logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలి తెలంగాణ ఆటో జేఏసీ బందుకు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు తెలంగాణ ఆటో జేఏసీ బంద్‌కు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆగస్టు 24న చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధాన డిమాండ్లు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలి. ఆటో కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. రాష్ట్రంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఆర్టీసీ ఆటోలను నిలిపివేయాలి. ఆటో కార్మికుల జీవనోపాధిపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బూర్గంపాడు మండల ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

1 day ago
user_Banatha. Raja
Banatha. Raja
బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
1 day ago

ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలి తెలంగాణ ఆటో జేఏసీ బందుకు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు తెలంగాణ ఆటో జేఏసీ బంద్‌కు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ సంపూర్ణ మద్దతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుకు బూర్గంపాడు మండల ఆటో యూనియన్ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆగస్టు 24న చేపట్టనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఆటో యూనియన్ అధ్యక్షులు ఆటో కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రధాన డిమాండ్లు తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి. అర్హులైన ఆటో కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలి. ఆటో కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. రాష్ట్రంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఆర్టీసీ ఆటోలను నిలిపివేయాలి. ఆటో కార్మికుల జీవనోపాధిపై అదనపు భారం మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బూర్గంపాడు మండల ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత.. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం... ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు. ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు. ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.
    1
    నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత..
ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం...
ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు.
ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు.
ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • తృటిలో తప్పిన పెనుప్రమాదం....... . లోయ అంచున బస్సు....... ప్రయాణికులు సేఫ్ లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుం తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    1
    తృటిలో తప్పిన పెనుప్రమాదం....... . లోయ అంచున బస్సు.......  ప్రయాణికులు సేఫ్ 
లోయ అంచున ఆగిన బస్సు.. తప్పిన భారీ ప్రమాదం
మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా కన్నడ్ ఘాట్‌లో ఛత్రపతి శంభాజీనగర్ నుంచి సూరత్ వెళ్తున్న బస్సు ప్రమాదం నుం తప్పించుకుంది. సోమవారం బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరిగిపోవడంతో అదుపుతప్పి బ్రిడ్జి సేఫ్టీ వాల్‌ను ఢీకొని లోయ అంచున ఆగిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం జరగలేదు. సేఫ్టీ వాల్ లేకుంటే బస్సు లోయలో పడిపోయి ఉండేదని ప్రయాణికులు తెలిపారు.
    user_Radhika
    Radhika
    Tailor భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు
    1
    విద్యార్ధులు మహిళా ఉపాధ్యాయురా పరస్పరం దారుణంగా కొట్టుకున్నారు 

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలోని ఒక పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిపై దారుణంగా దాడి 
విద్యార్థి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC) జారీ చేసే విషయంలో సదరు ఉపాధ్యాయురాలితో గొడవపడి, ఆమెపై దాడి 
టీసీ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆగ్రహానికి గురై దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసింది 
ఘటనకు సంబంధించిన వీడియో వైరలవ్వగా పోలీసులు దర్యాప్తు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    57 min ago
  • తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    1
    తుంబూరు సొసైటీలో యూరియా కొరతపై రైతుల ఆందోళన
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలోని సొసైటీలో యూరియా కొరతపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్ ద్వారా తుంబూరు సొసైటీ రైతులకు యూరియా బుక్ కావడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇతర సొసైటీల రైతులు బుక్ చేసుకుంటే యూరియా ఎలా అందుబాటులోకి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.
పంట వేసి దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు యూరియా అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బుకింగ్‌కు 5జీ ఫోన్ అవసరమని సొసైటీ సిబ్బంది చెబుతున్నారని రైతులు తెలిపారు. అయితే 5జీ ఫోన్‌లో ప్రయత్నించినా యూరియా బుక్ కావడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించి, తమకు అవసరమైన ఎరువులను అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***. రేషన్ బియ్యం పట్టివేత సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    1
    ***సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం***.   రేషన్ బియ్యం పట్టివేత

