Shuru
Apke Nagar Ki App…
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
V Ramarao
లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
More news from తెలంగాణ and nearby areas
- విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు1
- తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.1
- ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు1
- నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత.. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం... ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు. ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు. ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.1
- ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలి తెలంగాణ ఆటో జేఏసీ బందుకు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు తెలంగాణ ఆటో జేఏసీ బంద్‌కు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆగస్టు 24న చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధాన డిమాండ్లు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలి. ఆటో కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. రాష్ట్రంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఆర్టీసీ ఆటోలను నిలిపివేయాలి. ఆటో కార్మికుల జీవనోపాధిపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బూర్గంపాడు మండల ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.1
- తృటిలో తప్పిన పెనుప్రమాదం....... . లోయ అంచున బస్సు....... ప్రయాణికులు సేఫ్ లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుం తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.1
- ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.1
- లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.1