logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కొత్తగూడెం: కూనారం భూ సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ... కొత్తగూడెం, ఆగస్టు 24: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యపై జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానికులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. పాత సర్వేలు, జాయింట్‌ సర్వే నివేదికలు, రెవెన్యూ–అటవీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని జాటోత్‌ హుస్సేన్‌ సూచించారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్‌ల్యాప్‌ ప్రాంతాలను మరోసారి సర్వే చేయాలని, 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి రైతులు, గిరిజనులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

1 hr ago
user_Velpula Manoj Kumar
Velpula Manoj Kumar
బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 hr ago

కొత్తగూడెం: కూనారం భూ సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్‌ విచారణ... కొత్తగూడెం, ఆగస్టు 24: లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కూనారం గ్రామంలో అటవీ–రెవెన్యూ భూ సమస్యపై జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం గిరిజనులు, స్థానికులు, రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల అధికారులతో పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. పాత సర్వేలు, జాయింట్‌ సర్వే నివేదికలు, రెవెన్యూ–అటవీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని జాటోత్‌ హుస్సేన్‌ సూచించారు. అంబాసత్రం భూమి ఎక్కడ ఉందో గుర్తించి, ఓవర్‌ల్యాప్‌ ప్రాంతాలను మరోసారి సర్వే చేయాలని, 15 రోజుల్లో ప్రాథమిక స్పష్టత వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించి రైతులు, గిరిజనులు, సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ అటవీ సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    1
    లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻 ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯 మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
    1
    80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻

ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯

మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
80 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇలా నిలదీసిన నాయకుడు ఇంకొకరు లేరు👆🏻
ఆయన టార్గెట్ పదవి కాదు ప్రజలు💯
మల్లన్న గురించి ఈ సోదరుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి వినండి🙏
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    54 min ago
  • ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
    1
    బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి
వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది.
బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం.
దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని నేను కాదు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు. ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24: కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని నేను కాదు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
అనవసర విషయాల్లో జోక్యం చేసుకునే వ్యక్తిని కాదు.
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 24: కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత అంశాల్లో అనవసరంగా జోక్యం చేసుకునే వ్యక్తిని తాను కాదని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన ఆరోపణలపై సోమవారం ఇబ్రహీంపట్నంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.శాసనసభ్యునిగా తన కార్యాలయానికి ప్రతిరోజూ ఎంతోమంది ప్రజలు, వివిధ వర్గాల వారు వస్తుంటారని ఎమ్మెల్యే తెలిపారు. అదే విధంగా మేఘన, ఆమె కుటుంబ సభ్యులు కూడా తన కార్యాలయానికి వచ్చినట్లు చెప్పారు. ప్రజాప్రతినిధి కార్యాలయానికి ఎవరైనా రావచ్చని, తమ సమస్యలను చెప్పుకోవచ్చని పేర్కొన్నారు.
మేఘన కుటుంబ వ్యవహారం కావడంతో ఇరు వర్గాలు పరస్పరం మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని మాత్రమే తాను సూచించినట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు వివరించారు. ఈ విషయంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తన పాత్ర కేవలం సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సలహా ఇవ్వడం వరకే పరిమితమైందని స్పష్టం చేశారు.
తన వ్యక్తిత్వం, తన వ్యవహారశైలి ప్రజలందరికీ తెలుసునని ఎమ్మెల్యే అన్నారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను రాజకీయ అంశాలతో ముడిపెట్టడం సరికాదని సూచించారు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత.. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం... ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు. ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు. ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.
    1
    నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత..
ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం...
ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు.
ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు.
ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు...✊🏻🙂
    1
    మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఈసీఐఎల్ మైదానంలో నిర్వహించిన GenZ Adda with Mallanna కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి పాల్గొన్న *టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు...✊🏻🙂
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    57 min ago
  • ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.
    1
    ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది
ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    1
    ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి....
సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం.
దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.