logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.

1 hr ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
1 hr ago

ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.

More news from తెలంగాణ and nearby areas
  • ప్రియా దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    1
    ప్రియా దేవుని బిడ్డలకు ప్రభువు యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
    user_T. Raja simha
    T. Raja simha
    ఆత్మకూరు, హనుమకొండ, తెలంగాణ•
    8 hrs ago
  • ములుగు గోవిందరావుపేట 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి. ములుగు గోవిందరావుపేట 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి? ఖబడ్దార్ బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు మండల అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డిని హెచ్చరించిన పాలడుగు వెంకటకృష్ణ. ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశములో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ పాల్గొని ములుగు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డి 39 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు రాజకీయంగా తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కొత్తగూడలో మంత్రి సీతక్క మాట్లాడి ఆరు రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు రమేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. “ఆ విషయం మీద స్పందించాల్సి ఉంటే అప్పుడే స్పందించాలి. ఇన్ని రోజుల తర్వాత పాత ఘటనను తెరపైకి తీసుకురావడం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం ఉంది?” అని నిలదీశారు. మీ పార్టీ నాయకుడు ఏరువా సతీష్ రెడ్డి అలియాస్ గుంటూరు సతీశ్ రెడ్డిపై ఇసుక కాంట్రాక్టర్లను బెదిరించి, చక్రపాణి అనే మధ్యవర్తి ద్వారా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా అని వెంకటకృష్ణ అన్నారు. “రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని, అందులో రూ.1.80 కోట్ల నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా. నిజంగా అది అవాస్తవం అయితే సతీశ్ రెడ్డి ప్రజల ముందు స్పష్టమైన వివరణ ఇవ్వాలి కదా? ఎందుకు ఇవ్వట్లేదు. ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు. అసలు ఈ నగదు తీసుకున్న వాస్తవాలను కప్పి పుచ్చడానికి, వాటికి సమాధానం చెప్పకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారా? అని రమేశ్ రెడ్డిని ప్రశ్నించారు. బహిరంగ చర్చకు రండి. ప్రజలు ఎవరి మాటలో నిజం ఉందో, ఎవరు విషయాన్ని దారి మళ్లిస్తున్నారో తేల్చుతారు.”అని పాలడుగు వెంకటకృష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సీనియర్ నాయకులు కనతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చింత క్రాంతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భుక్య రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భైరి అభిలాష్, మాజీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి, కాడబోయిన రవి, జిల్లా కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, గణపాక సుధాకర్, తండా కృష్ణ, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ లావుడ్యా జోగా, రేగుల లక్ష్మణ్, ఇర్ప విజయ, గోపిదాసు వజ్రమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
    2
    ములుగు గోవిందరావుపేట 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి.
ములుగు గోవిందరావుపేట 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తేవడం వెనుక ఆంతర్యమేంటి?
ఖబడ్దార్ బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు మండల అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డిని హెచ్చరించిన పాలడుగు వెంకటకృష్ణ.
ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశములో గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ  పాల్గొని ములుగు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సానికొమ్ము రమేశ్ రెడ్డి 39 సంవత్సరాల క్రితం జరిగిన ఘటనను ఇప్పుడు రాజకీయంగా తెరపైకి తీసుకురావడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
కొత్తగూడలో మంత్రి సీతక్క  మాట్లాడి ఆరు రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు రమేశ్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. “ఆ విషయం మీద స్పందించాల్సి ఉంటే అప్పుడే స్పందించాలి. ఇన్ని రోజుల తర్వాత పాత ఘటనను తెరపైకి తీసుకురావడం వెనుక ఏ రాజకీయ ప్రయోజనం ఉంది?” అని నిలదీశారు.
మీ పార్టీ నాయకుడు ఏరువా సతీష్ రెడ్డి అలియాస్ గుంటూరు సతీశ్ రెడ్డిపై ఇసుక కాంట్రాక్టర్లను బెదిరించి, చక్రపాణి అనే మధ్యవర్తి ద్వారా భారీ మొత్తంలో నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా అని వెంకటకృష్ణ అన్నారు.
“రెండు కోట్ల రూపాయల ఒప్పందం కుదిరిందని, అందులో రూ.1.80 కోట్ల నగదు తీసుకున్నారన్నది వాస్తవం కాదా. 
నిజంగా అది అవాస్తవం అయితే సతీశ్ రెడ్డి ప్రజల ముందు స్పష్టమైన వివరణ ఇవ్వాలి కదా? 
ఎందుకు ఇవ్వట్లేదు. ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి” అని డిమాండ్ చేశారు.
అసలు ఈ నగదు తీసుకున్న వాస్తవాలను కప్పి పుచ్చడానికి, వాటికి సమాధానం చెప్పకుండా, ప్రజల దృష్టిని మళ్లించేందుకే 39 ఏళ్ల నాటి ఘటనను ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారా? అని రమేశ్ రెడ్డిని ప్రశ్నించారు.
బహిరంగ చర్చకు రండి. ప్రజలు ఎవరి మాటలో నిజం ఉందో, ఎవరు విషయాన్ని దారి మళ్లిస్తున్నారో తేల్చుతారు.”అని పాలడుగు వెంకటకృష్ణ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్మిక శాఖా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, సీనియర్ నాయకులు కనతల నాగేందర్ రావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారామ్ నాయక్, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చింత క్రాంతి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భుక్య రాజు, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు భైరి అభిలాష్, మాజీ ఎంపీటీసీ చాపల ఉమాదేవి, కాడబోయిన రవి, జిల్లా కార్యదర్శి జంపాల చంద్రశేఖర్, గణపాక సుధాకర్, తండా కృష్ణ, రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, సర్పంచ్ లావుడ్యా జోగా, రేగుల లక్ష్మణ్, ఇర్ప విజయ, గోపిదాసు వజ్రమ్మ తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_Matla sampath
    Matla sampath
    ములుగు, ములుగు, తెలంగాణ•
    22 hrs ago
  • పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం మాల్దా (పశ్చిమ బెంగాల్): పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. ​దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు. ​వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది. ​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    1
    పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణ దాడి: బెంగాల్‌లో కలకలం


