logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మైనింగ్ ప్రతిపాదనలు ఆదివాసుల జీవనానికి ముప్పు: సోమేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ అనుమతిస్తే ఆదివాసుల జీవనాధారం నాశనం అవుతుందని రింతాడ ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ హెచ్చరించారు. ఆదిలాబాద్‌లో సింగరేణి గనుల విస్తరణతో ఒకప్పుడు ఆదివాసులు నివసించిన అటవీ ప్రాంతాలు ఖాళీ అయ్యాయని, వారు బలవంతపు వలసలు వెళ్లి జీవనోపాధి కోల్పోయారని గుర్తుచేశారు. 1/70 చట్టం ఆదివాసి భూములను రక్షిస్తోందని, పెట్టుబడిదారుల కోసం దాన్ని సవరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖనిజ తవ్వకాలకు అనుమతిస్తే ఆదివాసుల హక్కులు, సంస్కృతి, జీవనం ప్రమాదంలో పడతాయని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

7 hrs ago
user_Rc Tv Telugu
Rc Tv Telugu
Paderu, Alluri Sitharama Raju•
7 hrs ago
4d28b853-eeeb-43c5-be59-90f82b30e0b8

మైనింగ్ ప్రతిపాదనలు ఆదివాసుల జీవనానికి ముప్పు: సోమేష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రైవేట్ మైనింగ్ అనుమతిస్తే ఆదివాసుల జీవనాధారం నాశనం అవుతుందని రింతాడ ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ హెచ్చరించారు. ఆదిలాబాద్‌లో సింగరేణి గనుల విస్తరణతో ఒకప్పుడు ఆదివాసులు నివసించిన అటవీ ప్రాంతాలు ఖాళీ అయ్యాయని, వారు బలవంతపు వలసలు వెళ్లి జీవనోపాధి కోల్పోయారని గుర్తుచేశారు. 1/70 చట్టం ఆదివాసి భూములను రక్షిస్తోందని, పెట్టుబడిదారుల కోసం దాన్ని సవరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఖనిజ తవ్వకాలకు అనుమతిస్తే ఆదివాసుల హక్కులు, సంస్కృతి, జీవనం ప్రమాదంలో పడతాయని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    1
    హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    50 min ago
  • అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా  ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
    1
    పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. 
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. 
పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. *నేడు త్రిశూల స్నానం* మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    4
    దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర  స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో   మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.   ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 
*నేడు త్రిశూల స్నానం*
మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా  పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • Post by APPARAO KONCHADA
    1
    Post by APPARAO KONCHADA
    user_APPARAO KONCHADA
    APPARAO KONCHADA
    Palakonda, Parvathipuram Manyam•
    16 hrs ago
  • పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.
    1
    పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు' ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.
    1
    చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు'
ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    41 min ago
  • రాజవొమ్మంగిలో ఎంప్లాయిస్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోక పోవడంతో చెట్లు, పొదలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం అంతా విషసర్పాలకు నిలయంగా మారిందని చుట్టూ ప్రక్కల నివాసం ఉంటున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీటిని తొలగించాలని కోరుతున్నారు.
    1
    రాజవొమ్మంగిలో ఎంప్లాయిస్ కాలనీ లో ప్రభుత్వం నిర్మించిన నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోక పోవడంతో చెట్లు, పొదలు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతం అంతా విషసర్పాలకు నిలయంగా మారిందని చుట్టూ ప్రక్కల నివాసం ఉంటున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించి వీటిని తొలగించాలని కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.