పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.

- పార్వతీపురంలో నాటు సారాను అంతం చేయాలి. అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం: పార్వతీపురంలో నాటు సారాను పూర్తిగా అంతం చేసి అక్కడి యువతను సన్మార్గంలో నడిపించడానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ రామకృష్ణంరాజు అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నవోదయ పథకం ద్వారా నాటుసారైనా అరికట్టడానికి 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అయితే ఆ చర్యలు ఫలవంతం అవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ఆ ప్రాంతంలో ఓ ముఠా రెల్లి సామాజిక వర్గీయులతో నాటు సారా తయారు చేయించి విక్రయాలు సాగిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారని విమర్శించారు. యువత రోజు ఐదారు వేల రూపాయలు సంపాదించడంతో అటువైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సభకు వివరించారు. దీనిపై తాను వ్యక్తిగతంగా అనేకమార్లు పోరాటం చేసినప్పటికీ నాటు సారా వ్యవస్థను అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కొందరు అధికారులు కంచే చేను మేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి ఆ ముఠా ఆటలను కట్టడి చేసి పార్వతీపురం యువతను సన్మార్గంలో నడిచేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. యువతకు మంచి ఉపాధి కల్పించడం ద్వారా వారిని నాటుసారా తయారీకి దూరంగా ఉంచవచ్చునని వెల్లడించారు. ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రతిపాదనకు సభ్యులందరూ బల్లలు తరుస్తూ హర్షద్వానాలు వ్యక్తం చేశారు.1
- పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.1
- అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.1
- Post by APPARAO KONCHADA1
- హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- సంతబొమ్మాళి ఫిబ్రవరి 18, సంతబొమ్మాలి మండలం జామి మర్రిపాడు లో ఎల్లమ్మ తల్లి పూజలు బుధవారం నాడు ఘనంగా భక్తు నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా భక్తులు అమ్మవారిని దేవర్ను ఊరేగించి మరాటితో గ్రామ ప్రదక్షిణ నిర్వహించారు. దేవాలయం వద్ద భక్తులు విశేష పూజ నిర్వహించి పోతురాజు వద్ద మురాటలు సమర్పించారు.2
- టెక్కలికి 15 కోట్ల వ్యయంతో 50 పడగల ఆయుష్ హాస్పటల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ల చిత్రపటాలకు టిడిపి శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. టెక్కలి అన్నా క్యాంటీన్ జంక్షన్లో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ టెక్కలి అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చన్న నాయుడికి టెక్కలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.1
- ముందస్తు పనులు లేవు.. మండుటెండల్లో రక్షణ లేదు: ఉపాధి కూలీల గోస కొమరాడలో సిపిఎం ఆధ్వర్యంలో కూలీల నిరసన అధికారుల నిర్లక్ష్యంపై ధ్వజం కొమరాడ ఒకవైపు 125 రోజుల పని కల్పిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పాత పనులు పూర్తయి, కొత్త పనులు మంజూరు కాక ఉపాధి హామీ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కొమరాడ మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 31 పంచాయతీల్లో పాత పనులు పూర్తయ్యాయని, కొత్త పనులు ప్రారంభించడంలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. ఏప్రిల్ వంటి మండుటెండల్లో పనులు ప్రారంభించడం అంటే కూలీల ప్రాణాలతో చెలగాటమాడటమేనని మండిపడ్డారు. గతంలో పని ప్రదేశంలో మంచినీరు, నీడ కోసం టెంట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ సరఫరా చేసేవారని, ఇప్పుడు అవి ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు. కూలీలకు కనీసం గమేలాలు, పారలు, గునపాలు వంటి పనిముట్లు కూడా అందడం లేదని అన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరల దృష్ట్యా ఉపాధి కూలీని రోజుకు ₹600లకు పెంచాలని, ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. 2005లో వామపక్షాల మద్దతుతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి, కొత్తగా తెచ్చిన నిబంధనల వల్ల కూలీలు వలస బాట పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాటల్లో గొప్పలు చెబుతూ, చేతల్లో కూలీలను ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. వెంటనే అన్ని గ్రామాల్లో కొత్త పనులు ప్రారంభించి, పని ప్రదేశంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. తక్షణమే మండలంలోని అన్ని పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభించకపోతే, కూలీలందరినీ ఐక్యం చేసి ఎంపీడీవో (MPDO) కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1