మాల్దా (పశ్చిమ బెంగాల్):
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. విద్యార్థి బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ) జారీ చేసే విషయంలో తలెత్తిన వివాదమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.వివాదం: పాఠశాలలో చదువుతున్న ఒక విద్యార్థి టీసీ జారీ వ్యవహారంలో ఉపాధ్యాయురాలితో కొందరు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు.
​దాడి: నిబంధనల ప్రకారం వెంటనే టీసీ ఇచ్చేందుకు సదరు టీచర్ నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన వారు ఆమెపై భౌతిక దాడికి దిగారు.
​వైరల్ వీడియో: పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ దాడి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్థానికంగా తీవ్ర దుమారం రేగింది.
​ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా నిందితులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. విద్యాబుద్ధులు నేర్పే పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిపై దాడి జరగడంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
    user_ఆడెపు రాంకిషన్
    ఆడెపు రాంకిషన్
    Content Creator (YouTuber) వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    51 min ago
  • కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
    1
    కాలనీల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత.. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే నాయిని
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం 4వ డివిజన్ పరిధిలోని జ్యోతిబాస్ నగర్, పెద్దమ్మగడ్డ, అక్షర కాలనీ తదితర ప్రాంతాల్లో రూ.1.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ తదితర మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రారంభించిన పనులకు నిర్దిష్ట కాలపరిమితి విధించి నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.
జ్యోతిబాస్ నగర్‌లో ఇప్పటికే ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, మిగిలిన రెండు చిన్న గల్లీల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ వ్యవస్థలో సమస్యలు లేకుండా సమగ్ర అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
మౌలిక వసతుల కల్పనతో పాటు పేదల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాయిని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులు, పెన్షన్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • 𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌[𝐌𝐀𝐋𝐄][𝐁𝐀 3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔;𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][☆𝐎𝐖𝐍:𝐇𝐎𝐔𝐒𝐄;𝐍𝐎.3-9-592##𝐑𝐄𝐃𝐃𝐘 𝐂𝐎𝐋𝐎𝐍𝐘#𝐑𝐎𝐀𝐃 𝐍𝐎.1#𝐇𝐀𝐍𝐀𝐌 𝐊𝐎𝐍𝐃𝐀 -𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂#][☆𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀𝐍𝐀 :𝐓𝐇𝐄𝐋𝐔𝐆𝐔-𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄-𝐒𝐓𝐀𝐓𝐄*#☆☆𝐈𝐍𝐃𝐈𝐀-𝐊𝐍𝐓𝐑𝐈#𝐀𝐒𝐈𝐀#☆☆☆𝐖𝐎𝐑𝐋𝐃#]
    1
    𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐓𝐀𝐌[𝐌𝐀𝐋𝐄][𝐁𝐀 3𝐑𝐃 𝐘𝐄𝐀𝐑][𝐇𝐈𝐍𝐃𝐇𝐔;𝐑𝐄𝐋𝐈𝐆𝐈𝐎𝐍][☆𝐎𝐖𝐍:𝐇𝐎𝐔𝐒𝐄;𝐍𝐎.3-9-592##𝐑𝐄𝐃𝐃𝐘 𝐂𝐎𝐋𝐎𝐍𝐘#𝐑𝐎𝐀𝐃 𝐍𝐎.1#𝐇𝐀𝐍𝐀𝐌 𝐊𝐎𝐍𝐃𝐀 -𝐂𝐈𝐓𝐘&𝐃𝐈𝐒𝐓𝐑𝐈𝐂#][☆𝐓𝐇𝐄𝐋𝐀𝐍𝐆𝐀𝐀𝐍𝐀 :𝐓𝐇𝐄𝐋𝐔𝐆𝐔-𝐋𝐀𝐍𝐆𝐔𝐀𝐆𝐄-𝐒𝐓𝐀𝐓𝐄*#☆☆𝐈𝐍𝐃𝐈𝐀-𝐊𝐍𝐓𝐑𝐈#𝐀𝐒𝐈𝐀#☆☆☆𝐖𝐎𝐑𝐋𝐃#]
    user_𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    𝐒𝐀𝐍𝐃𝐄𝐄𝐏 𝐓𝐇𝐎𝐔𝐀𝐌]
    Tour operator Hanamkonda, Hanumakonda•
    11 hrs ago
  • బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ ప్రెస్ నోట్ బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు. “యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. “పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.
    1
    బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్
ప్రెస్ నోట్
బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్
తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు.
“యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
“పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...........
నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    1
    ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి....
సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం.
దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.