Shuru
Apke Nagar Ki App…
జగిత్యాల సభకు హరీష్ రావు రాకపోవడంతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ...బిజేపి నేతల టచ్ లోకి హరీష్ రావు వెళ్ళాడని విమర్శ బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.
K.V.REDDY
జగిత్యాల సభకు హరీష్ రావు రాకపోవడంతో బిఆర్ఎస్ లో ముసలం పుట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ...బిజేపి నేతల టచ్ లోకి హరీష్ రావు వెళ్ళాడని విమర్శ బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- బీఆర్ఎస్ వర్గపోరు మొదలైందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో కేసిఆర్ స్పష్టం చేశారన్నారు. మీడియాకు వీడియో రిలీజ్ చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల సభలో కేసీఆర్ కేటీఆర్, హరీష్ రావు డీల్లీ టూర్ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దూరమైన కుటుంబ సభ్యురాలు కవిత, పార్టీని తిట్టాలని పెట్టుకున్న బహిరంగ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ల కుటీల మనస్తత్వంతో హరీష్ రావు బిజేపి నేతల టచ్ లోకి వెళ్ళాడని తెలిపారు.1
- కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడుగా ముమ్మిడి శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక తన గెలుపునకు కృషిచేసిన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో సంక్షేమ సంఘానికి ప్రతినిత్యం తనవంతు పోరాటాన్ని సాగిస్తానని ఆటో డ్రైవర్లకి ఏ కష్టమొచ్చినా నేను ముందుండి నడిపిస్తానని తెలిపారు1
- గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన రైతు చాడ నాగిరెడ్డి సోమవారం తన మక్కలను మాదాపూర్ కొనుగోలు కేంద్రానికి తరలించే సమయంలో నష్టం వాటిల్లింది. గునుకుల కొండాపూర్–జంగపల్లి మార్గంలో కంకర రోడ్డు ఉండటంతో జంగపల్లి వద్ద ట్రాక్టర్ తీవ్ర కుదింపులకు గురై, సుమారు 3 క్వింటాళ్ల మక్కలు దాదాపు 100 మీటర్ల మేర రోడ్డుపాలయ్యాయి. రోడ్డు సదుపాయం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని మెరుగుపరచాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని సినీనటి పూనమ్ కౌర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె స్వామివారికి కోడె మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.2
- జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా... తెలంగాణ ఉద్యమనేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలు అప్రతిహతంగా కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కి మరో కొద్దీ గంటల్లో బిఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీ లోకి ఆహ్వానించనున్నారు. ఇందుకు సంబంధించి, జీవన్ రెడ్డి రాకను స్వాగత్తిస్తూ, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సమీపంలోని వివేకానంద మినిస్టేడియంలో ఏర్పాటు చేశారు. సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసి, కెసిఆర్ ను సభకు ఆహ్వానించడం,జీవన్ రెడ్డి చేరికకు ప్రాధాన్యతను కల్పించడం, కెసిఆర్ స్వయంగా సభాముఖంగా బి ఆర్ ఎస్ కండువా కప్పి తన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం,జగిత్యాల జనాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో, దాదాపుగా రెండున్నర సంవత్సరాలకు ప్రజాక్షేత్రంలో అడుగిడి, చేయనున్నారు ప్రసంగం కోసం ఎదిరిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీ మాయం చేశారు. పెద్ద ఎత్తునప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రధాన రోడ్లపై భారీ ఎల్ ఈ డి స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి రెండురోజులుగా జగిత్యాలో బి ఆర్ ఎస్ సందడి కనిపిస్తుంది1
- raithula pantaa machar kosam kapala undalsi vasthundhi mari enni rojulu machar kosam chudalo mari prajalu....mee katta Thirupathi patel1
- హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ యుద్ద భేరీ మోగించింది. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో భేటీ అయ్యారు. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలుసహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్ర తరం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటాలను కొనసాగించేందుకు సిద్దమవుతోంది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఈ సందర్భంగా ఆయా పార్టీ శ్రేణులు కేంద్ర మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. డంపింగ్ యార్డు ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, హుజూరాబాద్ యువతకు పెళ్లి సంబంధాలు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళన సహేతుకమైన నేపథ్యంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. ఒక్కసారి ఉద్యమం ప్రారంభిస్తే... వెనకడుగు వేయొద్దని, సర్కార్ దిగొచ్చేదాకా వివిధ రూపాల్లో ఉదృతంగా పోరాడుతూనే ఉండాలని చెప్పారు. ఉద్యమ సెగ సర్కార్ పెద్దలకు తాకే దాకా పోరాడాలని, అందుకు అవసరమైన సహాయ సహకారాలను సంపూర్ణంగా అందిస్తానని హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు హేళనగా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని, మన పోరాటాలే వారికి జవాబు కావాలని అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయాలని భావిస్తున్నారు.1