logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

3 hrs ago
user_ఖమ్మం రిపోర్టర్
ఖమ్మం రిపోర్టర్
ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago

బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
    1
    ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు
ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక... అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు నేలకొండపల్లి మండలం లోని శంకర్ గిరి తండా లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు సంస్కృతి సాంప్రదాయాల పండగ గతంలో లేని విధంగా ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    అంగరంగ వైభవంగా తీస్ సంబరాలు 
 బంజారా సాంప్రదాయ లో భాగంగా అత్యంత వైభవంగా వేడుక...
అంగరంగం వైభవంగా తీజ్ వేడుకలు
నేలకొండపల్లి
మండలం లోని శంకర్ గిరి తండా  లో ఆదివారం తీజ్ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. డీజే ఆటా, పాటలతో గిరిజన సాంప్రాదాయ వస్త్రాలతో నృత్యాలు చేశారు. మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ..... గ్రామంలో, అక్కా చెల్లెలు ఆడబిడ్డలు అన్నదమ్ములు  సంస్కృతి సాంప్రదాయాల పండగ  గతంలో లేని విధంగా  ఎంతో ఆనందంగా ముగింపు సందర్భంగా దేవాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ ధరావత్ దీప్లా సరోజిని  దంపతులు అమ్మవారికి వస్త్రాలు సమర్పించి, మొక్కులు చెల్లించగానే..అదే
సమయంలో వర్షం పడటంతో గిరిజనుల సంబురాలు
అంబరాన్నింటాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter Nelakondapalli, Khammam•
    15 hrs ago
  • తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
    1
    తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.
నేలకొండపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో లో ముత్యాలమ్మ తల్లి సంబరాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రజలు ఐక్యతతో పండుగను ఉత్సాహభరితంగా నిర్వహించారు.ఉదయం నుంచే భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. గ్రామంలోని ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • 23/08/2026 మహబూబాబాద్ : జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతను ఉద్దేశించి చారి గారి సందేశం మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు. ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు. యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.
    1
    23/08/2026 మహబూబాబాద్ :  జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ 
యువతను ఉద్దేశించి చారి గారి సందేశం
మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ,
యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు.
ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు.
పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    1
    తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • నేను చేసింది తప్పే... నేను చేసింది తప్పే భాసింగా బలాలు ఈశ్వర్.. నేను చేసింది తప్పే: బాసింగ బలాలు ఈశ్వర్ TG: ఇటీవల ఓ యువతితో రూములో కన్పించిన ఫోక్ డాన్సర్, బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి ఆ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. తన పరిస్థితి, ఒత్తిడి తదితర కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కాగా ఈశ్వర్ సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేశారని సదరు యువతి వేములవాడ PSలో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది.
    1
    నేను చేసింది తప్పే...
 నేను చేసింది తప్పే భాసింగా బలాలు ఈశ్వర్..
నేను చేసింది తప్పే: బాసింగ బలాలు ఈశ్వర్
TG: ఇటీవల ఓ యువతితో రూములో కన్పించిన ఫోక్ డాన్సర్, బాసింగ బలాలు ఫేమ్ ఈశ్వర్ సాయి ఆ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం కరెక్ట్ కాదని, తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. తన పరిస్థితి, ఒత్తిడి తదితర కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. కాగా ఈశ్వర్ సాయి భార్య తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి, దాడి చేశారని సదరు యువతి వేములవాడ PSలో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది.
    user_తేజవత్ గిరిబాబు
    తేజవత్ గిరిబాబు
    Local News Reporter Nelakondapalli, Khammam•
    21 hrs ago
  • ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...........
నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    1
    లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    1
    ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి....
సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం.
దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.