Shuru
Apke Nagar Ki App…
ప్రత్తిపాడు వద్ద అదుపుతప్పిన ఆటో బోల్తా.. డ్రైవర్ కు గాయాలు ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం మిట్టపల్లి కళాశాల సమీపంలోని ఎన్ హెచ్ 16 పై ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఓ సిమెంట్ కంపెనీకి చెందిన ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
SIVA
ప్రత్తిపాడు వద్ద అదుపుతప్పిన ఆటో బోల్తా.. డ్రైవర్ కు గాయాలు ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం మిట్టపల్లి కళాశాల సమీపంలోని ఎన్ హెచ్ 16 పై ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఓ సిమెంట్ కంపెనీకి చెందిన ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
More news from Andhra Pradesh and nearby areas
- హర్ ఘర్ తిరంగా1
- డీఎస్సీ లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా రేపల్లెలో భారీ బైక్ ర్యాలీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, కూటమి ప్రభుత్వంలో జరిగిన DSC అక్రమాలకు వ్యతిరేకంగా రేపల్లె నియోజకవర్గంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, నియోజకవర్గ పరిశీలకులు అడపా శేషు , యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెరుగు చందన్ నాగ్ తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ భారీ బైక్ ర్యాలీకి DSC అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు మరియు రేపల్లె నియోజకవర్గ ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన DSC నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని, లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో మరియు వారి కష్టంతో ఈ ప్రభుత్వం ఆడుకుంటోందని నాయకులు మండిపడ్డారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు తక్షణమే పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.1
- కృష్ణా జిల్లా మచిలీపట్నం. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో 200 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ.. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 16వ బెటాలియన్ ఎన్సిసి క్యాడేట్ల తో కలిసి 200 అడుగుల భారీ జాతీయ జెండాతో మచిలీపట్నం పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, 16వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ రూపేష్ అవస్తి ముఖ్య అతిథులుగా పాల్గొని ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు. భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుంటూ వారి త్యాగ ఫలాలను నేడు భారతదేశ ప్రజలు గుర్తుంచుకునే విధంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కార్యక్రమాన్ని కోనేరు సెంటర్ నుండి ఆంధ్రజాతీయ కళాశాల మైదానం వరకు కొనసాగించారు. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చిన 2047 వికసిత భారత్ లక్ష్యంతో నేటి యువత భారతదేశ నిర్మాణానికి రథసారదులుగా నిలవాలని తెలిపారు. ఆగస్టు 10వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ అభివృద్ధిని కాంక్షిస్తూ నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.4
- ప్రత్తిపాడు వద్ద అదుపుతప్పిన ఆటో బోల్తా.. డ్రైవర్ కు గాయాలు ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం మిట్టపల్లి కళాశాల సమీపంలోని ఎన్ హెచ్ 16 పై ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఓ సిమెంట్ కంపెనీకి చెందిన ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.1