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం నుంచి ఏపీలోని కాకినాడకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా శనివారం తెల్లవారుజా మున పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో రేషన్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, మధ్యవర్తి ద్వారా కాకినాడకు బియ్యం తరలిం చేందుకు ఆటోలు లోడ్ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీసులు దాడులు నిర్వహించగా 25క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పోలీస్ స్టేషన్కు తరలించారు. రేషన్ బియ్యం తరలించడానికి ప్రయత్నించిన నక్క వెంకటేశ్వరరావు, మధ్యవర్తి ఏపీకి చెందిన రాజా, కాకినాడకు చెందిన బాబీపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. పట్టుబడిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పంచనామా నిర్వహించి సివిల్ సప్లై గోదాంకు తరలించారు
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ ప్రెస్ నోట్ బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్ తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు. “యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు. “పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.
    1
    బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్
ప్రెస్ నోట్
బీసీల రాజ్యాధికారమే లక్ష్యం — యువత ముందుకు రావాలి: బత్తుల కుమారస్వామి యాదవ్
తేది: 23-08-2026 | వేదిక: మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బత్తుల కుమారస్వామి యాదవ్ మరిపెడ మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ సిద్ధాంతాలు, సామాజిక న్యాయం, బీసీల రాజ్యాధికారం సాధనలో యువత పాత్రపై ఆయన కీలక సందేశాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా బత్తుల కుమారస్వామి యాదవ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు.. సామాజిక న్యాయం, సమానత్వం, బీసీలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడే వేదిక. బీసీల జనాభాకు అనుగుణంగా రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో మనం ముందుకు సాగాలి” అని అన్నారు.
“యువత రాజకీయాలను దూరంగా ఉంచకుండా రాజ్యాంగాన్ని చదవాలి, తమ హక్కులను తెలుసుకోవాలి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి. యువత చైతన్యవంతమై సంఘటితమైతేనే బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం సాధ్యమవుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
“పార్టీ సిద్ధాంతాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లే బాధ్యత యువతపై ఉంది. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే నాయకత్వాన్ని నిర్మించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరంతరం పోరాడాలి” అని బత్తుల కుమారస్వామి యాదవ్ పిలుపునిచ్చారు.
మహబూబాబాద్ జిల్లాలో యువతను పెద్ద సంఖ్యలో పార్టీతో అనుసంధానం చేసి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. “యువత ముందుకు వస్తే మార్పు సాధ్యం. బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం దక్కే వరకు మన పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు యువత పాల్గొన్నారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    8 hrs ago
  • ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం: స్థిరంగా ఏసీ మిర్చి ధర... నాన్ ఏసీ మిర్చి, తగ్గిన పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,000, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,900, అటు క్వింటా పత్తి ధర రూ.9,100గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈనెల 21 శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, నాన్ ఏసీ మిర్చి ధర రూ.100, పత్తి రూ.200 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • డీజే సౌండ్‌తో మెడికల్‌ షాపులో మందులు కిందకు.. వైరల్‌గా వీడియో డీజే సౌండ్‌ సిస్టమ్‌ నుంచి వచ్చిన భారీ శబ్దాలు, కంపనాలతో ఓ మెడికల్‌ షాపులోని మందులు, ఇతర వస్తువులు షెల్ఫ్‌లపై నుంచి కిందపడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే కారణంగా పెద్ద శబ్దాలు రావడంతో ఈ ఘటన జరిగినట్లు వీడియోకు సంబంధించిన పోస్టులు పేర్కొంటున్నాయి. షాపు యజమాని నిర్వాహకులను శబ్దం తగ్గించాలని కోరినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో అసహనానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వేడుకల పేరుతో అధిక శబ్ద కాలుష్యానికి పాల్పడవద్దని కోరుతున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో వస్తున్న “డీజేల వల్లే హార్ట్‌ ఎటాక్స్‌” వంటి వ్యాఖ్యలకు ఈ వీడియో ఒక్కటే ఆధారం కాదని గమనించాలి.
    1
    డీజే సౌండ్‌తో మెడికల్‌ షాపులో మందులు కిందకు.. వైరల్‌గా వీడియో
డీజే సౌండ్‌ సిస్టమ్‌ నుంచి వచ్చిన భారీ శబ్దాలు, కంపనాలతో ఓ మెడికల్‌ షాపులోని మందులు, ఇతర వస్తువులు షెల్ఫ్‌లపై నుంచి కిందపడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే కారణంగా పెద్ద శబ్దాలు రావడంతో ఈ ఘటన జరిగినట్లు వీడియోకు సంబంధించిన పోస్టులు పేర్కొంటున్నాయి. షాపు యజమాని నిర్వాహకులను శబ్దం తగ్గించాలని కోరినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంతో అసహనానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. 
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ వేడుకల పేరుతో అధిక శబ్ద కాలుష్యానికి పాల్పడవద్దని కోరుతున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో వస్తున్న “డీజేల వల్లే హార్ట్‌ ఎటాక్స్‌” వంటి వ్యాఖ్యలకు ఈ వీడియో ఒక్కటే ఆధారం కాదని గమనించాలి.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.