జగిత్యాలలో గులాబీ జోష్... కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో జగిత్యాలకు చేరుకున్న కేసిఆర్ కు ఘనస్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు జీవన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా కేసిఆర్ ఆలింగనం చేసుకుని జీవన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణం నృత్యాలు, నినాదాలతో హోరెత్తింది. హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం పై చక్కర్లు కొట్టారు. పార్టీ శ్రేణులు ఈలలు వేస్తు నృత్యాలు చేశారు. డ్రోన్ కెమెరాతో సభా ప్రాంగణం పై గులాబీ పూల వర్షం కురిపించారు.
జగిత్యాలలో గులాబీ జోష్... కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికిన మాజీమంత్రి జీవన్‌రెడ్డి గులాబీ దళపతి మాజీ సీఎం కేసీఆర్ ఏడాది తర్వాత ప్రజాక్షేత్రంలోకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఎర్రవెల్లి నుంచి హెలికాప్టర్ లో జగిత్యాలకు
చేరుకున్న కేసిఆర్ కు ఘనస్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు జీవన్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలుకగా కేసిఆర్ ఆలింగనం
చేసుకుని జీవన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం నేరుగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ రాకతో సభా ప్రాంగణం నృత్యాలు, నినాదాలతో
హోరెత్తింది. హెలికాప్టర్ నుంచి సభా ప్రాంగణం పై చక్కర్లు కొట్టారు. పార్టీ శ్రేణులు ఈలలు వేస్తు నృత్యాలు చేశారు. డ్రోన్ కెమెరాతో సభా ప్రాంగణం పై గులాబీ పూల వర్షం కురిపించారు.
- కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు1
- Post by Vodnala thirupthi1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో శంకర జయంతి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజు అయిన సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, పారాయణాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహోత్సవాలు వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు నాలుగు రోజులపాటు జరుగనున్నాయి. మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు మూలమూర్తులైన లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించగా, రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి ఆలయ అర్చకులు ఆంతరంగికంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపనిషత్ భాష్య పారాయణం, వేద పారాయణాలు మరియు ఇతర విశిష్ట ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ సాయంకాలం “శంకర విజయము”పై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు. మహోత్సవాల చివరి రోజు అయిన పంచమి నాడు సాయంకాలం వేద సదస్సు నిర్వహించనున్నారు. అలాగే వైశాఖ మాస విశిష్టతను పురస్కరించుకుని వసంతోత్సవ పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.ఈ కార్యక్రమాలు రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయ అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.1
- మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సంక్షేమ వారోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మరిమిట్ట మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుంచి 26 వరకు వారం రోజుల పాటు వసతి గృహాల్లో పారిశుధ్యం, ఆరోగ్యం, మైనర్ రిపేర్లపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.1
- మానవత్వ వాదిగా,హేతు వాదిగా,అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప వ్యక్తి మలయశ్రీ. సిపిఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. సాహిత్య రంగంలో అనేక స్వీయ అనుభవం,కవితా,రచనలపై ఆయనకున్న పట్టుదల ఎంతో శ్లాఘనీయమైనదని,సాహిత్య రంగంలో డాక్టర్ మలయశ్రీ పాత్ర మరువలేనిదని సిపిఐ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన రేకుర్తి వాస్తవ్యులు ప్రముఖ కవి, రచయిత డాక్టర్ మలయశ్రీ ఇటీవల మృతి చెందడంతో సోమవారం కరీంనగర్ లోని ఆయన నివాసానికి సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తో కలిసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మలయశ్రీ చిత్రపటానికి చాడ వెంకటరెడ్డి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ వామపక్ష,అభ్యుదయ వాదిగా,కవితా రచనల పట్ల ఆసక్తితో అందులో అనేక మెళకువలు నేర్చుకొని,మానవాలి ఎదుర్కొంటున్న సమస్యలు,సవాళ్లును అవగాహన చేసుకొని,వాటిని అధ్యయనం చేసి ఎన్నో రచనలు చేసి పుస్తకాల రూపంలో ప్రజలకు అందించిన రచయిత అని,కులాల,మతాల,మానవత్వానికి సంబంధించిన అంతర్లీన అంశాలపై ఎన్నో ,ఎన్నెన్నో కవితలు,సామెతలు వ్రాసారని,మానవతా వాదిగా దోపిడీ రహిత పరిపాలన కొనసాగాలని,అంతరాలు లేని సమాజం కావాలని కోరుకునే వారని, 30 ఏళ్ల క్రితం తాను చిగురుమామిడి మండల పరిషత్ అధ్యక్షులుగా, సిపిఐ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో మలయశ్రీ రచించిన సామెతలు - హేతువాదం అనే పుస్తకాన్ని నాకు అంకితం చేయడం అత్యంత గొప్ప అవకాశంగా భావిస్తున్నానని,డాక్టర్ మలయశ్రీ కవిగా,రచయితగా,హేతువాదిగా,వామపక్ష అభ్యుదయ వాదిగా నీతి,నిజాయితీగా ఎంతో ఉన్నతమైన విలువలతో కూడా జీవితాన్ని గడిపారని, సాహిత్య రంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేందుకు నావంతుగా కృషి చేస్తానని, ఎల్ ఎం డి లో కరీంనగర్ జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మేధో వికలాంగుల పాఠశాలలో మలయశ్రీ రచనలపై ఓ కార్యక్రమం నిర్వహిస్తామని,అలాంటి మహనీయుని జీవిత లక్ష్యాలను నెరవేర్చేందుకు నేటి తరం వారు ముందుకు రావాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2