logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి.. రవాణా శాఖ సిబ్బందిపై ఆరోపణలు విశాఖపట్నం, గాజువాక: షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన వివాదాస్పదంగా మారింది. వాహనం నిలపలేదన్న కారణంతో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్‌టేక్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిడిగుద్దులతో దాడి చేయడంతో లారీ డ్రైవర్‌కు రక్తగాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనను నిరసిస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

6 hrs ago
user_Velpula Manoj Kumar
Velpula Manoj Kumar
బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
6 hrs ago

విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి.. రవాణా శాఖ సిబ్బందిపై ఆరోపణలు విశాఖపట్నం, గాజువాక: షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన వివాదాస్పదంగా మారింది. వాహనం నిలపలేదన్న కారణంతో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్‌టేక్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిడిగుద్దులతో దాడి చేయడంతో లారీ డ్రైవర్‌కు రక్తగాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనను నిరసిస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు
    1
    మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు 
మీడియాతో మాట్లాడుతున్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 min ago
  • కూనారం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్‌ అంకిత్‌. కొత్తగూడెం, ఆగస్టు 24: కూనారం గ్రామంలోని అటవీ–రెవెన్యూ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్‌ సర్వే నివేదికలు, రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులు, మ్యాపులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పాత, తాజా సర్వేల మధ్య తేడాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో జాయింట్‌ సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో సమస్యలకు స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కూనారం సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సూచించారు.
    1
    కూనారం భూ సమస్యకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్‌ అంకిత్‌.
కొత్తగూడెం, ఆగస్టు 24: కూనారం గ్రామంలోని అటవీ–రెవెన్యూ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. గతంలో నిర్వహించిన సర్వేలు, జాయింట్‌ సర్వే నివేదికలు, రెవెన్యూ, అటవీ శాఖల రికార్డులు, మ్యాపులను సమగ్రంగా పరిశీలించి తుది నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
పాత, తాజా సర్వేల మధ్య తేడాలకు కారణాలను గుర్తించాలని సూచించారు. దమ్మపేట, కరకగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో జాయింట్‌ సర్వేలు కొనసాగుతున్నాయని తెలిపారు. వచ్చే ఆరు నుంచి ఏడు నెలల్లో సమస్యలకు స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
కూనారం సమస్య చాలా కాలంగా కొనసాగుతున్నందున సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ సూచించారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    33 min ago
  • తృటిలో తప్పిన పెనుప్రమాదం....... . లోయ అంచున బస్సు....... ప్రయాణికులు సేఫ్ లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుం తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    1
    తృటిలో తప్పిన పెనుప్రమాదం....... . లోయ అంచున బస్సు.......  ప్రయాణికులు సేఫ్ 
లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుం తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    user_Radhika
    Radhika
    Tailor భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    6 hrs ago
  • విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు
    1
    విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు 

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి 
విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి 
టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది 
ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    1
    తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    1
    ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***.   రేషన్ బియ్యం పట్టివేత

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు...✊🏻🙂
    1
    మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు...✊🏻🙂
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 min ago
  • కొత్తగూడెం: కూనారం భూ సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ... కొత్తగూడెం, ఆగస్టు 24: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యపై జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానికులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. పాత సర్వేలు, జాయింట్‌ సర్వే నివేదికలు, రెవెన్యూ–అటవీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని జాటోత్‌ హుస్సేన్‌ సూచించారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్‌ల్యాప్‌ ప్రాంతాలను మరోసారి సర్వే చేయాలని, 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి రైతులు, గిరిజనులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
    1
    కొత్తగూడెం: కూనారం భూ సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ...
కొత్తగూడెం, ఆగస్టు 24: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యపై జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానికులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు.
పాత సర్వేలు, జాయింట్‌ సర్వే నివేదికలు, రెవెన్యూ–అటవీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని జాటోత్‌ హుస్సేన్‌ సూచించారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్‌ల్యాప్‌ ప్రాంతాలను మరోసారి సర్వే చేయాలని, 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి రైతులు, గిరిజనులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    37 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.