Shuru
Apke Nagar Ki App…
ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Chetty:Ramesh
ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. దాస్యం వినయ్ భాస్కర్.. హనుమకొండ: హనుమకొండ నగరంలోని వైఎస్సార్ నగర్ కాలనీని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ సోమవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలు, అభివృద్ధి అవసరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలనీవాసులకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన దాస్యం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై నిరంతరం నిలదీస్తామని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.1
- సత్యసాయి నగర్ పోచమ్మ దేవాలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వరంగల్ (సత్యసాయి నగర్), ఆగస్టు 23: వరంగల్ నగరంలోని నాయుడు పెట్రోల్ బంక్ ప్రాంతం, సత్యసాయి నగర్ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ పెద్దలు అన్ని ఏర్పాట్లు, ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన పోచమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి.1
- 23/08/2026 మహబూబాబాద్ : జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతను ఉద్దేశించి చారి గారి సందేశం మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు. ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు. యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.1
- బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.1
- కరీంనగర్ లో రోడ్డెక్కిన 22ఏ బాధితులు...కలెక్టరేట్ ఎదుట మహాధర్నా....వారంరోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తాం- ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరిక ఏళ్ల తరబడి పట్టాలు ఉండి నివాసాలు ఏర్పరచుకొని ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న భూములను సైతం నిషేధిత 22ఏ జాబితాలో చేర్చడంపై కరీంనగర్ లో బాధితులు ఆందోళనకు దిగారు. బిఆర్ఎస్ ఆధ్వర్యంలో రేకుర్తి, విద్యానగర్ బాధితులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి మహా ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ లు రవీందర్ రెడ్డి, అనిల్ గౌడ్, నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్ తోపాటు కార్పోరేట్మర్ లు పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని రేకుర్తి, విద్యానగర్, హిందూపురి కాలనీ, కొత్తపల్లి, ఆరేపల్లి తో పాటు పలు కాలనీలకు చెందిన దాదాపు 1000 ఎకరాల పట్టా భూమిని నిషేధిత 22ఏ జాబితాలో చేర్చారని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేని పట్టా భూములను 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని కోరారు. 22ఏపై పొంతన లేని సమాధానం చెబుతున్న రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పట్టాలున్న భూములను 22a జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించనిచో కలెక్టరేట్ నుంచి సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేపట్టి ఆందోళన ఉదృతం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.3
- ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.1
- హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.1
- భూపాలపల్లిలో చైన్ స్నాచింగ్ కలకలం.. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన దుండగులు జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు లక్ష్మీనగర్‌లో సోమవారం ఉదయం చైన్ స్నాచింగ్ యత్నం కలకలం రేపింది. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వృద్ధ దంపతులను వెంబడించిన ఓ దుండగుడు మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే గొలుసు తెగకపోవడంతో యత్నం విఫలమైంది. అనంతరం దుండగుడు వీధి చివర బైక్‌పై సిద్ధంగా ఉన్న మరో వ్యక్తితో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో లక్ష్మీనగర్‌లో ఓ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాల చోరీ జరిగిన నేపథ్యంలో తాజా ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, బ్లూ కోల్ట్స్‌తో పాటు పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని స్థానికులు పోలీసు అధికారులను కోరుతున్నారు.1
- ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.1