కూడా కేటాయించలేదు(పీవీని కూడా ఇలానే అవమానించారు). చేసేదేమీలేక అంబేద్కర్ పార్ధివ దేహాన్ని ముంబై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంబేద్కర్ మృతదేహాన్ని పంపిన విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా ఆయన భార్యకు బిల్లులను పంపించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది. ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే... 1955లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే తనకు తానుగా సిఫారసు చేసుకుని దేశ అత్యున్నతమైన భారతరత్న అవార్డు అందుకున్నారు. 1971లో ఇందిరాగాంధీ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. రాజీవ్ గాంధీసహా కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖ నాయకులకు భారతరత్న అవార్డులిచ్చారు. కానీ అంబేద్కర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఇంకా బాధాకరమేందంటే...అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్.ఎస్. కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దళిత జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని అంబేద్కర్ ధారపోస్తే.... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీలకు దశాబ్దాలపాటు సామాజిక న్యాయాన్ని దూరం చేసింది. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే.... అది బీజేపీ మాత్రమే. నెహ్రూ ఏకపక్ష విధానాలను ప్రశ్నించిన అంబేద్కర్ ను పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా రెండుసార్లు కాంగ్రెస్ ఓడిస్తే జన సంఘ్ పార్టీ అంబేద్కర్ ను బెంగాల్ లో ఎమ్మెల్సీగా చేసింది. బీజేపీ మద్దతుతోనే నాటి వీ.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడగానే 1990లో అంబేద్కర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఎన్డీయే ప్రభుత్వదం ‘‘రాష్ట్రీయ సమరసత దినంగా’’ నిర్వహిస్తోంది. 2014లో మోదీగారు ప్రధాని పగ్గాలు చేపట్టి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి ప్రణమిల్లి ‘చాయ్ వాలాకు ప్రధాని పదవి దక్కిందంటే...అది అంబేద్కర్ పెట్టిన భిక్షే’అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే బీజేపీ విధానమని చెప్పిన నాయకుడు మోదీ. అంబేద్కర్ నడయాడిన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ్, చైతన్య భూమి పేరుతో పంచ తీర్ధాలుగా ప్రకటించి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెబుతున్నారు. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల చేయడమే కాకుండా 120 దేశాల్లో అంబేద్కర్ జయంతి రోజున సామాజిక న్యాయం, సమరసత వేడుకలు నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ కు జాతీయ హోదా కల్పించారు. బీజేపీ సిద్ధాంతాలకు, అంబేద్కర్ ఆలోచనలకు సారూప్యత ఉంది. ఆర్దిక, సామాజిక సమానత్వ + రాజకీయ స్వేచ్ఛ హక్కులు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యమనే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో చూపుతున్న మహానాయకుడు నరేంద్రమోదీ గారు. అణగారిన వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో.... బ్యాంకు ముఖమే చూడని 52 కోట్ల మంది పేదలకు జన్ ధన్ ఖాతాలను తెరిపించిన నేరుగా సంక్షేమ పథకాల నగదులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. PMAY ద్వారా 4 కోట్ల ఇండ్లను నిర్మించారు. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం అందించారు. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ‘హర్ ఘర్ జల్ యోజన’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ టాయిలెట్ల నిర్మించారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద 77 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. 10 కోట్ల 33 లక్షల కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాల జమ చేశారు. ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే. వాటిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకొస్తే అడ్డుకుని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేసినం. ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు. పెరిగిన జనాభాను ద్రుష్టిలో పెట్టుకుని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను పెంచాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆలోచించి బిల్లును రూపొందించి అమలు చేయాలనుకుంటే అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ దే. ఈ బిల్లు అమలై ఉంటే అస్తవ్యస్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను సరిచేయడంతోపాటు అదనంగా 50 శాతం సీట్లు పెరిగే అవకాశముండేది. ఉదాహరణకు నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాల కలెక్టర్లు, ఎంతో మంది అధికారులున్నారు. సీట్లు పెంచి ఉంటే...ఎంపీ సీట్లు పెరిగి కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది. మహిళా బిల్లును అడ్డుకుని దేశ మహిళలను అవమానించింది. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ద్రుష్టిలో సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కనిమోళి, సుప్రియా సూలెకు పదవులు వస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లు. సాధారణ మహిళలకు పదవులు వస్తే వాళ్ల పునాదులు కూలిపోతాయనే భయంతోనే మహిళా బిల్లును అడ్డుకుంటోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంబేద్కర్ ఆలోచనలో భాగమే. ఆనాడు అంబేద్కర్ ను ఏ విధంగా అవమానపరిచారో, అంబేద్కర్ ఆలోచన మేరకు మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్న నరేంద్రమోదీని అవమానించేందుకు కుట్రలు చేస్తోంది. ఈ సందర్భంగా మేధావులను కోరేదొక్కటే. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. మీకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు. అంబేద్కర్ సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి మంచిది కాదు. ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.
