logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత.. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం... ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు. ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు. ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.

3 hrs ago
user_Velpula Manoj Kumar
Velpula Manoj Kumar
బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
3 hrs ago

నిరుపేద విద్యార్థికి ఆర్థిక చేయూత.. ఏజెన్సీ ప్రాంతంలో నిరుపేద విద్యార్థుల విద్యను ప్రోత్సహిద్దాం... ములకలపల్లి: సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని సామాజిక సేవా కార్యకర్త, GSS రాష్ట్ర యువజన నాయకుడు ఆరెం ప్రశాంత్ అన్నారు. ములకలపల్లి మండలం టేకులగుంపు గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నక్క సంతోష్ ఎంబీబీఎస్ విద్యార్థి. అతని చదువుకు తన వంతు సహాయంగా మిత్రులతో కలిసి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆరెం ప్రశాంత్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మండల, నియోజకవర్గ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, అధికారులు స్పందించి తమకు ఉన్నంతలో సంతోష్‌కు సహాయం అందించాలని కోరారు. ఒక విద్యార్థికి అండగా నిలిస్తే భవిష్యత్తులో ఒక మంచి వైద్యుడిని సమాజానికి అందించినట్లవుతుందని పేర్కొన్నారు. నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ఆరెం ప్రశాంత్ పిలుపునిచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    1
    లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • 23/08/2026 మహబూబాబాద్ : జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతను ఉద్దేశించి చారి గారి సందేశం మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు. ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు. యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.
    1
    23/08/2026 మహబూబాబాద్ :  జిల్లా మరిపెడ మండలం వెదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ 
యువతను ఉద్దేశించి చారి గారి సందేశం
మరిపెడ మండలం కేంద్రంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సీనియర్ నాయకులు చారి గారు యువతను ఉద్దేశించి మాట్లాడుతూ,
యువతే దేశానికి, సమాజానికి నిజమైన భవిష్యత్ శక్తి అని అన్నారు.
ప్రతి యువకుడు రాజకీయ చైతన్యంతో పాటు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే ధైర్యం యువతలో ఉండాలని అన్నారు.
పదవుల కోసం కాకుండా ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావాలని సూచించారు.
యువత ఐక్యంగా ముందుకు వస్తే సమాజంలో గొప్ప మార్పు తీసుకురాగలరని తెలిపారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువతకు అండగా నిలుస్తుందని, ప్రతి యువకుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.
యువత మేల్కొంటే మార్పు సాధ్యం — యువత ముందుకు వస్తే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని చారి గారు స్పష్టం చేశారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది. బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
    1
    బార్‌లో మద్యం మత్తులో పోలీసుల రచ్చ..! బెటాలియన్ కానిస్టేబుల్‌పై లాఠీ దాడి
వరంగల్ జిల్లా ఉర్సుగుట్ట వద్ద ఓ బార్‌లో మద్యం మత్తులో ఓ బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేసిన ఘటన కలకలం రేపింది.
బార్‌లో మద్యం సేవించిన బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడంటూ బార్ సిబ్బంది 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు చేరుకున్నారు. అక్కడ న్యూసెన్స్ చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ చెంపపై కొట్టినట్లు సమాచారం.
దీంతో ఆగ్రహించిన బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి సంతోష్ రెడ్డి చెంపపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ క్రమంలో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి లాఠీతో బెటాలియన్ కానిస్టేబుల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ ఘటనలో జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
మద్యం మత్తులో మొదలైన న్యూసెన్స్... చివరకు ఇద్దరు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసిన ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    1
    భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను  ఘనంగా నిర్వహించారు.
నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం. కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు . మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No 222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు. ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే, అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్. సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నేరపురిత బెదిరింపులతో వసూళ్ల కేసులు నిందితుడు ఉపయోగించిన వాహన స్వాధీనం
ఎన్టీఆర్ జిల్లా మైలవరం
నేరపూరిత బెదిరింపులతో కూడిన వసూళ్ల కేసులో నిందితుడు ఉపయోగించిన వాహనం స్వాదీనం.
కారులో తుపాకి ఉందని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవము గమనించగలరు .
మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మెయిన్ రోడ్డు లోని ఒక హోటల్ కు ఒక వ్యక్తి  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పుకుంటూ మరో వ్యక్తితో  వచ్చి అక్కడి వంటగదిని తనిఖీ చేసి ఆహార నమూనాలను సేకరించినట్లు తరువాత సదరు వ్యక్తి యొక్క కారు (AP16DQ3479)లో ఫిర్యాదిని కూర్చోబెట్టుకుని  హోటల్‌ను సీజ్ చేస్తామని, తనిఖీ సమయంలో తీసిన ఫోటోలు/వీడియోలను మీడియాలో ప్రచారం చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలవరం పోలీసులు Cr. No  222/2026, సెక్షన్లు: 308(2), 351(2) BNS కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు దర్యాప్తులో బాగంగా సదరు కారు వివరాలను ఆధునిక టెక్నాలజీ సూరక్షా 360 సి. సి. కెమెరాలలో పొందుపరచడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదరు కారు నున్న ప్రాతంలోని ఉన్నట్లు అలర్ట్ రావడంతో వెంటనే పోలీస్ వారు అప్రమత్తమై అక్కడకు వెళ్ళేసరికి పోలీస్ వారి రాకను గమనించిన  ముద్దాయి కారును వదిలేసి పారిపోయినాడు.
ఈ క్రమంలో సదరు కారును స్వాదీనం చేసుకుని తనిఖీ చేస్తున్న క్రమంలో  పోలీసులకు తుపాకీ లాంటి ఒక బొమ్మ పిస్టల్ లభించింది. దానిని పరిశీలించగా అది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే,  అంతేగానీ నిజమైన తుపాకి కాదు ఇది ఒక తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్.  సదరు ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. ముద్దాయి అయిన కుంభా గోవిందు @ వజ్రం ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది.  కానీ కొన్ని సోషల్ మీడియా లలో మరియు టి. వి. ఛానెల్స్ లలో కారులో నిజమైన తుపాకీ దొరికిందని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది కేవలం తుపాకి మోడల్ లో ఉన్న సిగరెట్ లైటర్ మాత్రమే అని తెలియజేస్తున్నాము గమనించగలరు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి.. రవాణా శాఖ సిబ్బందిపై ఆరోపణలు విశాఖపట్నం, గాజువాక: షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన వివాదాస్పదంగా మారింది. వాహనం నిలపలేదన్న కారణంతో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్‌టేక్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిడిగుద్దులతో దాడి చేయడంతో లారీ డ్రైవర్‌కు రక్తగాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనను నిరసిస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
    2
    విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి.. రవాణా శాఖ సిబ్బందిపై ఆరోపణలు
విశాఖపట్నం, గాజువాక: షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ డ్రైవర్‌పై దాడి జరిగిన ఘటన వివాదాస్పదంగా మారింది. వాహనం నిలపలేదన్న కారణంతో రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్ పార్వతి లారీని ఓవర్‌టేక్ చేసినట్లు సమాచారం. అనంతరం ఇన్‌స్పెక్టర్ సమక్షంలో ఆమె డ్రైవర్ లారీ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పిడిగుద్దులతో దాడి చేయడంతో లారీ డ్రైవర్‌కు రక్తగాయాలు అయినట్లు సమాచారం.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ లారీ అసోసియేషన్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనను నిరసిస్తూ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
    user_Velpula Manoj Kumar
    Velpula Manoj Kumar
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    5 hrs ago
  • ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.
    1
    ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు.. గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది
ఖమ్మం జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది..గడిచిన రాత్రి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రహదారులన్నీ జలమయంగా మారి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిన్నటివరకు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరైన ఖమ్మం జిల్లా ప్రజలకు.. ఈ వర్షాలు కాస్త ఊరటనిస్తున్నాయి. చల్లటి వాతావరణంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.మరోవైపు.. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.అయితే ఈ వర్షాలు రైతులకు మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ పనులకు వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు అవసరమైన నీరు అందడంతో సాగుకు మరింత ఊతం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇక జిల్లాలోని పలు మండలాల్లో కూడా వర్షం ప్రభావం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీటితో రహదారులు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. మరోవైపు రైతులకు మాత్రం ఈ వర్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి.
    user_ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం రిపోర్టర్
    ఖమ్మం (గ్రామీణ), ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ........... నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ...........
నర్సంపేట: మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ కాంపెళ్లి వీణ విజేందర్ రెడ్డి రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి.... సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం. దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    1
    ఐఫోన్ 15 కోసం విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి....
సంభాజీనగర్: ఐఫోన్ 15 కొనివ్వాలని కోరుతూ తల్లిదండ్రులతో జరిగిన గొడవ విషాదానికి దారితీసింది. 18 ఏళ్ల యువకుడు ఖవ్‌ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించినట్లు సమాచారం.
దాదాపు మూడు గంటల పాటు తల్లిదండ్రులు అతడిని బతిమిలాడినా వినలేదని తెలుస్తోంది. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ కొండపై నుంచి కిందపడి మృతి చెందారు. ఈ ఘటనతో తీవ్ర విషాదానికి గురైన తల్లి కూడా కొండపై నుంచి దూకినట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో సంభాజీనగర్‌లో విషాదం నెలకొంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.