    3
    *మేధావులారా....డీలిమిటేషన్, మహిళా బిల్లుపై పెదవి విప్పండి*
*మీ మౌనం సమాజానికి అరిష్టం*
*సీట్లు పెంచితే దక్షిణాదికి జరిగే ప్రయోజనాలను వివరించండి*
*కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టండి*
*మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే*
*మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని కాంగ్రెస్ కూటమి తీరని ద్రోహం చేసింది*
*సోనియా, ప్రియాంక, డింపుల్, కనిమోళి, సుప్రియాలకు పదవులిస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లా?*
సాధారణ మహిళలు చట్టసభల్లో అడుగుపెట్టకూడదా?
కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలైతే సమాజానికి జరిగే ప్రయోజనాలపై  మేధావులు పెదవి విప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి చేశారు. మేధావుల మౌనం సమాజానికి అరిష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మేధావులకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు.’’అని అన్నారు. సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై అంబేద్కర్ నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారని గుర్తు చేశారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. ‘‘ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లండి. అంబేద్కర్ కోరుకున్నట్లుగా అట్టడుగునున్న వర్గాలందరికీ ఆర్దిక, సామాజిక సమానత్వం +  రాజకీయ స్వేచ్ఛ  హక్కులు దక్కేందుకు మీ వంతు సహకారం అందించండి. వాటి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న మోదీ సర్కార్ కు అండగా నిలవాలని చేతులెత్తి విజ్ఝప్తి చేస్తున్నా.’’అని పిలుపునిచ్చారు. 
రాజ్యాంగ రూపకర్త, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో ఈరోజు సాయంత్రం నిర్వహించిన ‘‘మేధావుల సదస్సు’’లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ అధ్యక్షులు  బస సత్యనారాయణ, దళిత మోర్చా అధ్యక్షులు సోమిడి వేణు, కార్పొరేటర్లు వాసాల రమేశ్, గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేధావులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే....
అంబేద్కర్ బీజేపీ నాయకుడు కాదు. అయినా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను, ఆయన ఆలోచనా విధనాలను, ఆశయాలను గల్లీగల్లీకి తీసుకెళ్లాలని బీజేపీ ఎందుకు అనుకుంటోంది? ఎందుకంటే అణగారిన వర్గాల ప్రజల వెలుగు రేఖ అంబేద్కర్... అంటరానితనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన  మేధావి. భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి. అలుపెరగని పోరాటానికి మరో రూపం. సమాజంలోని అట్టడుగు వర్గాల సమానత్వం, స్వేచ్ఛ, హక్కులకు సజీవ స్వరూపం. యావత్ ప్రపంచంలోని అణగారినవర్గాల ఆత్మగౌరవ సూచిక అంబేద్కర్ అంటూ ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందంటే బాబాసాహెబ్ ఎంత గొప్పవాడో అర్ధం చేసుకోవాలి. అంతటి మహోన్నుతుడి గురించి భావి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మోదీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. 
నిజానికి అంబేద్కర్ గురించి తెలుసుకోవడం అంటే ఏమిటి?  అణగారిన వర్గాల బాధలను తెలుసుకోవడం. దళిత కులంలో పుట్టి అంటరానివాడిగా వెలివేయబడ్డా, తినడానికి తిండి లేకపోయినా ఒకపూట పస్తులుంటూ ఆ పైసలతో పుస్తకాలు కొనుక్కుని మొక్కవోని దీక్షతో పెద్ద పెద్ద చదువులు చదువుకుని లక్ష్యాన్ని చేరుకుని అద్బుతమైన రాజ్యాంగాన్ని అందించారు.  ఎక్కడో మధ్యప్రదేశ్ లోని ‘‘మౌ’’ అనే ఓ చిన్న పల్లెటూళ్లో దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ పుట్టుకతో సంపన్నుడు కాదు... కటిక పేదరికాన్ని అనుభవించాడు. గుడ్డి దీపం వెలుతురులో బతికినోడు. ఎంత ఆకలి వేసినా ఒక్క పూటే భోజనం చేసేవాడు.  డబ్బులు మిగిలించి వాటితో పుస్తకాలు కొనుక్కుని చదివేవాడు. చదువు కోసం 10 ఏళ్ల జీవితాన్నే ఫణంగా పెట్టాడు. విదేశాల్లో ఉన్నత విద్య చదువుకోవాలనే ఆసక్తి ఉన్న స్తోమత లేకపోవడంతో అప్పటి బరోడా మహారాజు వద్దకు పోయి సాయం కోరితే.... విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చాక 10 ఏళ్ల పాటు తన సంస్థానంలోనే పనిచేయాలని షరతు పెడితే.... చదువు మీద మక్కువతో ఆ షరతును ఒఫ్పుకున్నాడు.
మనకు స్వాతంత్ర్యం రాకముందే అంటే 1925లోనే దళిత, గిరిజన జాతులకు ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గాలుండాలని ఆనాటి సైమన్ కమిషన్ కు నివేదిక ఇచ్చారంటే ఆయనకున్న ముందుచూపుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. దళిత, గిరిజన, మహిళలందరికీ ఓటు హక్కు కల్పించిన మహనీయుడు. ఒక మనిషికి ఒకే ఓటు.. సమాన విలువ పేరుతో అంబానీ అయినా అడుక్కునేవాడికైనా సరే ఒకే ఓటు కల్పించిన నాయకుడు. ‘‘ఓటు అనే ఆయుధాన్ని వాడుకుని శక్తివంతులవుతారో..... డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుని బానిసలుగా బతుకుతారో మీ చేతుల్లోనే ఉంది’’అని నిష్కర్షగా చెప్పిన మేధావి అంబేద్కర్. ఇయాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నామంటే అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. ‘‘రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని నడిపేవారు చెడ్డవాళ్లయితే అది కూడా చెడిపోతుంది’’అని నిర్మొహమాటంగా చెప్పిన మహనీయుడు. 
అంబేద్కర్ చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగానికి అడుగడుగునా తూట్లు పొడిచింది. ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని చెరబట్టింది. వారసత్వ పాలనతో రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేందుకు కుట్రలు చేసింది. ఇదేమిటని ప్రశ్నించిన అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించింది కాంగ్రెస్. మహాత్మాగాంధీ విజ్ఝప్తి మేరకు స్వాతంత్ర్యం వచ్చాక నెహ్రూ కేబినెట్ లో చేరిన కాంగ్రెసేతర వ్యక్తులు ఇద్దరే. వారిలో అంబేద్కర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. వీళ్లను కేబినెట్ నుండి తప్పించేందుకు కాంగ్రెస్ చేసిన కుట్రలు, అవమానాలు అన్నీ ఇన్నీ కావు. 
జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. అంబేద్కర్ లా మినిస్టర్ గా ఉన్నా సరైన గౌరవం ఇవ్వకుండా నెహ్రూ ప్రభుత్వం 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. స్వాతంత్రానికి పూర్వం హిందువులకు వేర్వేరుగా అనేక వ్యక్తిగత చట్టాలుండేవి. వాటిని ఒకే చట్టంగా మార్చేందుకు 1951లో హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మహిళలకు సమాన ఆస్తి హక్కులు, కుటుంబ ఆస్తిలో సమాన భాగస్వామ్యం ఉండాలని ప్రతిపాదించారు. ఒకే వ్యక్తికి ఒకే భార్య ఉండాలని, మహిళలకూ విడాకులు తీసుకునే హక్కు ఉండాలని, వివాహ బంధాన్ని చట్టపరమైన ఒప్పందంగా ఉండాలని, పిల్లలపై తల్లి హక్కులను గుర్తించాలని, మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించారు.  వాటిని పక్కకుపెట్టి నెహ్రూ అంబేద్కర్ ను అవమానించారు. తీవ్ర మనస్థాపంతో అంబేద్కర్ కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
ఆ తరువాత 1952లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్ ఎంపీగా పోటీ చేస్తే.... కమ్యూనిస్టులతో చేతులు కలిపి అంబేద్కర్ ను ఓడించేందుకు కుట్ర చేశారు. 1954 ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా అంబేద్కర్ నిలబడితే ఆయనను ఓడించడానికి కాంగ్రెస్ స్వయంగా అభ్యర్థిని నిలబెట్టింది. చరిత్రలో అంబేద్కర్‌ ప్రాధాన్యత తగ్గించేందుకు కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. అంబేద్కర్ చనిపోతే ఢిల్లీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి 2 గజాల జాగా కూడా కేటాయించలేదు(పీవీని కూడా ఇలానే అవమానించారు). చేసేదేమీలేక అంబేద్కర్ పార్ధివ దేహాన్ని ముంబై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అంబేద్కర్ మృతదేహాన్ని పంపిన విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా ఆయన భార్యకు బిల్లులను పంపించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ ది.  
ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే... 1955లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే తనకు తానుగా సిఫారసు చేసుకుని దేశ అత్యున్నతమైన భారతరత్న అవార్డు అందుకున్నారు. 1971లో ఇందిరాగాంధీ సైతం అదే సాంప్రదాయాన్ని కొనసాగించింది. రాజీవ్ గాంధీసహా కాంగ్రెస్ లో ఉన్న ప్రముఖ నాయకులకు భారతరత్న అవార్డులిచ్చారు. కానీ అంబేద్కర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం భారతరత్న ఇవ్వలేదు. ఇంకా బాధాకరమేందంటే...అంబేద్కర్‌ను ఓడించిన అభ్యర్థి ఎన్.ఎస్. కజ్రోల్కర్‌కు 1970లో కాంగ్రెస్ ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచేందుకు కూడా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇవ్వలేదు. దళిత జాతి అభ్యున్నతి కోసం జీవితాన్ని అంబేద్కర్ ధారపోస్తే.... కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎస్సీ, ఎస్టీలకు దశాబ్దాలపాటు సామాజిక న్యాయాన్ని దూరం చేసింది. 
అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేస్తున్న ఏకైక జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే.... అది బీజేపీ మాత్రమే. నెహ్రూ ఏకపక్ష విధానాలను ప్రశ్నించిన అంబేద్కర్ ను పార్లమెంట్ లో అడుగుపెట్టకుండా రెండుసార్లు కాంగ్రెస్ ఓడిస్తే జన సంఘ్ పార్టీ అంబేద్కర్ ను బెంగాల్ లో ఎమ్మెల్సీగా చేసింది. బీజేపీ మద్దతుతోనే నాటి వీ.పి.సింగ్ ప్రభుత్వం ఏర్పడగానే 1990లో అంబేద్కర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14న ఎన్డీయే ప్రభుత్వదం ‘‘రాష్ట్రీయ సమరసత దినంగా’’ నిర్వహిస్తోంది. 
2014లో మోదీగారు ప్రధాని పగ్గాలు చేపట్టి పార్లమెంట్ లో అడుగుపెట్టిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి ప్రణమిల్లి ‘చాయ్ వాలాకు ప్రధాని పదవి దక్కిందంటే...అది అంబేద్కర్ పెట్టిన భిక్షే’అని చెప్పారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే బీజేపీ విధానమని చెప్పిన నాయకుడు మోదీ. అంబేద్కర్ నడయాడిన జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్వాణ్, చైతన్య భూమి పేరుతో పంచ తీర్ధాలుగా ప్రకటించి ఆయన గొప్పతనాన్ని భావితరాలకు చాటిచెబుతున్నారు. అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల చేయడమే కాకుండా 120 దేశాల్లో అంబేద్కర్ జయంతి రోజున సామాజిక న్యాయం, సమరసత వేడుకలు నిర్వహించారు. జాతీయ బీసీ కమిషన్ కు జాతీయ హోదా కల్పించారు.
బీజేపీ సిద్ధాంతాలకు, అంబేద్కర్ ఆలోచనలకు సారూప్యత ఉంది. ఆర్దిక, సామాజిక సమానత్వ +  రాజకీయ స్వేచ్ఛ  హక్కులు దక్కినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యమనే అంబేద్కర్ గారి ఆలోచనలను ఆచరణలో చూపుతున్న మహానాయకుడు నరేంద్రమోదీ గారు. అణగారిన వర్గాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో.... బ్యాంకు ముఖమే చూడని 52 కోట్ల మంది పేదలకు జన్ ధన్ ఖాతాలను తెరిపించిన నేరుగా సంక్షేమ పథకాల నగదులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. PMAY ద్వారా 4 కోట్ల ఇండ్లను నిర్మించారు. మరో 3 కోట్ల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 81 కోట్ల మందికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా రేషన్ బియ్యం అందించారు. 15 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ‘హర్ ఘర్ జల్ యోజన’ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్లు అందించారు. 12 కోట్ల మందికి స్వచ్ఛ భారత్ టాయిలెట్ల నిర్మించారు.  ఆయుష్మాన్ భారత్ పథకం కింద 77 కోట్ల మందికి 5 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించారు. 10 కోట్ల 33 లక్షల కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలను 11 కోట్ల మంది రైతుల ఖాతాల జమ చేశారు.
ఇక డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు అంబేద్కర్ ఆలోచనల్లో భాగమే. వాటిని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకొస్తే అడ్డుకుని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. 52 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 ఎంపీ సీట్లు ఖరారు చేసినం. ఇప్పుడు భారతదేశ జనాభా 140 కోట్లు. పెరిగిన జనాభాను ద్రుష్టిలో పెట్టుకుని పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను పెంచాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆలోచించి బిల్లును రూపొందించి అమలు చేయాలనుకుంటే అడ్డుకున్న ఘనత కాంగ్రెస్ దే. 
ఈ బిల్లు అమలై ఉంటే అస్తవ్యస్తంగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలను సరిచేయడంతోపాటు అదనంగా 50 శాతం సీట్లు పెరిగే అవకాశముండేది. ఉదాహరణకు నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాల కలెక్టర్లు, ఎంతో మంది అధికారులున్నారు. సీట్లు పెంచి ఉంటే...ఎంపీ సీట్లు పెరిగి కొత్త వాళ్లకు అవకాశం వస్తుంది. మహిళా బిల్లును అడ్డుకుని దేశ మహిళలను అవమానించింది. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ద్రుష్టిలో సోనియాగాంధీకి, ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్, కనిమోళి, సుప్రియా సూలెకు పదవులు వస్తేనే మహిళలకు న్యాయం జరిగినట్లు. సాధారణ మహిళలకు పదవులు వస్తే వాళ్ల పునాదులు కూలిపోతాయనే భయంతోనే మహిళా బిల్లును అడ్డుకుంటోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంబేద్కర్ ఆలోచనలో భాగమే. ఆనాడు అంబేద్కర్ ను ఏ విధంగా అవమానపరిచారో, అంబేద్కర్ ఆలోచన మేరకు మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తున్న నరేంద్రమోదీని అవమానించేందుకు కుట్రలు చేస్తోంది.
ఈ సందర్భంగా మేధావులను కోరేదొక్కటే. మేధావుల మౌనం సమాజానికి అరిష్టం. మీకు రాజకీయాలతో పనిలేదు. వ్యక్తులతో పనిలేదు. సమాజంలో తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. మంచి పనులు చేస్తే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లుపై మేధావి వర్గం మౌనం వహించడం, పక్షపాత ధోరణి అవలంబించడం సరికాదు. అంబేద్కర్ సమాజంలో జరిగే మంచి చెడులపై, పాలకుల నిర్ణయాలపై నిష్కర్షగా అభిప్రాయాలను చెప్పేవారు. జ్ఝానంలో అంబేద్కర్ వారసులైన మీరు అందుకు భిన్నంగా మౌనం వహించడం సమాజానికి మంచిది కాదు. ఇకనైనా మౌనం వీడండి. తప్పును తప్పుగా చెప్పండి. ఆ బిల్లులతో మహిళలకు, సమాజానికి మంచి జరుగుతుందని భావిస్తే మీడియా, సోషల్ మీడియా, సదస్సులు, సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నా.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    44 min ago
  • గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    1
    గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి.
రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో జగిత్యాలకు చేరుకున్న కేసిఆర్ కు ఘనస్వాగతం లభించింది.‌ హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు జీవన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా కేసిఆర్ ఆలింగనం చేసుకుని జీవన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణం నృత్యాలు, నినాదాలతో హోరెత్తింది. హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం పై చక్కర్లు కొట్టారు. పార్టీ శ్రేణులు ఈలలు వేస్తు నృత్యాలు చేశారు. డ్రోన్ కెమెరాతో సభా ప్రాంగణం పై గులాబీ పూల వర్షం కురిపించారు.
    4
    గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో జగిత్యాలకు చేరుకున్న కేసిఆర్ కు ఘనస్వాగతం లభించింది.‌ హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు జీవన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా కేసిఆర్ ఆలింగనం చేసుకుని జీవన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణం నృత్యాలు, నినాదాలతో హోరెత్తింది. హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం పై చక్కర్లు కొట్టారు. పార్టీ శ్రేణులు ఈలలు వేస్తు నృత్యాలు చేశారు. డ్రోన్ కెమెరాతో సభా ప్రాంగణం పై గులాబీ పూల వర్షం కురిపించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు.  సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    1
    జగిత్యాల జిల్లా...
తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. 
సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు.
అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దీంతో,  దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు.
పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు.  మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    1
    raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel
    user_Katta Thirupathi
    Katta Thirupathi
    Grain Wholesaler బుగ్గారం, జగిత్యాల, తెలంగాణ•
    13 hrs ago
  • జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    1
    జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    1 hr ago
  • కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు
    1
    కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని
ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.